ఉడుమును రేప్ చేసినట్లు ఆరోపణలు, మహారాష్ట్రలో నలుగురు అరెస్ట్
మహారాష్ట్ర సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో ఒక ఉడుము మీద అత్యాచారం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ విషయం అధికారులకు ఎలా తెలిసింది?
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
“మా ఊరు ఒకసారి రావచ్చు కదా అని నాకు కాబోయే భార్య ఫోన్ చేసింది. దాంతో నేను వెళ్లాను. ఇంటికి వెళ్లగానే నాతో మాట్లాడాలంటూ కొండపై ఉన్న సాయిబాబా ఆలయానికి తీసుకుని వెళ్లింది. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను.. కళ్లు మూసుకోమని చెప్పింది. నేను కళ్లు మూసుకున్నాను. వెంటనే ఆమె చాకుతో నా గొంతు కోసింది. గొంతు కోసిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉంది.”
మహారాష్ట్ర సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో ఒక ఉడుము మీద అత్యాచారం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ విషయం అధికారులకు ఎలా తెలిసింది?
యుక్రెయిన్‌లోని లీవ్యూ ప్రాంతం మీద నాలుగు మిసైల్స్ దాడి చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ మాకిజం కొజిత్సకీ తెలిపారు.
ఇది తనకున్న ప్రాథమిక సమాచారమని, ప్రజలు షెల్టర్లలో ఉండాలని ఆయన తన అధికారిక టెలిగ్రాంలో చానెల్ ద్వారా తెలిపారు.
యుక్రెయిన్-పోలండ్ సరిహద్దుల్లో ఉన్న లీవ్యూలో సుమారు అయిదు పేలుళ్లు వినిపించాయి. కానీ వీటి మీద ఇంత వరకు అధికారిక సమాచారం లేదు.
కొన్ని ప్రాంతాల నుంచి నల్లని దట్టమైన పొగలు రావడం కనిపించింది. బీబీసీ టీంలోని కొందరు గాలిలో దూసుకు పోతున్న మిసైల్‌ను చూశారు.
పేలుళ్లు జరగడానికి 45 నిమిషాల ముందు హెచ్చరిక సైరెన్ మోగింది.
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 2శాతం మేర నష్టపోయాయి. ప్రస్తుతం నిఫ్టీ 313 పాయింట్లు నష్టపోగా సెన్సెక్స్ 1197 పాయింట్లు కోల్పోయింది.
ఐటీ(4.62%), బ్యాంకింగ్(1.80%)రంగాలు ప్రధానంగా నష్టపోయాయి.
ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేర్ ధర 7శాతానికిపైగా నష్టపోయింది. గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మదుపర్లను మెప్పించలేక పోయాయి.
చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం కూడా భారత స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపాయి.
ప్రస్తుతం రూ.124 నష్టపోయి రూ.1,624 వద్ద ఇన్ఫోసిస్ షేరు ట్రేడవుతోంది.
లఖింపుర్ ఖేరీ రైతుల మరణాల కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది.
వారం రోజుల్లోగా లొంగి పోవాలని ఆయన్ను ఆదేశించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 10న అలహాబాద్ హై కోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని నేడు కొట్టి వేసిన సుప్రీం కోర్టు, బెయిల్ పిటీషన్‌ను హడావుడిగా విచారించి తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించింది.
మళ్లీ బెయిల్ పిటీషన్ మీద విచారణ చేపట్టాలంటూ అలహాబాద్ హై కోర్టును ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
యుక్రెయిన్‌లోని దొన్బస్ ప్రాంతం నుంచి యుద్ధంలో గాయపడిన ప్రజలను రైళ్లలో పశ్చిమ ప్రాంతానికి తరలిస్తున్నారు.
12 ఏళ్ల కతియా స్ట్రైచర్ మీద ఉంది. క్రమటరస్క్ రైల్వేస్టేషన్ మీద కొద్ది రోజులు కిందట జరిగిన మిసైల్ దాడిలో ఆ అమ్మాయి తల్లి చనిపోయారు.
ఆ దాడిలో తీవ్రంగా గాయపడింది కతియా. మరింత మెరుగైన వైద్యం అవసరం కావడంతో కతియాను రైల్లో పశ్చిమ యుక్రెయిన్‌కు తరలిస్తున్నారు.
ఇలా తమ వారిని పోగొట్టుకున్న చాలా మంది ఈ రైల్లో ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ఇలా వడగళ్ల వాన పడటం వారం రోజుల్లో ఇది రెండోసారి.
సాధారణంగా వేసవిలో ఏజెన్సీ ప్రాంతంలో వడగళ్ల వానలు పడుతుంటాయి.
ప్రపంచంలోనే అత్యధిక పులుల సంతతి కలిగిన దేశం భారత్. అయితే, దశాబ్దాల క్రితం ఈ నేలకు చేరిన కొన్ని విదేశీ కలుపుజాతి మొక్కలు నేడు పులుల మనుగడకు ముప్పుగా మారుతున్నాయి.
అసలింతకూ ఖండాంతరాలను, దేశాల సరిహద్దులను దాటి ఈ మొక్కలు భారత్‌కు ఎలా వచ్చాయి?
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 2,183 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. 214 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
తాజా కేసులతో భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 11,542కు పెరిగింది.
మరోవైపు ఆదివారం 1,985 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు.
గత రెండు వారాల్లో దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 5.33 శాతానికి పెరిగింది. ఆదివారం ఒక్క దిల్లీలోనే 517 కేసులు నమోదయ్యాయి.
ఆదివారం భారత్‌లో మొత్తంగా 1,150 కేసులు నమోదయ్యాయి.
హిందువులు సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ యతి నరసింహానంద పిలుపునిచ్చారు. తద్వారా భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా చూడాలని అన్నట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
‘దేశంలో ముస్లింల సంఖ్య పెరుగుతోంది అంటే దాని అర్థం హిందువుల సంఖ్య తగ్గుతోందని. మానవత్వాన్ని రక్షించేందుకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు హిందువులు సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలి.’ అని నరసింహానంద అన్నారు.
స్వీడన్‌లోని వలసదారులకు వ్యతిరేకంగా అనేక పట్టణాలలో కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు హింసారూపం దాల్చుతున్నాయి.
ఖురాన్‌ను దహనం చేయాలంటూ రైట్ వింగ్ పార్టీ స్త్రామ్ కర్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో హింస చోటు చేసుకుంది.
స్వీడన్ తూర్పు ప్రాంతంలోని నార్‌కాపింగ్‌లో ముగ్గురు గాయపడినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అనేక వాహనాలకు నిప్పంటించారు.
నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇప్పటివరకు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చైనాలోని షాంఘైలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మార్చి చివరి నుంచి షాంఘై పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంది. ఈ వేవ్‌లో ముగ్గురు మరణించినట్లు చైనా తెలిపింది.
మరణించిన వారి వయసు 89 నుంచి 91 ఏళ్ల మధ్య ఉంటుందని షాంఘై నగర హెల్త్ కమిషన్ వెల్లడించింది. వారు వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని వివరించింది.
సోమవారం షాంఘైలో 22,248 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.