2024 ఎన్నికల వ్యూహంపై సోనియా గాంధీకి ప్రశాంత్ కిశోర్ ప్రెజెంటేషన్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్న ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. జెరూసలేం అల్ అక్సా మసీదు ఆవరణలో ఘర్షణలు.. 150 మందికి గాయాలు

    జెరూసలేం ఘర్షణలు

    ఫొటో సోర్స్, EPA

    జేరూసలేంలోని అల్-అక్సా మసీదు ఆవరణ వద్ద ఇజ్రాయెల్ పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 150 మంది పాలస్తీనియన్లు గాయపడ్డట్లు పాలస్తీనా వైద్య సిబ్బంది చెప్పారు.

    పోలీసులపై టపాసులు, రాళ్లు, ఇతర వస్తువులతో దాడి జరగటంతో వారు మసీదు ఆవరణలోకి ప్రవేశించారని ఇజ్రాయెలీ పోలీసు విభాగం చెప్తోంది.

    ఈ ఘర్షణలో ముగ్గురు ఇజ్రాయెల్ పోలీసులు గాయపడ్డట్లు తెలిపారు.

    జెరూసలేం లోని ఈ ప్రార్థనా ప్రాంతం ముస్లింలకు, యూదులకు ఇరు వర్గాల వారికీ చాలా ముఖ్యమైన మత కేంద్రం. యూదులు టెంపుల్ మౌంట్‌గా దీనిని పిలుస్తారు.

    ఇజ్రాయెల్‌లో తీవ్ర దాడులు, దాని తర్వాత వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్లు చనిపోయిన పరిణామాలతో.. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తీవ్రంగా పెరిగిపోయాయి.

    గత గురువారం నాడు టెల్ అవీవ్‌లో ఓ పాలస్తీనావాసి ముగ్గురు ఇజ్రాయెల్ వాసులను హత్య చేయగా.. ఇజ్రాయెల్ బలగాలు వెస్ట్ బ్యాంక్‌లో సైనిక ఆపరేషన్‌లో 20 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వారిలో ఎక్కువమంది సాయుధలని ఇజ్రాయెల్ చెప్తోంది.

    అల్ అక్సా మసీదు

    ఫొటో సోర్స్, Getty Images

  2. రూ. 2 కోట్ల లాటరీ తగిలింది, బ్యాంకు ఖాతా లేదని డబ్బులు ఇవ్వడం లేదు

  3. ఫిలిప్పీన్స్‌లో మేగీ తుపాను బీభత్సం.. 167 మంది మృతి

    ఫిలిప్పీన్స్ తుపాను

    ఫొటో సోర్స్, Reuters

    ఫిలిప్పీన్స్‌లో గత ఆదివారం విరుచుకుపడిన మేగీ తుపాను పెను విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 167 మంది చనిపోయారు.

    మరో 110 మంది గల్లంతయ్యారని నేషనల్ డిజాస్టర్ ఏజెన్సీ తెలిపింది. దాదాపు 20 లక్షల మంది జనంపై ఈ తుపాను ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పింది.

    ఫిలిప్పీన్స్‌లోని సెంట్రల్ లేటీ ప్రావిన్స్‌లో బేబే నగరం చుట్టుపక్కల గ్రామాలు నదులు ఉప్పొంగటం, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    పిలార్ అనే గ్రామంలో దాదాపు 80 శాతం ఇళ్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.

    ఫిలిప్పీన్స్‌ను ఏటా సగటున 20 తుపాన్లు తాకుతాయి. ఈ ఏడాది ఇదే తొలి తుపాను.

  4. పాట్నాలో గంగా నది ఒడ్డున కూర్చుని ‘పరీక్షలు’ రాస్తున్న వేలాది విద్యార్థులు

    విద్యార్థులు

    ఫొటో సోర్స్, ANI

    బీహార్‌లోని పాట్నాలో వేలాది మంది విద్యార్థులు గంగా నది ఒడ్డున కూర్చుని రైల్వే, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగాల కోసం చదువుకుంటూ, పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

    పట్నా కాలేజ్ ఘాట్‌లో శనివారం ఉదయం వేలాది మంది మాక్ టెస్టులు రాస్తున్న ఫొటోలను ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించింది.

    ఉద్యోగ పోటీ పరీక్షలకు ఈ విద్యార్థులు సిద్ధమయ్యేందుకు ఎస్.కె.ఝా అనే యువ ఇంజనీర్ సాయం చేస్తున్నట్లు తెలిపింది.

    ‘‘శనివారం, ఆదివారం ఉదయం 6 గంటలకు మేం ఈ టెస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 12,000 మంది నుంచి 14,000 మంది విద్యార్థులు వస్తుంటారు. గత రెండు నెలలుగా నేను ఉచితంగానే దీనిని నిర్వహిస్తున్నా’’ అని ఆయన తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. అర్ధరాత్రి కాళ్లు ఎందుకు పట్టేస్తుంటాయి? రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ గురించి ప్రశ్నలు, సమాధానాలు

  6. ‘అగ్నికి ఆజ్యం పోస్తున్నారు’: యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై అమెరికాకు రష్యా హెచ్చరిక

    యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయటంపై అమెరికా సహా పశ్చిమ దేశాలకు రష్యా అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది.

    రష్యా లాంఛనంగా డిప్లమాటిక్ నోట్ పంపించటం ద్వారా ఈ హెచ్చరిక చేసింది. ఆ నోట్ కాపీని అమెరికాలోని మీడియా సంస్థలు సమీక్షించాయి.

    వాషింగ్టన్ డీసీలోని రష్యా కార్యాలయం నుంచి అమెరికా విదేశాంగ శాఖకు పంపిన ఈ రెండు పేజీల దౌత్య లేఖలో.. అమెరికా, నాటో ఆయుధాలను సరఫరా చేయటం ద్వారా యుక్రెయిన్‌లో సంఘర్షణకు ఆజ్యం పోస్తున్నారని, ఇది ‘అనూహ్య పర్యవసానాలకు’ దారితీయగలదని హెచ్చరించింది.

    యుక్రెయిన్‌కు అమెరికా మరో కొత్త సైనిక సాయం ప్యాకేజీ ఇవ్వబోతోందన్న వార్తలు లీకవుతున్న దశలో గత మంగళవారం నాడు ఈ దౌత్య లేఖను పంపించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. యుక్రెయిన్‌కు కొత్తగా 80 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ఆమోదించారు. ఆ ప్యాకేజీలో హోవిట్జర్స్ వంటి దీర్ఘ శ్రేణి కాల్పుల ఆయుధాలు కూడా ఉన్నాయి.

    యుక్రెయిన్‌కు అమెరికా, నాటోలు అందిస్తున్న సైనిక సాయం ప్రభావవంతంగా ఉందని రష్యా అంగీకరిస్తున్నట్లుగా ఈ హెచ్చరికను పరిగణించవచ్చునని సీనియర్ అమెరికా అధికారి ఒకరు విశ్లేషించినట్లు అమెరికా మీడియా ఉటంకించింది.

    అమెరికా తాజా సైనిక సాయంలో మొదటి విడత ప్యాకేజీ మరి కొద్ది రోజుల్లో యుక్రెయిన్‌కు అందనుంది.

    యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచీ.. యుక్రెయిన్‌కు అమెరికా 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను సాయంగా సరఫరా చేసింది.

  7. యుద్ధంలో 3,000 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారు: జెలియెన్‌స్కీ

    వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, CNN

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడిలో ఇప్పటివరకూ 3,000 మంది వరకూ యుక్రెయిన్ సైనికులు చనిపోయారని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు. మరో 10,000 మంది సైనికులు గాయపడ్డారని ఆయన తెలిపారు.

    ఆయన సీఎన్ఎన్ వార్తా చానల్‌తో మాట్లాడుతూ.. యుక్రెయిన్ సైనికుల మరణాలు 2,500 నుంచి 3,000 మంది వరకూ ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా అణు దాడి చేసే ప్రమాదం ఉందని కూడా ఆ ఇంటర్వ్యూలో జెలియెన్‌స్కీ హెచ్చరించారు.

    నెల రోజుల కిందట జెలియెన్‌స్కీ యుక్రెయిన్ సైనికుల మరణాలు 1,300 మంది వరకూ ఉన్నట్లు చెప్పారు. అయితే.. అప్పుడూ ఇప్పుడూ కూడా యుక్రెయిన్ కన్నా రష్యా సైనికుల మరణాలు చాలా అధికంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

    ఇరుపక్షాలూ తమ ప్రత్యర్థి దేశ సైనికుల మరణాలు.. ఆ దేశం చెప్తున్న అధికారిక సంఖ్యల కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి.

    ఇరువైపులా సైనికుల మరణాలకు సంబంధించి చెప్తున్న అంకెలను బీబీసీ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయింది.

  8. భారత్‌లో పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో 975 కొత్త కేసులు నమోదు

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, EPA

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 975 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

    దీంతో ఇప్పటివరకూ దేశంలో నమోదైన మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4.30 కోట్లకు పెరిగింది.

    శుక్రవారం నాడు కోవిడ్ కారణంగా నలుగురు చనిపోయారు. దానికిముందు గురువారం నాడు కూడా 949 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా ఆరుగురు చనిపోయారు.

    కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల దేశంలో మరణాల సంఖ్య 5.21 లక్షలకు చేరింది.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 11,191 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి.

  9. పంజాబ్‌లో జూలై 1 నుంచి 300 యూనిట్ల ఉచిత విద్యుత్: ఆప్ సర్కారు ప్రకటన

    భగ్వంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    పంజాబ్‌లో గృహ వినియోగదారులకు జూలై 1 నుంచి 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ విషయాన్ని ముఖ్యమంతరి భగ్వంత్ మాన్ శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే దానికి ముందుగా శనివారం నాడు పంజాబ్ ప్రభుత్వం ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని వార్తా పత్రికల్లోనూ మొదటి పేజీలో వాణిజ్య ప్రకటనల రూపంలో వెల్లడించింది.

    ఆప్ సర్కారు ‘30 రోజుల రిపోర్ట్ కార్డ్’ పేరుతో ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ను ప్రచురించింది. పంజాబ్‌లో ఆప్ సర్కారు అధికారం చేపట్టి నెల రోజులైంది. ఈ 30 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై ప్రభుత్వం ఈ వాణిజ్య ప్రకటనలను ప్రచురించింది.

    జూలై 1వ తేదీ నుంచి 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించటంతో పాటు.. రేషన్ సరకులను ఇంటి వద్దకే సరఫరా చేస్తామని, కొత్తగా 25,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో చెప్పింది.

    అలాగే 35,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కూడా ప్రకటించింది.

  10. ఉడుముపై అత్యాచారం జరిపారన్న అనుమానంతో నలుగురి అరెస్ట్

  11. కీయెవ్ పరిసరాల్లో 900 మంది పౌరుల మృతదేహాలు వెలుగులోకి

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    రష్యా సేనలు నిష్క్రమించిన తర్వాత యుక్రెయిన్ రాజధాని కీయెవ్ పరిసరాల్లో 900 మంది పౌరుల మృతదేహాలు బయటపడినట్లు కీయెవ్ పోలీస్ విభాగం అధిపతి వెల్లడించారు.

    కీయెవ్ శివారు ప్రాంతాల నుంచి రష్యా సేనలు నిష్క్రమించిన తర్వాత ఒక్కొక్కటిగా మృతదేహాల గుట్టలు బయటపడుతున్నాయని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

    ప్రస్తుతం తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలపై దృష్టి సారించేందుకు కీయెవ్ నుంచి రష్యా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది.

    అయితే, కీయెవ్ శివార్లలోని యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ-షిప్ క్షిపణుల తయారీ ఫ్యాక్టరీని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా చెబుతోంది.

    మరోవైపు పేలుడు తర్వాత నల్లసముద్రంలోని తమ యుద్ధ నౌక మాస్క్‌వా మునిగిపోయినట్లు రష్యా వెల్లడించింది.

    ఈ యుద్ధ నౌకపై క్షిపణులతో దాడి చేసినట్లు యుక్రెయిన్ చెబుతోంది. అయితే, రష్యా మాత్రం అగ్ని ప్రమాదం వల్ల ఈ నౌకలో పేలుళ్లు సంభవించాయని వివరిస్తోంది.

    రష్యా మౌలిక సదుపాయాలపై దాడులు చేపడితే, కీయెవ్‌పై దాడులను ఉధృతం చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

    యుక్రెయిన్ సంక్షోభం వల్ల దాదాపు 50 లక్షల మంది శరణార్థులుగా మారారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

  12. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.