కేసీఆర్: ‘యాసంగిలో ప్రతి గింజను మేమే కొంటాం.. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు’
తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. జీవో 111 ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు..
లైవ్ కవరేజీ
సతీష్ ఊరుగొండ & పద్మ మీనాక్షి
యుక్రెయిన్: రెండేళ్ల చిన్నారి వీపుపై పేరు, ఊరు, కాంటాక్ట్ నంబర్లు రాసిన ఓ తల్లి కన్నీటి గాథ
రెండేళ్ల తన కూతురి వీపుపై కాంటాక్ట్
డీటెయిల్స్ రాశారు ఒక యుక్రెయిన్ తల్లి. ఆమె ఏ పరిస్థితుల్లోఅలా రాయాల్సి వచ్చిందో బీబీసీతో చెప్పారు.
యుద్ధం గుప్పిట చిక్కుకున్న సొంత
దేశాన్ని కుటుంబం సహా వీడుతున్నప్పుడు కలిగిన బాధను, భయాన్ని ఆమె
వివరించారు.
దేశం నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఒకవేళ
తాము ఒకరి నుంచి ఒకరు విడిపోయినా, చనిపోయినా తమ వివరాలు తెలియాలనే ఇలా తన కూతురు విరా వీపుపై ఆమె
పేరు, వయసు, కొన్ని ఫోన్
నంబర్లు రాసినట్లు తల్లి సాషా మకోవీయ్ చెప్పారు.
''ఒకవేళ మేమంతా చనిపోతే అప్పుడు ఆమె ఎవరో తెలుస్తుందనే ఇలా రాశాను'' అన్నారు సాషా.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు సమాచారం.
జి. సిగడాం మండలం బాతువా రైల్వే గేటు
సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్ నుండి గౌహతి వెళ్తున్న గౌహతి
ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.
రైలులో ఒక బోగి నుంచి పొగలు రావడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్ లాగి రైలు ఆపేశారు. భయంతో కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు.
అదే సమయంలో భువనేశ్వర్ నుంచి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ చెప్పారు.
వారి మృతదేహలు ట్రాక్ ఇరువైపులా చెల్లాచెదురుగా
పడి ఉన్నాయి.
ఈ రైలు ప్రమాద విషయం తెలుసుకున్న
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని
అధికారులను ఆదేశించారు. ఆర్డీవో, తహశీల్దార్, వైద్య బృందం సంఘటన స్థలాన్ని చేరుకుని గాయాలపాలైనవారికి చికిత్స
అందిస్తున్నారు.
రైలు ప్రమాదంలో పలువురు మరణించిన ఘటనపై
సీఎం జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్షతగాత్రులకు మంచి వైద్యసేవలు అందేలా
చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు సహాయసహకారాలు
అందించాలని అధికారులను ఆదేశించారు.
ఫొటో సోర్స్, UGC
ఝార్ఖండ్‌లో రోప్‌వే ప్రమాదం - కొనసాగుతున్న సహాయ చర్యలు
ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో ఏప్రిల్ 10న రోప్‌వే మార్గంలోప్రమాదం చోటు చేసుకుంది.
ఈ రోజు మధ్యాహ్నానికి ఈ ప్రమాదంలో
చిక్కుకున్న వారినందరినీ రక్షిస్తామని రెస్క్యూ బృందం ఇన్‌ఛార్జ్ అశ్వని నాయర్
చెప్పారు.
"నేను మూడు రోజులు ఈ ప్రమాదంలో ఇరుక్కుని
ఉండిపోయాను. బయటకు రావడం ఈ ప్రమాదం నుంచి బయటపడిన ధర్మేంద్ర చెప్పారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు ప్రమాదంలో చిక్కుకున్న 10 మందిని రక్షించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. మరో ముగ్గురు నుంచి ఐదు మంది వరకు కేబుల్ కార్లలో చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేవ్‌ఘర్ ఘటన పై విచారణ జరపాలని
ఝార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 26న ఈ అంశం పై విచారణ చేపట్టనున్నట్లు
ప్రకటించింది. విచారణకు ముందు ప్రభుత్వం పూర్తి నివేదికను సమర్పించాలని కోరింది.
ఫొటో సోర్స్, ANI
వరంగల్ జిల్లాలో టెస్కో గోదాంలో అగ్ని ప్రమాదం
తెలంగాణలోని వరంగల్ జిల్లా స్థంభంపల్లిలోనిటెస్కోగోదాంలో సోమవారం భారీఅగ్నిప్రమాదం జరిగింది.టెస్కో చేనేత
కార్మికుల ఉత్పత్తులను అమ్మే ప్రభుత్వ సంస్థ.
మొత్తం 6 ఫైర్ ఇంజన్లు గోడౌన్లో మంటలను అదుపుచేసే
పనిలో ఉన్నాయి, మధ్యాహ్నం వరకు మంటలు అదుపులో రావొచ్చు
అని వరంగల్ ఫైర్ ఆఫీసర్భగవాన్ రెడ్డి తెలిపారు.
ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, విచారణ
కొనసాగుతోందని ఆయన మీడియారు తెలిపారు. చేనేత అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు
ప్రమాదంలో సుమారు 30 కోట్లవిలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఎక్కువగా నూలుతో చేసిన వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక
అధాకారులు తెలిపారు.
చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వరంగల్,హన్మకొండ, వర్ధన్నపేట, పరకాల్ లకు చెందిన 40 మంది
ఫైర్ సిబ్బందిఫైర్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు.
ఉమ్మడి వరంగల్ పరిధిలోని చేనేత సహకార సంఘాల్లో ఉత్పత్తైన దుప్పట్లు, స్కూల్ యూనిఫామ్స్, తివాచీలు, బెడ్ షీట్స్ ల నిల్వ కోసం 2019 నుండి
ప్రస్తుతం ప్రమాదం జరిగిన గోడౌన్ ను టెస్కో నిర్వహిస్తోంది. ఇందులో సరైన అగ్నిప్రమాద
నివారణ సదుపాయాలు లేవన్న ఆరోపణలు ఉన్నాయి.
చేనేత శాఖ అధికారుల పిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రమాదం పై ఎఫ్ఐఆర్
బుక్ చేసారు.
‘’ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ
తేలలేదు. ఇది తాత్కాళిక గోడౌన్. ఇందులో నీటిని నిల్వ ఉంచే సంప్ నిర్మాణం లేదు. ప్రమాదంపై
ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణం అవ్వొచ్చని భావిస్తున్నాం.
గోడౌన్లో మొత్తం 27 కోట్ల
విలువచేసే సరుకు ఉంది . అంతా మంటల్లో కాలిపోయింది’’ అనిటెస్కోవరంగల్ డివిజనల్ మార్కేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.
ఫొటో సోర్స్, UGC
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.