2021-22లో మూడు రెట్లు పెరిగిన విద్యుత్ వాహనాల అమ్మకాలు

ఫొటో సోర్స్, tigorev.tatamotors.com
భారత్‌లో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఫాడా) తెలిపింది.
2021-22లో విద్యుత్ వాహనాల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని, వీటిలో టూ వీలర్ల సేల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.
2021-22లో 4,29,217 వాహనాలు అమ్ముడు పోయాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో అమ్ముడు పోయిన వాహనాల సంఖ్య 1,34,821.
ప్యాసింజర్ విభాగంలో 15,198 వాహనాలతో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 85.37శాతంగా ఉంది.
2,045 వాహనాలతో రెండో స్థానంలో ఉన్న ఎంజీ మోటార్ ఇండియా 11.49శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
ఇక టూ వీలర్స్ విషయంలో 65,303 వాహనాలతో హీరో ఎలక్ట్రిక్ టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న ఒకినావా ఆటోటెక్ 46,447 వాహనాలను విక్రయించింది.

ఫొటో సోర్స్, Facebook/Hero Electric











