యుక్రెయిన్: రైల్వే స్టేషన్ మీద రాకెట్ దాడి... 50కి చేరిన మృతుల సంఖ్య
తూర్పు యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రష్యా రాకెట్ దాడిలో 30 మందికి పైగా చనిపోయినట్లు యుక్రెయిన్ రైల్వే విభాగం తెలిపింది. యుక్రెయిన్ ప్రజలను తరలించేందుకు ఈ రైల్వే స్టేషన్ కీలకంగా ఉంది. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని రష్యా ప్రకటన.
లైవ్ కవరేజీ
వరికూటి రామకృష్ణ and పృథ్వి రాజ్
తెలంగాణ వడ్లు కొనుగోలు: కేంద్రం వైఖరికి నిరసనగా నల్ల జెండాలు ఎగుర వేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు
ఫొటో సోర్స్, Facebook/V Srinivas Goud
తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖరికి
నిరసనగా నేడు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నల్లజెండా ఎగుర వేశాయి.
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఈ
నిరసనలకు నేతృత్వం వహించారు.
తెలంగాణలో ప్రతి రైతూ తమ ఇంటి మీద నల్ల జెండా ఎగురవేయాలని
వారు విజ్ఞప్తి చేశారు.
ఫొటో సోర్స్, Facebook/V Srinivas Goud
ఆంధ్రప్రదేశ్: రంజాన్ నెలలో ఒక గంట ముందే ఆఫీసుల నుంచి ముస్లింలు వెళ్లొచ్చు
రంజాన్ సందర్భంగా సాయంత్రం ఒక గంట ముందే ముస్లింలు ఆఫీసులు,
స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లేలా అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు మే 2వ
తారీఖు వరకు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఏపీ, తెలంగాణ విభజన కేసుపై సుప్రీం కోర్టులో కదలిక, బీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, బీబీసీ ప్రతినిధి
ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ 2014లో
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసులో
కదలిక వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోపభూయిష్టంగా ఉందని, ఆ
చట్టాన్ని రద్దు చేయాలంటూ అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును
కోరారు.
నాడు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అప్పట్లో
కేంద్రానికి నోటీసులు కూడా ఇచ్చింది.
2019లో తిరిగి ఈ కేసులో విజ్ఞప్తిని మార్చుతూ ఉండవల్లి
అరుణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
రెండు రాష్ట్రాలు ఏర్పడి రెండు సార్లు ఎన్నికలు జరిగిన
ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కొనసాగుతున్నందున పునర్విభజన చట్టాన్ని
కొట్టివేయాలని చేసిన విజ్ఞప్తిని ఉండవల్లి ఉపసంహరించుకున్నారు.
భవిష్యత్తులో రాష్ట్రాల విభజనకు కేంద్రానికి స్పష్టమైన
మార్గదర్శకాలు ఇవ్వాలని, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా సాయం చేసేలా కేంద్రాన్ని
ఆదేశించాలని కొత్త విజ్ఞప్తి చేశారు.
కానీ నాటి నుంచి నేటి వరకు సుమారు 7-8 ఏళ్లుగా ఈ కేసులో ఎలాంటి
పురోగతి లేదు.
ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్
భూషణ్ ఈ కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణతో కూడిన ధర్మాసనం
ముందు కేసు ప్రస్తావనకు రాగా ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ పాత విజ్ఞప్తిని
వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కొత్త విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
దీని మీద జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు
జారీ చేస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసిందని సుప్రీం కోర్టు న్యాయవాది అల్లంకి
రమేశ్ బీబీసీకి తెలిపారు.
అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప వరకు - తగ్గేదేల్యా
పుష్ప సినిమాకు ముందు- ఆ తరువాత... అల్లు అర్జున్ సినీ ప్రయాణం గురించి మాట్లాడుకొనేటప్పుడు ఇది తప్పనిసరిగా వినిపిస్తున్న మాట. దేశవ్యాప్తంగా ఉండే ప్రేక్షకులు ఇంతగా మాట్లాడుకొనే స్థాయికి అల్లు అర్జున్ ఎలా చేరుకొన్నారు ? కథానాయకుడిగా తన తొలి చిత్రమైన 'గంగోత్రి' నుంచి మొన్నటి 'పుష్ప' వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది?
ఈ అతిపెద్ద బావితో నాలుగేళ్ల పాటు తన 12ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు అంటున్న రైతు
సాగునీటి సమస్య తీర్చుకునేందుకు ఓ రైతు రూ.కోటిన్నర ఖర్చుతో ఎకరా స్థలంలో అతిపెద్ద బావి తవ్వించి, దానితో మిగిలిన పన్నెండెకరాల భూమికి నీటి సమస్యే లేకుండా చేసుకున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.
పోస్ట్ of YouTube ముగిసింది
హైదరాబాద్: పెరిగిన నిమ్మకాయల ధరలు... ఒక్కోటి రూ.10
ఫొటో సోర్స్, ANI
హైదరాబాద్‌లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం
ఒక్కో నిమ్మకాయ రూ.10 పలుకుతోంది.
వేసవి కాలం మొదలైన తరువాత డిమాండ్ పెరగడంతో నిమ్మకాయల ధరలు
ఒక్కసారిగా పెరిగాయి.
ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రజలు నిమ్మకాయలు పెద్దగా కొనడం
లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘గతంలో ఒక నిమ్మకాల బస్తా రూ.700కు వచ్చేది. కానీ ఇప్పుడు
అది రూ.3,500కు పెరిగింది. దాంతో మేం ఒక్కో నిమ్మకాయను రూ.10కు అమ్మాల్సి
వస్తోంది. కానీ ఇంత ఎక్కువ రేటు పెట్టేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.’ అని ఒక
చిరు వ్యాపారి వార్తా సంస్థ ఏఎన్‌ఐకు తెలిపారు.
ఇంతకు ముందు డజను నిమ్మకాయలు రూ.20కు వచ్చేవని, కానీ
ఇప్పుడు రూ.120 పెట్టి కొనాల్సి వస్తోందని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్: పరిశ్రమలకు పవర్ హాలిడే
ఫొటో సోర్స్, PA
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం మీద ప్రభుత్వం కొత్త
నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఆదివారం పరిశ్రమలు మూతవేయాల్సి ఉండగా ఇక నుంచి మరో రోజు అదనంగా పవర్ హాలిడే అమలు చేయాల్సి ఉంటుంది.
విద్యుత్‌ను కూడా 50శాతం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటలలోపు విద్యుత్ వినియోగం
నియంత్రించాలి. వ్యవసాయ విద్యుత్‌ను 7గంటలకు కుదించారు. గతంలో 9గంటలు అందించేవారు.
ఈ నిబంధనలు ఈనెల 22వరకు అమలవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి
బి.శ్రీధర్ తెలిపారు.
విద్యుత్ కోతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో రాష్ట్రమంతా విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్య
తీవ్రంగా ఉంది. అర్ధరాత్రుళ్లు కూడా ప్రజలు కరెంటు కోతలు చవి చూస్తున్నారు.
విద్యుత్ కోతలతో ఆస్పత్రులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. సాగుకు
సరిపడా విద్యుత్ లభించక రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
బుధవారం 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా సరఫరాలో కొరత కారణంగా
25 మిలియన్ యూనిట్ల తగ్గించారు.
బొరొదియాంక పట్టణంలో రష్యా బలగాలు జరిపిన విధ్వంసం బుచా
కంటే ఎక్కువగా ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.
మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
కీయెవ్‌కు సమీపంలో ఉండే బుచా, బొరొదియాంక రష్యా బలగాల దాడుల్లో
తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బొరొదియాంక కూలిన రెండు భవనాల కింద సుమారు 26 మృత దేహాలు
లభించాయి.
సైనిక స్థావరాలు లేకపోయినా రష్యా కావాలనే ప్రజల నివాసాలను
లక్ష్యంగా చేసుకుందని యుక్రెయిన్ ఆరోపించింది.
యుక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలు
బొరొద్యాంకా పట్టణంలో రష్యా బలగాలు జరిపిన విధ్వంసం బుచా
కంటే ఎక్కువగా ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.
మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
రష్యా బలగాలు 130 మంది ప్రజలను సుమారు నెల రోజులు బంధించి ఉంచినట్లు చెర్నిహివ్
సమీపంలోని యహిద్నే ప్రజలు బీబీసీకి తెలిపారు.
తూర్పు యుక్రెయిన్‌లోని దొన్బస్ ప్రాంతం కోసం జరుగుతున్న
యుద్ధం రెండో ప్రపంచయుద్ధాన్ని గుర్తుకు తెస్తుందని యుక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి
అన్నారు.
యుక్రెయిన్‌లో తమ సైనికులు గణనీయ సంఖ్యలో చనిపోయారని, ఇది ఎంతో బాధాకరమని
రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి స్కై న్యూస్‌కు వెల్లడించారు.
యుక్రెయిన్‌కు మరింత సాయం చేసేందుకు నాటో కూటమి సిద్ధమైందని
సెక్రటరీ జనరల్ జెన్స్ స్టొల్టెన్‌బర్గ్ ప్రకటించారు.
యుద్ధ నేరాలకు పాల్పడిందనే ఆరోపణలతో ఐక్యరాజ్యసమితి
మానవహక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్
పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని
రిఫ్రెష్ చేస్తూ ఉండండి.