ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని..
రష్యా దాడులను తీవ్రతరం చేస్తుందనే భయాల నేపథ్యంలో తూర్పు యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్, లూహాన్స్క్, దోన్యస్క్ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా యుక్రెయిన్ డిప్యూటీ పీఎం కోరారు.
యుక్రెయిన్ భూభాగాన్ని గెలుచుకోవటానికి రష్యా.. ఆకలిని ఆయుధంగా వాడుతోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆరోపించారు.
ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పదో స్థానంలో, గౌతమ్ అదానీ 11వ స్థానంలో నిలిచారు.
భారత్‌లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XE తొలి కేసు మహారాష్ట్రలోని ముంబయిలో నమోదైనట్లు ముంబయి మహా నగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు ప్రకటించారు.
ఇవి లైవ్ పేజీ అప్‌డేట్స్. ధన్యవాదాలు.