భారత్ వాణిజ్యలోటు రూ. 14.50 లక్షల కోట్లు... 2020-21తో పోల్చితే 87 శాతం పెరుగుదల

2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 417.81 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు కూడా రూ. 610.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ కారణంగానే రూ. 192.41 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. 'పుతిన్ ఒక యుద్ధ నేరస్థుడు' - అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్

    బుచాలో మరణాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద యుద్ధ నేరాలకు సంబంధించి విచారణ జరిపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు.

    "ఈ మనిషి మరీ క్రూరంగా ఉన్నారు" అని చెప్పిన బైడెన్, రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు.

    పుతిన్‌ను గత నెలలో కూడా యుద్ధ నేరస్థుడని ఆరోపించిన బైడెన్ మరో మారు అదే మాట అన్నారు.

    "బుచాలో ఏం జరిగిందో చూశాం కదా... పుతిన్ ఒక యుద్ధ నేరస్థుడు. అన్ని ఆధారాలూ, వివరాలూ సేకరించి ఆయన మీద యుద్ధ నేరాలకు పాల్పడిన అభియోగాలతో విచారణ జరిపించాలి" అని బైడెన్ అన్నారు.

    ఇవీ ఈనాటి బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్.

    రేపు మళ్ళీ లైవ్ పేజీలో కొత్త అప్డేట్స్‌తో కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

    బైడెన్
  2. భారత కార్పొరేట్ చరిత్రలో మరో అతిపెద్ద ఒప్పందం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం, అలోక్ జోషి, సీనియర్ జర్నలిస్ట్

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

    ఫొటో సోర్స్, REUTERS/SHAILESH ANDRADE

    భారతదేశపు అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు విలీనం కానున్నాయి.

    రెండు కంపెనీల బోర్డులు ఈ విలీనాన్ని ఆమోదించాయి. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ సంస్థకు చెందిన 25 షేర్లు ఉన్నవారికి ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లు దక్కనున్నాయి. భారతీయ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

    ఈ విలీనం తర్వాత టీసీఎస్‌ను వెనక్కినెట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారతదేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించనుందని అంచనా.

    ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందే రెండు కంపెనీల నుంచి ఈ విలీన ప్రకటన వచ్చింది. ఈ డీల్ కారణంగా మార్కెట్లు ప్రారంభం కాగానే ఊపు అందుకున్నాయి.

    రెండు కంపెనీల షేర్లు ఒకేసారి 13-14 శాతం వరకు పెరగడం బహుశా ఇదే మొదటిసారి.

    హౌజింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) అనేది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ప్రమోటర్ కంపెనీ, అతిపెద్ద వాటాదారు కూడా.

  3. డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?, పద్మ మీనాక్షి, బీబీసీ ప్రతినిధి

    డ్రగ్స్

    ఫొటో సోర్స్, Getty Images

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ మింక్ పబ్‌లో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి సోదాలు నిర్వహించారు. దాదాపు 144 మందిని అదుపులోకి తీసుకున్నారు.

    పార్టీలో పాల్గొన్న కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో హోటల్ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

    5 చిన్న ప్యాకెట్ల కొకైన్ వైట్ పౌడర్ తమకు లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. పబ్‌ మేనేజర్ చేతుల్లో ప్లాస్టిక్ బ్యాగులు, స్ట్రాలు దొరికాయని పోలీసులు వివరించారు.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 20 మందిని పైగా అరెస్టు చేసినట్లు వార్తలొచ్చాయి. జనవరి 2022లో కూడా మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నందుకు గాను ఒక నైజీరియా జాతీయుడిని అరెస్ట్ చేశారు.

  4. రూ. 192 బిలియన్ డాలర్లు దాటిన భారత వాణిజ్య లోటు

    భారత వాణిజ్య లోటు

    ఫొటో సోర్స్, Getty Images

    భారత వాణిజ్య లోటు 87.5 శాతం పెరిగింది. దీంతో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 192.41 బిలియన్ డాలర్ల (రూ. 14,47,126 కోట్లు)కు చేరింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు రూ. 102.63 బిలియన్ డాలర్లు (రూ. 7,68,868 కోట్లు)గా ఉంది.

    2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 417.81 బిలియన్ డాలర్లకు పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    అదే సమయంలో దిగుమతులు కూడా రూ. 610.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ కారణంగానే రూ. 192.41 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది.

    2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 394.44 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత దిగుమతులు, 2021-22 నాటికి రూ. 610.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే దిగుమతులు 54.71 శాతం పెరిగాయి.

    2022 మార్చిలో వాణిజ్య లోటు రూ. 18.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మొత్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 192.41 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    ఎగుమతుల విషయానికొస్తే భారత్ 2022 మార్చిలో తొలిసారిగా 40 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. మార్చిలో రూ. 40.38 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను భారత్ ఎగుమతి చేసింది. గతేడాది ఇదే సమయంలో భారత ఎగుమతుల విలువ రూ. 35.26 బిలియన్ డాలర్లు.

  5. కేరళ: ముస్లిం అమ్మాయి కాబట్టి హిందూ ఆలయాల్లో భరతనాట్యం చేయొద్దన్నారు

    భరత నాట్యం

    ఫొటో సోర్స్, MANSIYA VP

    "కళలకు మతం ఉండదు" అని భరతనాట్య కళాకారిణి మాన్సియా వీపీ అన్నారు. ముస్లిం అనే కారణంతో కేరళలోని ఒక దేవాలయంలో శాస్త్రీయ నృత్యం చేసేందుకు ఆమెకు అనుమతిని ఇవ్వలేదు.

    భరతనాట్యం కొన్ని శతాబ్దాల చరిత్ర నృత్యరూపం. మాన్సియాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే తల్లి ఆమెకు భరతనాట్యం శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు.

    ముస్లిం మతానికి చెందిన వారు ఈ నాట్యాన్ని నేర్చుకోవడం చాలా అరుదు. కేరళలోని మలప్పురానికి చెందిన మాన్సియా తల్లి తన పిల్లలకు డాన్స్ నేర్పించాలని పట్టుదలతో ఉండేవారు.

    అందుకే, ఆమె తన ఇద్దరు పిల్లలకు భరతనాట్యంతో పాటు కథకళి, మోహిని అట్టం కూడా నేర్పించారు.

  6. కీయెవ్ మరణాల గురించి రష్యా ఏం చెబుతోంది?

    రష్యా

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్‌లో రష్యా దుర్మార్గాలకు సంబంధించిన రుజువులు పెరుగుతున్నాయి. పశ్చిమ కీయెవ్‌లోని మోటిజెన్ గ్రామంలో ఒక సమాధిని బీబీసీ ప్రతినిధి యోగిత లిమాయే చూశారు. రష్యా దళాల కాల్పుల్లో చనిపోయిన నలుగురు వ్యక్తులకు చెందిన సమాధి అది.

    అందులో ముగ్గురిని ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వీరిలో గ్రామపెద్ద ఓల్హా సోహెంకో కూడా ఉన్నారు. నాలుగో వ్యక్తి ఎవరో ఇంకా తెలియరాలేదు.

    బుచాలోని వీధుల్లో పౌర దుస్తులు ధరించిన కనీసం 20 మంది మృతదేహాలను కనుగొన్న తర్వాత, ఇదంతా రష్యా దళాల ‘ఉద్దేశపూర్వక ఊచకోత’ అని యుక్రెయిన్ ఆరోపించింది.

    ‘‘బుచాలోని అకృత్యాలు ఒక నాటకం. అక్కడ నుంచి రష్యా దళాల ఉపసంహరణ జరిగిన చాలా రోజుల తర్వాత ఈ నాటకం తెరమీదకు వచ్చిందని’’ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వర్ణించినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

    ‘‘మేం ఈ ఆరోపణలు అన్నింటిని తిరస్కరిస్తున్నాం’’ అని జర్నలిస్టులతో క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.

    రష్యా మంత్రిత్వ శాఖలోని నిపుణులు నకిలీ వీడియోలను, నకిలీ ఆధారాలను గుర్తించారని ఆయన చెప్పారు.

    అయితే, ఇలాంటి ప్రతిస్పందనలు రష్యా ప్లేబుక్‌లో ఒక భాగమని లండన్‌లోని డిఫెన్స్, సెక్యూరిటీ విశ్లేషకుడు మైఖేల్ క్లార్క్ అన్నారు.

  7. భారత విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా నియామకం

    వినయ్ మోహన్

    ఫొటో సోర్స్, Vinay Mohan

    భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా నియమితులయ్యారు.

    ప్రస్తుత కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా పదవీ విరమణ తర్వాత వినయ్ మోహన్ ఈ బాధ్యతలు స్వీకరిస్తారు.

    ఏప్రిల్ 30న హర్ష వర్ధన్ పదవీ విరమణ చేయనున్నారు.

    వినయ్ మోహన్ ప్రస్తుతం నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. బుచాలో పర్యటించిన జెలియెన్‌స్కీ, యోగిత లిమాయే, బుచా నుంచి

    బుచాలో పర్యటించిన జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ, బుచాలో పర్యటించారు. కీయెవ్‌కు సమీపంలోని ఈ నగరంలో రష్యా దురాగతాలకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడుతూనే ఉన్నాయి.

    రష్యా సైనికులు దాడులు చేసిన రహదారిని జెలియెన్‌స్కీ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు, మారణహోమానికి పాల్పడిందని ఆయన పునరుద్ఘాటించారు.

    రష్యాతో శాంతి చర్చలు ఇంకా సాధ్యమేనా అని బీబీసీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.

    ‘‘అవును సాధ్యమే. ఎందుకంటే యుక్రెయిన్‌కు శాంతి కావాలి. మేం 21వ శతాబ్దపు యూరప్‌లో ఉన్నాం. దౌత్యపరంగా, సైనికపరంగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాం’’ అని ఆయన అన్నారు.

  9. బ్రేకింగ్ న్యూస్, జమ్మూ-కశ్మీర్‌లో మిలిటెంట్ దాడి, సీఆర్‌పీఎఫ్ జవాను మృతి

    జమ్మూ-కశ్మీర్: శ్రీనగర్‌లో జరిగిన మిలిటెంట్ దాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను మరణించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    మొదట ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ప్రకటించిన జమ్మూ కశ్మీర్ పోలీసులు తర్వాత ఒక జవాను మరణించారని తెలిపారు.

    లాల్ చౌక్‌లోని మౌసిమా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన జవానును ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయన మృతి చెందారని ఏఎన్ఐ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. యుక్రెయిన్: ఇప్పటివరకు ఏం జరిగింది?

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలపై రష్యా దాడులను పెంచిందని, అక్కడకు భారీగా బలగాలను తరలిస్తోందని నాటో వెల్లడించింది.

    ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు తమతో గ్యాస్ విక్రయాలు సాగించేవారు తమ కరెన్సీలోనే చెల్లింపులు చేయాలని రష్యా చెప్పింది. లేకపోతే సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది.

    మరోవైపు రష్యన్ బలగాలు చెర్నోబిల్ అణు విద్యాత్ కేంద్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.

    మరియుపూల్‌లో చిక్కుకున్న వేల మంది పౌరులను రక్షించేందుకు వెళ్లిన బస్సులను రష్యా బలగాలు నిలిపివేశాయి. శుక్రవారం మళ్లీ ఈ సేవలను పునరుద్ధరించనున్నారు.

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని అంచనా వేయడంలో విఫలమైన ఫ్రాన్స్ నిఘా సంస్థ అధిపతిపై వేటు వేశారు.

  11. రాహుల్ గాంధీ: పెట్రోల్ ధరల పెరుగుదల.. ‘‘ఇది ప్రధాన మంత్రి జన్ ధన్ లూట్ పథకం’’

    పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2014 ధరలతో ప్రస్తుత ధరలను పోలుస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు.

    పెట్రోలు ధరల పెరుగుదలను జన్ ధన్ లూట్ యోజనగా ఆయన చెప్పారు. 2014లో బైక్ పెట్రోలు ట్యాంక్ ఫుల్ చేయడానికి రూ.714 మాత్రమే అయ్యేది. ఇప్పుడది రూ.1038కి పెరిగింది.

    మార్చి 22 నుంచి వరుసగా పెట్రోలు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత రెండు వారాల్లో పెట్రోలు ధర ఒక లీటరుపై రూ.8.40 పెరిగింది.

    పెట్రోలు ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయితే, యుక్రెయిన్‌ సంక్షోభం వల్ల పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ‘‘రష్యన్ ఓలిగార్క్‌ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి’’

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, REUTERS/Zohra Bensemra

    ‘బుచా, ఇర్పిన్లలో కొందరి చేతులను వెనక్కి కట్టేసి చంపిన పౌరుల మృతదేహాలు కనిపించాయి. వీటిని మారణహోమంగానే పరిగణించాలి’’అని పోలండ్ ప్రధాన మంత్రి మటేసుజ్ మొరావికి అన్నారు.

    రష్య సేనల ఉపసంహరణ అనంతరం చాలా నగరాల్లో 300 వరకు మృతదేహాలను యుక్రెయిన్ అధికారులు కనుగొన్నారు.

    రష్యా దాడిని అత్యంత దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కఠినమైన ఆంక్షలు విధించడంతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అడ్డుకోగలమని అన్నారు.

    యుక్రెయిన్‌లో రష్యా పాల్పడిన నేరాలకు అంతర్జాతీయ కమిషన్ ఏర్పాటుచేయాలని పోలండ్ డిమాండ్ చేస్తోంది.

    రష్యాలో సంపన్న వర్గమైన ఓలిగార్క్‌ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఐరోపియన్ యూనియన్ దేశాలకు పోలండ్ ప్రధాని పిలుపునిచ్చారు.

  13. లైబీరియా టాక్సీ డ్రైవర్: 50,000 డాలర్లు తిరిగి ఇచ్చేసినందుకు ఇమ్మాన్యుయేల్ తులో జీవితమే మారిపోయింది

    ఇమ్మాన్యుయేల్

    పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్ తులో కథ చదివితే చందమామలో వచ్చే మంచి నీతి కథలా ఉంటుంది.

    19 ఏళ్ల తులో ఆకాశం రంగు చొక్కా, నావీ బ్లూ రంగు నిక్కరు యూనిఫాం వేసుకుని తనకన్నా వయసులో చాలా చిన్నవాళ్లయిన తోటి విద్యార్థులతో క్లాసులో కూర్చున్నాడు.

    చిన్నప్పుడే స్కూలు మానేసిన తులోకు మళ్లీ బడిలో చేరడం సంతోషకరమైన విషయమే. గత ఏడాది వరకు తులో మోటర్‌బైక్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అదే అతడి జీవనాధారం. ఓరోజు తులోకు రోడ్డు పక్కన ఒక ప్లాస్టిక్ సంచీలో 50,000 డాలర్లు (సుమారు రూ. 37,84,042) కనిపించాయి.

    సంచీలో అమెరికా డాలర్లు, లైబీరియా నోట్లు ఉన్నాయి. ఆ డబ్బును మడతబెట్టి జేబులో పెట్టేసుకోవచ్చు. కానీ, తులో అలా చేయలేదు. తన అత్తకు ఇచ్చి దాచమని చెప్పాడు. డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి జాతీయ రేడియోలో సహాయం అడిగినప్పుడు తులో ముందుకొచ్చాడు. దొరికిన డబ్బును ఆ వ్యక్తికి అందజేశాడు.

    పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  14. శ్రీలంక: నలుగురు కొత్త మంత్రుల్ని నియమించిన రాజపక్ష

    శ్రీలంక

    ఫొటో సోర్స్, ANI

    శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నడుమ నలుగురు కొత్త క్యాబినెట్ మంత్రులను నియమించినట్లు శ్రీ లంక అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

    పూర్తి క్యాబినెట్ కొలువుదీరే వరకు పార్లమెంటుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు స్తంభించిపోకుండా నలుగురు మంత్రులను నియమించినట్లు దేశ అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష తెలిపారు.

    దేశంలో ఆర్థిక సంక్షోభం నడుమ ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంకు గవర్నరు కూడా రాజీనామా చేశారు.

    మరోవైపు ప్రధాన మంత్రి మహింద రాజపక్ష కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. యుక్రెయిన్‌లోని బుచా వీధుల్లో చెల్లాచెదురుగా మృతదేహాలు.. బుచా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    బుచా

    ఫొటో సోర్స్, BBC/LEE DURANT

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను ఆక్రమించుకోవాలని, అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీని అధికారం నుంచి దింపాలనే రష్యా ఆశలకు దారుణంగా బలైన నగరాల్లో బుచా ఒకటి. నగరం మొత్తం స్మశానవాటికగా మారింది.

    హెచ్చరిక: ఇందులో ప్రస్తావించిన అంశాలు, ఫొటోలు మీ మనసులను కలచివేయవచ్చు.

    ఫిబ్రవరి 24న రష్యా దళాలు యుక్రెయిన్‌లోకి చొరబడిన రెండు మూడు రోజులకే బుచాలో విధ్వసం మొదలైంది. రాజధాని కీయెవ్ చేరుకునే మార్గంలో రష్యా సైన్యం బుచాలోకి ప్రవేశించింది.

    అయితే, కీయెవ్‌కు దారి తీస్తున్న రష్యా ట్యాంకులను, సాయుధ సిబ్బందిని తరలించే వాహనాలను యుక్రెయిన్ దళాలు నేలమట్టం చేశాయి.

    యుక్రెయిన్ సైన్యం మెరుపుదాడి చేయడంతో కాన్వాయ్ మొత్తం ధ్వంసమైపోయింది. దాంతో, రష్యా సైన్యం ముందుకు కదలడం అంత సులువు కాలేదు.

    భీకర పోరుతో నగరమంతా అంధకారం అలుముకుంది.

    పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  16. సాయం చేయాలంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించిన శ్రీలంక విపక్ష నాయకుడు

    శ్రీలంక

    ఫొటో సోర్స్, ANI

    ఆర్థిక సంక్షోభం నడుమ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయం చేయాలని శ్రీలంక విపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అభ్యర్థించారు.

    ఆర్థిక సంక్షోభంతోపాటు తాజాగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా మొదలైంది.

    ప్రధాన మంత్రి మినహా దేశంలోని క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేశారు. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా రాజీనామా చేశారు.

    ఈ సంక్షోభంపై ఏఎన్ఐతో సజిత్ ప్రేమదాసా మాట్లాడారు. ‘‘మోదీ.. వీలైనంత సాయం చేయండి. ఇది మా మాతృభూమి. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి’’అని ఆయన అన్నారు.

    ఆర్థిక సంక్షోభం నడుమ మొదట్నుంచీ శ్రీలంకకు భారత్ సాయం చేస్తూనే ఉంది. చమురు, ఆహార ధాన్యాలు, ఔషధాలతోపాటు రుణాలు కూడా అందించింది.

    అయినప్పటికీ శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సాయాన్ని కూడా శ్రీలంక కోరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. వైఎస్ జగన్: ఆంధ్ర‌ప్రదేశ్‌‌ కొత్త జిల్లాల పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు

    జగన్మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, APCMO/FB

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాలను వర్చువల్ సమావేశంలో ప్రారంభించారు. ఏపీలో ఇప్పుడు మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి.

    కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, నరసాపురం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ జిల్లాలు అమలులోకి వచ్చాయి.

    జిల్లా అని తెలుగులో, డిస్ట్రిక్ట్ అని ఇంగ్లీషులో పలికే ఈ పదానికి పరిపాలనకు అనుగుణంగా నిర్దేశించిన ప్రాదేశిక భూభాగం అని అర్థం. జిల్లా అనే పదం పర్షియన్, ఉర్దూ భాషల నుంచి వచ్చింది. దాని అర్థం విభజన అని. జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటయ్యాయి. జిల్లాలను తిరిగి మండలాలు, గ్రామాలు, వార్డులుగా విభజిస్తారు.

    ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు సంబంధించిన పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  18. ఇప్పటివరకు ఏం జరిగింది?

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లో రష్యా చర్యలను యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ మరోసారి ఖండించారు. రష్యా మారణహోమానికి పాల్పడుతోందని ఆయన అన్నారు.

    తమ దేశాన్ని రష్యా ధ్వంసం చేస్తోందని జెలియెన్‌స్కీ ఆవేదన వ్యక్తంచేశారు.

    యుక్రెయిన్‌లోని దోన్బస్ ప్రాంతం వైపుగా రష్యా సేనలను తరలిస్తున్నారని, అక్కడ భారీగా సేనలను సమీకరిస్తున్నారని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది.

    మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నడుమ క్యాబినెట్ మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

    ఈ రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు దేశ అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.

  19. శ్రీలంక: అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన దేశ అధ్యక్షుడు..రిజర్వు బ్యాంకు గవర్నర్ రాజీనామా

    గోటాబయ రాజపక్ష

    ఫొటో సోర్స్, ANI

    శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేయడంతో అఖిల పక్ష సమావేశానికి దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్ష పిలుపునిచ్చారు. ‘‘ఈ రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు మనం అంతా కలిసి పనిచేద్దాం’’అని ఆయన పిలుపునిచ్చారు. క్యాబినెట్‌లో చేరాలని విపక్షాలను ఆయన కోరారు.

    మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అజిత్ నిర్వాడ్ కబ్రాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ‘‘క్యాబినెట్ మంత్రులు తమ రాజీనామాను సమర్పించిన నేపథ్యంలో.. నేను కూడా నా రాజీనామాను సమర్పించాను’’అని ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. రష్యా దాడిని ‘‘మారణహోమం’’గా అభివర్ణించిన జెలియెన్‌స్కీ

    జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Getty Images

    తమ దేశంపై రష్యా దాడిని ‘‘మారణహోమం’’గా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు. దేశం మొత్తాన్ని రష్యా చిత్రహింసలు పెడుతోందని అన్నారు.

    సీబీఎస్ న్యూస్‌తో జెలియెన్‌స్కీ మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా ధ్వంసం చేస్తోందని ఆయన అన్నారు.

    రష్యా మారణహోమానికి పాల్పడుతోందా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ‘‘అవును.. కచ్చితంగా ఇది మారణహోమమే. ప్రజలను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారు. మా దేశంలో 100కుపైగా దేశాల ప్రజలు ఉండేవారు. అందరినీ చంపేస్తున్నారు’’అని జెలియెన్‌స్కీ అన్నారు.

    మరోవైపు జెలియెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ‘‘మా దేశంలో పాల్పడుతున్న ప్రతి నేరానికి విచారణ చేపడతాం. దోషులందరికీ శిక్షలు విధిస్తాం’’అని ఆయన చెప్పారు.