వైఎస్‌ జగన్: ‘మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం, శాసన వ్యవస్థలో కోర్టులు వేలు పెట్టకూడదు’

కోర్టులు శాసన వ్యవస్థలో వేలు పెట్టకూడదు. కోర్టు తీర్పుల్లో గడువు పెట్టడం కూడా సరికాదు. నెల రోజుల్లో లక్షకోట్లు ఖర్చు చేయాలి, ఆరు నెలల్లో రాజధాని కట్టాలి వంటివి కోర్టులు నిర్దేశించలేవు అని వైఎస్ జగన్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. రష్యా అణ్వాయుధాలు వాడితే ఎలా స్పందించాలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న అమెరికా

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా, అణ్వాయుధాలు వాడితే ఏం చేయాలి అనేదానిపై అమెరికా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

    అణు, రసాయినిక, బయోలాజికల్ ఆయుధాలను రష్యా వాడితే ఎలా స్పందించాలి అనేదానిపై అమెరికా జాతీయ భద్రత సలహాదారుల బృందం వ్యూహాలు రచిస్తోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

    ‘టైగర్ టీం’ అని పిలిచే ఆ బృందం, యుక్రెయిన్ చుట్టుపక్కల ఉండే దేశాల భూభాగాల మీద కూడా రష్యా దాడులకు దిగితే తమ స్పందన ఎలా ఉండాలో కూడా వారు డ్రిల్స్ నిర్వహించినట్లు ఆ వెబ్‌సైట్ తెలిపింది.

    యుక్రెయిన్ నుంచి వస్తున్న లక్షలాది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడంలో యూరోపియన్ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి వారికి సాయం చేసే విషయం మీద కూడా అమెరికా చర్చలు జరుపుతోంది.

  2. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.