రష్యాతో శాంతికి మధ్యవర్తిత్వం వహించే అంశాన్ని పరిశీలించాలని పోప్‌ను కోరానని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ చెప్పారు.
రష్యా సైన్యం యూరప్‌లోకి ప్రవేశించాలని అనుకుంటోందని ఇటలీ ఎంపీలను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడుతూ జెలియెన్‌స్కీ అన్నారు.
మరియుపూల్, ఖార్కియెవ్ నగరాల్లో యుక్రెయిన్, రష్యా సైన్యాల మధ్య భీకర పోరాటం వల్ల కనీసం పది ఆస్పత్రులు పూర్తిగా ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ అధికారులు చెప్పారు.
రష్యా దాడుల్లో 117 మంది చిన్నారులు చనిపోయారని యుక్రెయిన్ వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నాయకుడి మృతితో హింస చెలరేగింది. పలు ఇళ్లకు నిప్పు పెట్టగా ఎనిమిది మంది చనిపోయారు.
మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా గెలిచింది.
యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.














