యుక్రెయిన్: కీయెవ్‌లో షాపింగ్ సెంటర్‌పై రష్యా క్షిపణి దాడి, ఎనిమిది మంది మృతి

యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలోని పొడిల్‌స్కీయి జిల్లాలో ఒక షాపింగ్ సెంటర్ మీద, పలు ఇళ్ల మీద రష్యా బాంబు దాడులు జరపటంతో ఎనిమిది మంది పౌరులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. స్టాక్ మార్కెట్లో ఒడుదొడుకులు

    నేడు భారత్ స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

    నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది. ఇక ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా రంగాల్లో కొనుగోలు కనిపిస్తోంది.

    మరొకవైపు ఆసియా మార్కెట్లు అయిన షాంఘై, నిక్కీ, తైవాన్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. హాంగ్ సెంగ్ మాత్రం నష్టాల్లో నడుస్తోంది.

  2. పోలండ్ వేదికగా నాటో దేశాలతో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ మీద రష్యా దాడి జరుగుతున్న నేపథ్యంలో పోలండ్‌లో పర్యటించనున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. శుక్రవారం పోలండ్ రాజధాని వార్సాకు చేరుకుకోనున్న బైడెన్... నాటో, యురోపియన్ యూనియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ వెల్లడించింది.

  3. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్! గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్‌ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.