ఇవాళ్టి ప్రధానాంశాలు
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో షాపింగ్ సెంటర్, ఇళ్లపై రష్యా బాంబు దాడులు చేయడంతో ఎనిమిది మంది చనిపోయారు.
కీయెవ్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. ఇళ్లు, షెల్టర్ల నుంచి బయటకు రావద్దని నగర మేయర్ ఆదేశించారు.
‘నాటో తమను వెంటనే కూటమిలో చేర్చుకోవాలని’ అడిగారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ.
మరియుపోల్‌ను తమకు అప్పగిస్తే హుమానిటేరియన్ కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తామని రష్యా రక్షణమంత్రిత్వశాఖ ప్రకటించింది. కానీ ఇందుకు యుక్రెయిన్ అంగీకరించలేదు.
చైనాలో 132 మందితో ప్రయాణిస్తున్న విమానంపర్వత ప్రాంతాల్లో కూలిపోయింది.
ఆరునూరైనాముందస్తు ఎన్నికల ముచ్చటేలేదని కేసీఆర్ అన్నారు. ఈసారి 95 నుంచి 105 స్థానాలుగెలుస్తామని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీన్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు