You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుక్రెయిన్: మరియుపూల్‌ రోడ్లపై యుద్ధ ట్యాంకులు, నగరం మధ్యకు చేరుకున్న పోరాటం

భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులు పలు అంశాలపై చర్చలు జరిపారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  1. చర్చించుకుందాం – జెలియన్‌స్కీ

    ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రష్యాతో అర్థవంతమైన శాంతి చర్చలు జరగాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ అన్నారు.

    శనివారం ఈ చర్చలు జరగాలని ఆయన కోరారు.

    శుక్రవారం రాత్రి ఆయన వీడియో సందేశం ఇస్తూ.. రష్యా తాను చేసుకున్న తప్పుల నుంచి బయటపడేందుకు, నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇదొక్కటే అవకాశమని అన్నారు.

    ‘‘కలిసేందుకు ఇదే సమయం, మాట్లాడుకునేందుకు ఇదే సమయం. భౌగోళిక సమగ్రతను పునరుద్ధరించేందుకు, యుక్రెయిన్‌కు న్యాయం చేసేందుకు ఇదే సమయం’’ అని జెలియన్‌స్కీ అన్నారు.

    ‘‘లేకపోతే రష్యా నష్టాలు ఎంతగా ఉంటాయంటే.. వాటి నుంచి తేరుకునేందుకు ఎన్నో తరాల సమయం పడుతుంది’’ అని హెచ్చరించారు.

  2. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది – పుతిన్

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంతం అయిన క్రైమియాను రష్యా తన భూభాగంలో కలుపుకుని ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మాస్కోలో సంబరాలు జరిగాయి. దాదాపు 2 లక్షల మంది ఈ వేడుకలకు హాజరయ్యారు.

    వీటికి హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. రష్యా సైనికుల సాహసాలను, త్యాగాలను కొనియాడారు.

    రష్యా దళాలు మానవ హననం నుంచి తూర్పు యుక్రెయిన్‌లోని ప్రజలను కాపాడుతున్నాయని ఎప్పట్లాగే అవాస్తవాలను పునరుద్ఘాటించారు.

    ‘‘మనం తర్వాత ఏం చేస్తామో మనకు తెలుసు. దానిని ఎలా చేస్తాం, దానికి చెల్లించుకునేది ఏంటో కూడా తెలుసు. మనం రచించుకున్న ప్రణాళికలను మనం కచ్చితంగా అమలు చేస్తాం’’ అని పుతిన్ అన్నారు.

    కాగా, పుతిన్ మాట్లాడుతున్నప్పుడు దాదాపు అన్ని రష్యన్ టీవీ చానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. మధ్యలో ఒకసారి ఈ ప్రసంగం అర్థంతరంగా ఆగిపోయింది. సాంకేతిక కారణాల వల్లే ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

  3. ఇప్పటివరకూ ఏం జరిగిందంటే..

    స్థానికం

    • తెలుగుదేశం పార్టీ ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్ ప్రకటించారు.

    జాతీయం

    • పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 10 మందితో క్యాబినెట్‌ను ప్రకటించారు. కొత్త మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
    • ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

    అంతర్జాతీయం

    • రచించుకున్న ప్రణాళికల ప్రకారం అన్నింటినీ కచ్చితంగా తాము అమలు చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
    • రష్యాతో అర్థవంతమైన శాంతి చర్చలకు తాను సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ ప్రకటించారు.
    • యుక్రెయిన్ దక్షిణాన ఉన్న నౌకాశ్రయ నగరం మరియుపూల్‌లోకి పోరాటం చేరుకుంది. ఇక్కడ ఉన్న 80 శాతం భవనాలు ధ్వంసమయ్యాయని అంచనా.
    • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుక్రవారం వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. నవంబర్ తర్వాత ఇద్దరు నాయకులు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ఇద్దరి మధ్యా 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి.
  4. బ్రేకింగ్ న్యూస్, తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. వందలాది స్పామ్ ట్వీట్లు

    తెలుగుదేశం పార్టీ ట్విటర్ అధికారిక అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. మే 19వ తేదీ అర్థరాత్రి 2 గంటల 23 నిమిషాలకు వందలాది స్పామ్ ట్వీట్లు ఈ ఖాతా నుంచి చేశారు. స్పేస్ ఎక్స్ ట్వీట్‌కు కామెంట్ల రూపంలో ఇవన్నీ చేసినట్లు కనిపిస్తోంది.

  5. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    నమస్కారం. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తలు, బ్రేకింగ్ న్యూస్, లైవ్ అప్‌డేట్ల కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.