బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
బ్రిటన్ రక్షణ శాఖ తాజా నిఘా వివరాల ప్రకారం యుక్రెయిన్ మీద దాడులు కొనసాగించడానికి రష్యా దళాలు ఇబ్బందులు పడుతున్నాయి.
యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా దళాలకు సరకు సమస్యలు కొనసాగుతున్నాయని అది తన రిపోర్టులో పేర్కొంది.
కదలిక పరిమితంగా ఉండడం, వైమానిక దాడులతో పైచేయి సాధించలేకపోవడంతో రష్యా తమ సైనికులకు కనీస అవసరాలైన ఆహారం, ఇంధనం లాంటివి సమర్థంగా సరఫరా చేయలేకపోతోంది.
యుక్రెయిన్ ఎడతెగని దాడుల నుంచి తన సరఫరా లైన్లను కాపాడుకోడానికి రష్యా ప్రయత్నిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో సైనికులను దానికోసం మళ్లిస్తోంది. ఇది ఆర్మీ సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తోంది.
యుక్రెయిన్ చుట్టూ ఉన్న రష్యా దళాలు స్తంభించాయని ఇంతకు ముందు అమెరికా కూడా చెప్పింది.