చీఫ్ ఇంటర్నేషనల్
కరెస్పాండెంట్
కీయెవ్‌లో 35
గంటల కర్ఫ్యూ అమల్లోకి రాగానే, రాజధాని శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు
సంభవించాయి.
ఆ విధ్వంసానికి
సంబంధించిన శబ్ధాలు కీయెవ్ నగరవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. యుక్రెయిన్‌కు ‘‘నిస్సందేహంగా
మద్దతు’’ ఇస్తున్నామని పేర్కొంటూ పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా దేశాల
ప్రధానమంత్రులు కీయెయ్‌లోనే చర్చలు జరిపారు.
రష్య యుద్ధ ట్యాంకులు,
ఫిరంగులు యుక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి.
ముట్టడికి గురైన
మరియుపూల్ నగరంలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, రోగులు కలిపి మొత్తం 400 మంది నిర్బంధంలో
ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఖేర్సన్‌లోని దక్షిణ
ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చినట్లు రష్యా అంటోంది.
కానీ కీయెవ్‌తో
పాటు ఇతర ప్రాంతాల్లో రష్యా పురోగతి నిలిచిపోయిందని పశ్చిమదేశాల అధికారులు అన్నారు.