టర్కీ వేదికగా రష్యాతో నాలుగో దఫా
శాంతి చర్చలు కొనసాగుతున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ తెలిపారు.
ఈ మేరకు ఆయన తాను మాట్లాడిన ఓ వీడియోను
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
చర్చలు బాగానే జరుగుతున్నాయని ఆయన ఆ
వీడియోలో చెప్పారు.
సోమవారం లుహాన్స్క్, కీయెవ్ నుంచి తరలివెళ్తున్న
3,806 మందికి యుక్రెయిన్ దళాలు సహాయపడ్డాయని ఆయన చెప్పారు.
వంద టన్నుల సహాయ సామగ్రి, సరకులతో
వస్తున్న కాన్వాయ్ బెర్డియాన్స్క్‌లో చిక్కుకుందని, అది ఇంకా రేవు పట్టణం మరియుపూల్
చేరలేదని చెప్పారు.
మరోవైపు యుక్రెయిన్ బలగాల నుంచి ఈ
స్థాయి ప్రతిఘటనను రష్యా ఊహించలేదని, రష్యా సేనలు గందరగోళంలో ఉన్నాయని జెలియెన్స్కీ
అన్నారు.
యుద్ధ రంగం నుంచి రష్యన్లు
పారిపోతున్నారని, వారి యుద్ధ సామగ్రిని కూడా వదిలివెళ్తున్నారని ఆయన అన్నారు.
యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన
తెలుపుతున్న రష్యా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.