బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
యుక్రెయిన్, రష్యా సంక్షోభం 18వ రోజుకు చేరుకుంది.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సమీపంలో భీకర పోరాటం జరుగుతోంది.
రష్యాతో పోరాటంలో ఇప్పటి వరకు 1300 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్స్కోల్జ్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మరోసారి టెలిఫోన్‌లో చర్చలు జరిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.