యుక్రెయిన్ లో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలివి:
రష్యా చమురు, గ్యాస్ దిగుమతులను నిషేధించినట్లు అమెరికా ప్రకటించింది. యూరోప్ కూడా 2022 చివరి నాటికి రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులను క్రమేపీ తగ్గించాలని చూస్తోంది. యూరోప్ అత్యధికంగా ఇంధన సరఫరా కోసం రష్యా పై ఆధారపడుతుంది.
ఇందుకు స్పందనగా రష్యా కూడా తమ దేశం నుంచి ఎగుమమతయ్యే కొన్ని రకాల సరుకులు, ముడి పదార్ధాల ఎగుమతులను నిషేధించింది. యూరోప్ కు చేసే ఇంధన సరఫరాలో కోతలు విధిస్తామని బెదిరించింది.
జర్మనీలో ఉన్న యూఎస్ ఎయిర్ బేస్ కు పంపేందుకు ఫైటర్ జెట్లు సిద్ధంగా ఉన్నట్లు పోలండ్ తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదన చేసే ముందు తమను సంప్రదించలేదంటూ అమెరికా ఈ ఆఫర్ తిరస్కరించింది. ఇది సాధ్యమయ్యే పని కాదని అంది.
మెక్ డోనల్డ్స్, స్టార్ బక్స్, కోకో-కోలా, పెప్సీ లాంటి సంస్థలు రష్యా నుంచి తమ కార్యకలాపాలను ఆపేయాలని ప్రకటించే దిశలో ఉన్నాయి.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ యూకే హౌస్ ఆఫ్ కామన్స్ ను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం చేశారు.
యుక్రెయిన్ పై ఆక్రమణ మొదలైనప్పటి నుంచి 20లక్షల మందికి పైగా యుక్రెయిన్ వదిలిపెట్టి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి చెప్పింది.