పుతిన్ హెచ్చరిక: ‘ఏ దేశమైనా అలా చేసిందంటే యుద్ధంలో దిగినట్టే లెక్క’

‘ఏ దేశమైనా ఈ దిశగా చర్య తీసుకుంటే, యుక్రెయిన్‌తో జరుగుతున్న సాయుధ పోరాటంలో ఆ దేశం కూడా పాల్గొన్నట్టుగానే మేం భావిస్తాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. తమ దేశ గగనతలాన్ని 'నో -ఫ్లైజోన్' చేయడానికి నిరాకరించిన నాటో నేతల వైఖరిని యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ

  1. యుక్రెయిన్ దగ్గర ఉన్న 3,000 అణ్వాయుధాలు ఏమైపోయాయి?

    యుక్రెయిన్ దగ్గర 1991లో 3,000 అణ్వాయుధాలు ఉండేవి. కానీ, నేడు అణ్వాయుధాలు లేని దేశంగా యుక్రెయిన్ మారింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత మూడు దశాబ్దాలలో ఏం జరిగింది?

    యుక్రెయిన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నట్లయితే అది తనపై దాడిని నిరోధించగలిగేదా? యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందన్న రష్యా ఆరోపణల్లో నిజమెంత?

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. బ్రేకింగ్ న్యూస్, రష్యా దళాల తాత్కాలిక కాల్పుల విరమణ

    రష్యా దళాలు తాత్కాలికంగా కాల్పులు విరమిస్తున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించిందని బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌస్ ట్వీట్ చేశారు.

    "యుక్రెయిన్‌లోని మరియుపూల్, వోల్నోవాఖా నగరాల్లో మానవతా సహాయం అందించేందుకు వీలు కల్పిస్తూ మాస్కో సమయం 10.00 గంటలకు రష్యా సైనిక దళాలు కాల్పులను విరమిస్తాయి" అని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. మరియుపూల్ పోర్ట్ సిటీలో కాల్పులు జరుపుతున్న రష్యా హెలికాప్టర్లు..

    గురువారం నుంచి మరియుపూల్ నగరం రష్యా "దిగ్బంధనం"లో ఉంది. ఆ నగరంపై రష్యన్ హెలికాప్టర్లు కాల్పులు జరుపుతున్న దృశ్యాల ఫుటేజీనీ బీబీసీ ధ్రువీకరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    సుమారు నాలుగు లక్షల జనాభా ఉన్న ఈ నగరం రష్యా సరిహద్దుకు సమీపంలో ఉంది.

    రష్యా సేనలు ముట్టడించినప్పటి నుంచి నగరంలో విద్యుత్, నీటి సరఫరా ఆగిపోయాయి.

    మానవతా సంక్షోభం పొంచి ఉన్నట్లు నగర అధికారులు హెచ్చరించారు.

  4. స్కై న్యూస్ రిపోర్టర్ల మీద మెరుపు దాడి చేసిన రష్యా సైనికులు

    స్కై న్యూస్ చీఫ్ కరస్పాండెంట్ స్టువార్ట్ రామ్‌సే, తన నలుగురు సహచరులతో కలిసి సోమవారం యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు తిరిగి వెళుతుండగా, రష్యా దళాలు మెరుపుదాడి చేశాయి.

    ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న రామ్‌సే మాటల్లో దాడి ఎలా జరిగిందంటే..

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నా చావు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉండగా నడుం మీద తుపాకీ గుండు దిగింది.

    "నన్ను తుపాకీతో కాల్చారు" అని గట్టిగా అరిచాను. కానీ, అంత నొప్పేం కలగలేదు. నడుం మీద గట్టిగా పిడికిలితో గుద్దినట్టు అనిపించిందంతే.

    అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయతించాను. ఎలాగోలా నా ఇయర్ ఫోన్లు, ప్రెస్ కార్డు చేజిక్కుంచుకున్నా. కారు దిగి లేచి నిలబడ్డానని, ఒడ్డు నుంచీ జాగింగ్ చేస్తూ, మెల్లగా పరుగు అందుకున్నానని నా సహోద్యోగి చెప్పారు.

    పరిగెడుతూ అదుపు తప్పి, కింద పడిపోయాను. ముఖానికి దెబ్బ తగిలింది. హెల్మెట్ నన్ను కాపాడింది.

    మేం చాలా అదృష్టవంతులం. కానీ, వేల కొద్దీ యుక్రెయినియన్లు చనిపోతున్నారు. వాళ్ల కుటుంబాలను లక్ష్యాలుగా చేసుకుని రష్యా దాడి చేస్తోంది.

    ఈ యుద్ధం రోజు రోజుకూ ఘోరంగా తయరవుతోంది.

  5. 10 రోజుల యుద్ధం: ఇప్పటి వరకూ ఏం జరిగింది?

    బాంబుల దాడిలో శిథిలమైన ఖార్కియెవ్ నగరం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బాంబుల దాడిలో శిథిలమైన ఖార్కియెవ్ నగరం

    యుక్రెయిన్ మీద రష్యా దాడికి నేటితో 10వ రోజు. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ చోటు చేసుకున్న కీలక పరిణామాలివే:

    • ఇప్పటివరకూ ఈ యుద్ధంలో ఎంత మంది చనిపోయారన్నది స్పష్టత లేదు. అయితే, ఫిబ్రవరి 24న ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ప్రజలు యుక్రెయిన్ వీడి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ వెల్లడించింది.
    • మొదటగా రష్యాకు వశమైన నగరం ఖెర్సాన్. నల్ల సముద్రంలో నీపర్ నది కలిసే చోట ఈ నగరం ఉంటుంది.
    • రాజధాని కీయెవ్‌తో పాటు యుక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరమైన ఖార్కియెవ్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. కీయెవ్ నగరాన్ని చుట్టుముట్టేందుకు సమీపించిన రష్యన్ సేనల భారీ కాన్వాయ్ ప్రస్తుతం నిలిచిపోయింది.
    • మరియుపూల్ దక్షిణ పోర్ట్ ఇప్పటికే రష్యన్ల దిగ్బంధంలో ఉంది. మరో ఓడరేవు ఒడెస్సా వైపు రష్యా సేనలు దూసుకుపోతున్నాయి. ఈ రెండింటినీ అదుపులోకి తీసుకుంటే యుక్రెయిన్ సముద్ర మార్గాలు మూసుకుపోయినట్లవుతుంది.
    • జాపొరియా న్యూక్లియర్ ప్లాంట్‌ను కూడా రష్యన్లు స్వాధీనం చేసుకున్నారు. యూరప్‌లోని ఈ అతిపెద్ద న్యూక్లియర్ కేంద్రాన్ని రష్యన్ సేనలు శుక్రవారం నాడు సుదీర్ఘంగా కాల్పులు జరిపి తమ అదుపులోకి తెచ్చుకున్నాయి.
    • పాడుబడిన చెర్నోబిల్ ప్లాంట్ కూడా రష్యా అధీనంలోనే ఉంది. ఈ అణుకేంద్రమే 1986లో ప్రమాదానికి గురై తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది.
    • యుక్రెయిన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేయడంపై సెన్సార్ విధిస్తూ రూపొందించిన చట్టాన్ని రష్యా ఆమోదించడంతో బీబీసీ సహా ఇతర స్వతంత్ర మీడియా సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను రద్దు చేసుకున్నాయి.
    • సామ్‌సంగ్, ఎయిర్‌బీఎన్‌బీ, కార్టియే వంటి సంస్థలు రష్యాలో కార్యకలాపాలు/ ఎగుమతులను రద్దు చేసుకున్నాయి.
  6. యుక్రెయిన్‌ సంక్షోభం: జాతి వివక్షతో ఇబ్బందులు పడుతున్నామంటున్న భారతీయ విద్యార్ధులు

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, MOHAMMED MAHTAB RAZA

    ఫొటో క్యాప్షన్, బంకర్లలో గడుపుతున్న భారతీయ విద్యార్ధులు

    యుక్రెయిన్‌లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నట్లు తూర్పు యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అర్ధమవుతోంది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేయలేక పోతున్నారు. స్థానికంగా ఉండే షాపులకు వెళితే వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది.

    తూర్పు నగరమైన సుమీలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, పగటిపూట తాము ఉండే బంకర్ల పైన తుపాకులు పట్టుకుని తిరుగుతున్న వ్యక్తులను చూశామని, రాత్రంతా భారీ ఎత్తున బాంబు దాడులు జరగడం గమనించామని చెప్పారు. తమ బంకర్ల మీదుగా ట్యాంకుల వెళ్తున్న చప్పుడు వినిపించేదని కూడా విద్యార్థులు వెల్లడించారు.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  7. రష్యాపై ఆర్థిక ఆంక్షలను ప్రకటించిన సింగపూర్

    యుక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై ఆంక్షలు విధిస్తామని సింగపూర్ ప్రకటించింది.

    ఎగుమతులపై పరిమితులు, కొన్ని రష్యన్ బ్యాంకులపై ఆర్థిక ఆంక్షలు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై పరిమితులు సహా ఆర్థిక సంస్థలు రష్యా సెంట్రల్ బ్యాంకుకు అందించే సేవలపై నిషేధం విధిస్తామని పేర్కొంది.

    "సిద్ధాంతపరంగా సారూప్యం ఉన్న దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు, పరిమితులు విధించాలని" సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు వారి విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ పార్లమెంటులో తెలిపారు.

    ఆగ్నేయ ఆసియా దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన తొలి దేశం ఇదే.

    రష్యా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్
  8. కీయెవ్ వైపు వెళ్తున్న రష్యా ఆర్మీ కాన్వాయ్ ఎందుకు ఆగింది

    యుక్రెయిన్ సరిహద్దులో రష్యా సేనలు

    ఫొటో సోర్స్, MAXAR TECHNOLOGIES

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్ వైపు కదులుతున్న రష్యా ఆర్మీ భారీ కాన్వాయ్ గత కొన్నిరోజులుగా చాలా కష్టంగా ముందుకెళ్తోందని బ్రిటన్ రక్షణ శాఖ చెప్పింది. ఈ కాన్వాయ్ 64 కిలోమీటర్ల పొడవు ఉన్నట్టు చెబుతున్నారు.

    కానీ, రష్యా ఇప్పటికీ 30 లక్షల జనాభా ఉన్న కీయెవ్‌ను చుట్టుముట్టిందని, అవసరమైతే దానిపై దాడులు కూడా చేయాలనుకుంటోందని అమెరికా రక్షణ అధికారులు చెబుతున్నారు.

    ఫిబ్రవరి 28న ఈ కాన్వాయ్‌కు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చిన తర్వాత రష్యా త్వరలోనే యుక్రెయిన్ మీద దాడి చేయబోతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  9. యుక్రెయిన్ సంక్షోభం: తాజా సమాచారం

    మార్చి 5, శనివారం.. యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి ఇవాళ్టికి పదవ రోజు.

    మీరు ఇప్పుడే మా పేజీని చూస్తున్నట్లయితే, ఇప్పటి వరకు జరిగిన సఘటనలు క్లుప్తంగా మీకోసం..

    • యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలన్నింటిపై రష్యా బాంబు దాడులను ముమ్మరం చేసింది. ఉత్తరం, తూర్పు దిక్కుల నుంచి దాడి చేస్తున్నా, దక్షిణం వైపున్న నగరాలపై ప్రత్యేకంగా దాడులు ఎక్కువగా ఉన్నాయి. విచక్షణారహితంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.
    • యుక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను అమలు చేసేందుకు పశ్చిమ దేశాలు నిరాకరించాయి. "చనిపోయేవారంతా మీవల్లే చనిపోతారు" అంటూ ఈ అంశంలో పశ్చిమ దేశాల నిర్ణయాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ ఖండించారు.
    • మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్, ఎల్‌వీఎంహెచ్ లాంటి సంస్థలన్నీ రష్యాలో తమ ఉత్పత్తుల అమ్మకాలు నిలిపేశాయి.
    • యుక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించిన వార్తలను సెన్సార్ చేసే కఠినమైన చట్టాన్ని మాస్కో ఆమోదించిన తరువాత, బీబీసీ లాంటి స్వతంత్ర మీడియా సంస్థలు ఎన్నో ఆ దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.
    • మరియుపూల్‌లో మానవతా సేవలు అందించేందుకు వీలు కల్పించాలని ఆ నగర మేయర్ విజ్ఞప్తి చేశారు. రష్యా దళాలు తమ ఊరిని ముట్టడించాయని ఆయన అన్నారు.
  10. యూరప్‌లో రష్యా ప్రభుత్వ మీడియా (RT)ను బ్లాక్ చేసిన టెలిగ్రాం

    రష్యా, యుక్రెయిన్ యుద్ధం గురించి సరైన సమాచారంతో పాటు తప్పుడు సమాచారం కూడా అందించే ప్రధాన వేదికగా మారింది టెలిగ్రాం.

    యూరప్‌లో తమ సర్వీసులను వినియోగించకుండా రష్యా ప్రభుత్వ మీడియా (ఆర్‌టీ) ఛానెల్స్ అన్నింటినీ బ్లాక్ చేసినట్లు టెలిగ్రాం ప్రతినిధి శుక్రవారం ధ్రువీకరించారు. స్పుత్నిక్ వంటి ఇతర మీడియా సంస్థల మీద ప్రభావం ఉంటుందా లేదా అనేది స్పష్టంగా తెలీదు.

    క్రెమ్లిన్ మద్దతు ఉన్న మీడియా నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించిన తర్వాత, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో ఆర్‌టీని ఇప్పటికే బ్లాక్ చేశారు.

    టెలిగ్రాంను "యుద్ధ ప్రచార సాధనంగా" (వార్ ప్రోపగాండా) ఉపయోగిస్తున్నారని ఈయూ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.

    ఈ సోషల్ మీడియా వేదికను 2013లో రష్యన్ సోదరులు నికోలాయ్, పావెల్ దురోవ్ స్థాపించారు. తరువాత, పావెల్ రష్యా నుంచి పారిపోయారు.

    రష్యా, యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

  11. సెర్బియాలో పుతిన్-అనుకూల ప్రదర్శనలు

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని సమర్థిస్తూ సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో వేలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు.

    రష్యా చక్రవర్తి జార్ నికొలస్-2 స్మారకం వద్ద దాదాపు నాలుగు వేల మంది ప్రజలు గుమిగూడి రష్యా, సెర్బియన్ జాతీయ గీతాలు ఆలపించారు. మా రెండు దేశాలూ అన్నాదమ్ముల వంటివి అని వారు నినాదాలు చేశారు.

    రష్యా జెండాలు, పుతిన్ ఫోటోలు పట్టుకుని ప్రదర్శనకారులు నగరంలో ర్యాలీ నిర్వహించి రష్యన్ ఎంబసీకి చేరుకున్నారు.

    సెర్బియా నిజానికి రష్యా, యుక్రెయిన్‌ల మధ్య తటస్థ వైఖరి అవలంబించడానికి నానా పాట్లు పడుతోంది.

    యూరోపియన్ నేతలకు దూరమై ఈయూలో చేరే అవకాశాలను కోల్పోకుండా చూసుకోవడంతో పాటు మాస్కోతో ఉన్న బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.

    సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్
  12. యుక్రెయిన్‌కు మద్దతుగా ప్రజా ప్రదర్శనలు

    యుక్రెయిన్‌కు, ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీకి ప్రపంచంలోని పలు నగరాల్లోని ప్రజలు శుక్రవారం రాత్రి వీధుల్లోకి భారీ సంఖ్యలో వచ్చి మద్దతు తెలిపారు.

    టిబిలిసి రాజధాని జార్జియన్, చెక్ రాజధాని ప్రాగ్‌లలో వేల సంఖ్యలో ప్రదర్శనగా వచ్చి యుక్రెయిన్‌కు తమ మద్దతు తెలిపారు. వీరిని ఉద్దేశించి జెలియెన్‌స్కీ వీడియో సందేశాన్ని వినిపించారు.

    ఫ్రాంక్‌ఫర్ట్, విలినియస్, లియాన్, బ్రాటిస్లావాలలో జరుగుతున్న యుద్ధ-వ్యతిరేక ప్రదర్శనలను ఉద్దేశించి కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడారు.

    అంతకుముందు రోజు కూడా లిస్బన్, లండన్, సోల్, జకార్తా, లా పాజ్ నగరాల్లో యుక్రెయిన్-అనుకూల ప్రదర్శనలు జరిగాయి.

    యుక్రెయిన్‌కు మద్దతుగా యూరప్ నగరాల్లో ర్యాలీలు

    ఫొటో సోర్స్, Getty Images

    జార్జియన్ రాజధాని టిబిలిస్‌

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జార్జియన్ రాజధాని టిబిలిస్‌
    చెక్ రాజధాని ప్రాగ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, చెక్ రాజధాని ప్రాగ్
    చెక్ నగరంలో భారీ ప్రదర్శన

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, చెక్ నగరంలో భారీ ప్రదర్శన
  13. రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బీబీసీ లైవ్ పేజికి స్వాగతం

    యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం పదో రోజుకు చేరుకుంది.

    తమ దేశాన్ని నో-ఫ్లైజోన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌ను నాటో నేతలు తిరస్కరించడాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.

    యూరప్‌లోని అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ మీద రష్యా దాడి ఆకతాయి చర్య అని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశంలో అమెరికా వ్యాఖ్యానించింది.

    'ఫేస్‌బుక్'ను నిషేధించిన రష్యా తాజాగా ట్విటర్,యూట్యూబ్‌లను కూడా బ్లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.