రష్యాలో జర్నలిస్టుల పనిని తాత్కాలికంగా రద్దు చేసిన బీబీసీ
యుక్రెయిన్‌పై జరుగుతున్నది యుద్ధం కాదని రష్యా అంటోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే 15 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం స్వతంత్ర జర్నలిజాన్ని కూడా నేరంగా పరిగణిస్తోందని బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ అన్నారు.
లైవ్ కవరేజీ
అరుణ్ శాండిల్య and హరికృష్ణ సీహెచ్
జేపొరజియా అణు కేంద్రంపై దాడి, మంటల వీడియో
వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడులు
యుక్రెయిన్‌లోని జేపొరజియా న్యూక్లియర్
ప్లాంట్‌పై రష్యా దాడులకు సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ఇది.
ఇక్కడి అణుఇంధనం లీకైతే తీవ్రమైన
ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు
చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని యుక్రెయిన్ ఎమర్జెన్సీ
సర్వీసెస్ విభాగం తెలిపింది.
అయితే, ఫైర్ ఫైటర్స్ అక్కడకు
చేరుకోకుండా రష్యా సైనికులు అడ్డుకుంటున్నారని ఇంతకుముందు ఈ యుక్రెయిన్ ఎమర్జెన్సీ
సర్వీసెస్ విభాగం ఆరోపించింది.
రష్యా ఉద్దేశపూర్వకంగానే న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేస్తోంది: జెలియెన్క్సీ
యూరప్‌లోనే అతి పెద్ద న్యూక్లియర్
ప్లాంట్ అయిన జేపొరజియా అణు విద్యుత్కేంద్రం మంటల్లో చిక్కుకోవడానికి రష్యాయే
కారణమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్క్సీ ఆరోపించారు.
ప్లాంట్‌లోని 6 రియాక్టర్లపై రష్యా
ఉద్దేశపూర్వకంగా యుద్ధ ట్యాంకులతో దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు ఆయన.. అంతర్జాతీయ సమాజం జోక్యం
చేసుకుని చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు.
జేపొరజియాలో అణు ముప్పు తలెత్తితే
1986లో చెర్నోబిల్ నాటి కంటే పర్యవసానాలు మరింత ఘోరంగా ఉంటాయని జెలియన్‌స్కీ
అన్నారు.
‘‘యూరప్ దేశాలూ! మేల్కోండి. యుక్రెయిన్ అణు కేంద్రంపై రష్యా కాల్పులు జరుపుతోందని మీ
నాయకులకు చెప్పండి’’ అని ఆయన కోరారు.
అమెరికా, బ్రిటన్, ఈయూ, జర్మనీ,
పోలాండ్ నాయకులతో.. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అధికారులతో
సంప్రదిస్తున్నానని... అయితే, సాధారణ ప్రజలు కూడా తమతమ దేశాల నాయకులను ఈ విషయంలో మేల్కొలపాలాని
ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘ప్రపంచాన్ని అణు బుగ్గితో
కప్పేస్తామని రష్యా ఇంతకుముందు హెచ్చరించందని, ఇప్పుడు హెచ్చరికలు దాటి వాస్తవంలా
మారుతోంది’’ అన్నారు జెలియెన్క్సీ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
బ్రేకింగ్ న్యూస్, న్యూక్లియర్ ప్లాంట్ భద్రంగానే ఉంది: జడ్ఎన్‌పీపీ అధికారులు
మంటల్లో చిక్కుకున్న న్యూక్లియర్
ప్లాంట్ సురక్షితంగానే ఉందని జేపొరజియా రీజనల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ హెడ్
అలెగ్జాండ్రా స్టారక్ తెలిపారు.
జేపొరజియా న్యూక్లియర్ పవర్ స్టేషన్(జడ్ఎన్‌పీపీ)
డైరెక్టర్‌తో మాట్లాడానని.. అంతా సురక్షితమేనని చెప్పారని అలెగ్జాండ్రా తెలిపారు.
‘‘అణు భద్రత విషయంలో ఢోకా లేదు జడ్ఎన్‌పీపీ
డైరెక్టర్ హామీ ఇచ్చారు’’ అంటూ అలెగ్జాండ్రా ఫేస్‌బుక్ వేదికగా తెలిపారు.
‘మంటల్లో చిక్కుకున్న రియాక్టర్‌లో అణు ఇంధనం’
ఫొటో సోర్స్, ge
జేపొరజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో
మంటలు చెలరేగిన నేపథ్యంలో యుక్రెయిన్ అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు
‘ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ’ తెలిపింది.
ప్లాంట్‌పై ఆయుధాలతో దాడి చేయడాన్ని
ఆపాలని రష్యా సేనలను కోరుతూ ప్లాంట్ అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్ట్
చేశారు.
‘‘యూరప్‌లోనే అత్యంత పెద్దదైన
న్యూక్లియర్ ప్లాంట్ మంటల్లో చిక్కుకోవడంతో భారీ అణు ముప్పు కలగనుంది’’ అంటూ ప్లాంట్
అధికార ప్రతినిధి ఆండ్రీ టజ్ చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.
ప్రస్తుతం మంటల్లో చిక్కుకున్న రియాక్టర్
పునరుద్ధరణలో ఉందని.. ప్రస్తుతం అది పనిచేయనప్పటికీ అందలో అణుఇంధనం ఉందని ఆండ్రీ
వెల్లడించారు.
యుక్రెయిన్ విద్యుత్ అవసరాలలో 25 శాతం
ఈ ప్లాంటే తీర్చుతుంది.
మంటల్లో న్యూక్లియర్ ప్లాంట్
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లోని జేపొరజియా న్యూక్లియర్
ప్లాంట్ మంటల్లో చిక్కుకున్నట్లు అక్కడికి సమీపంలోని ఎనర్హోదర్ నగర మేయర్ దిమిత్రో
ఓర్లోవ్ తెలిపారు.
ఈ న్యూక్లియర్ ప్లాంట్ యూరప్‌లోనే
అతిపెద్ద ప్లాంట్.
‘‘ప్లాంటు భవనం, యూనిట్‌లపై రష్యా
సేనలు ఆపకుండా బాంబులు వేస్తుండడం వల్లే ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది’’ అని ఓర్లోవ్
తెలిపారు.
యుక్రెయిన్ ఆగ్నేయ ప్రాంతంలోని జేపొరజియా శివారులలో యుక్రెయిన్, రష్యా బలగాల మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది.
ట్యాంక్‌లతో రష్యా దళాలు జపోరిఝియాలో
ప్రవేశించి ప్లాంటును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కార్మికులు,
స్థానిన ప్రజలు ప్లాంట్ చుట్టూ చేరి రష్యా సేనేల ప్రయత్నాలను అడ్డుకున్నారు.
యుక్రెయిన్‌లో జేపొరజియా సహా నాలుగు
యాక్టివ్ న్యూక్లియర్ ప్లాంట్లు ఉన్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ముప్పు
నివారణకు గాను యుక్రెయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని ఇంటర్నేషనల్ ఆటమిక్
ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. యుక్రెయిన్‌లో జపోరిఝియా సహా 4 యాక్టివ్ న్యూక్లియర్
ప్లాంట్లు ఉన్నాయి.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
యుక్రెయిన్,
రష్యా సంక్షోభం తొమ్మిదో రోజుకు చేరుకుంది.
రెండు దేశాల ప్రతినిధుల మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా
మరోవైపు యుద్ధమూ అంతే తీవ్రంగా సాగుతోంది.
యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు
పాల్పడుతోందన్న ఫిర్యాదులతో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) రష్యాపై విచారణ
ప్రారంభించింది.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు రప్పించే ప్రక్రియ
నిరంతరాయంగా కొనసాగుతోంది.
రష్యా, యుక్రెయిన్
యుద్ధానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ పేజీ చూస్తూఉండండి.