మాతో చర్చల్లో పుతిన్ పాల్గొనాలి: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో గురువారం వేకువజామున వరుస పేలుళ్లు జరిగాయి. నగరం మధ్యలో రెండు తీవ్రమైన పేలుళ్లు చోటుచేసుకోగా ఓ మెట్రో స్టేషన్ వద్ద మరో రెండు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

లైవ్ కవరేజీ

అంజయ్య తవిటి

  1. గాయపడి ఇళ్లు, వీధుల్లో పడి ఉన్నవారిని కాపాడే అవకాశం కూడా లేదు

    Ukrain map

    ఫొటో సోర్స్, Bbc

    రష్యా దాడుల్లో గాయపడిన వారిని కాపాడే అవకాశం కూడా లేనంతగా షెల్లింగ్ జరుగుతోందని మరియుపోల్ మేయర్ తెలిపారు.

    నల్ల సముద్రం తీరంలో ఉన్న ఈ రేవు పట్టణంపై నిన్నటి నుంచి పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి.

    బాంబుల వర్షం ఆగకపోవడంతో గాయాలతో ఎక్కడికక్కడ పడి ఉన్న వారిని రక్షించే అవకాశం ఏమాత్రం లేకుండా పోయిందని నగర మేయర్ ఒక వీడియో సందేశంలో తెలిపారు.

    మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రజలు సురక్షితంగా అక్కడి నుంచి బయట పడేందుకు తమ సైన్యం అవకాశం కల్పిస్తోందని చెబుతోంది.

    అయితే యుక్రెయిన్ సైన్యం లొంగిపోకపోతే దాడులు మరింత తీవ్రం చేస్తామని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి ప్రకటించారు.

  2. బ్రేకింగ్ న్యూస్, పారాలింపిక్స్ లో పాల్గొనకుండా బెలారుస్, రష్యాలపై నిషేధం

    బీజింగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్లో బెలారుస్, రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ పారాలింపిక్స్ కమిటీ ప్రకటించింది.

    రష్యా దాడి నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

    రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా ఉండటంతో ఆ దేశాన్ని వింటర్ పారాలింపిక్స్ నుంచి బహిష్కరించారు

  3. రూబుల్ పతనాన్ని ఆపేందుకు రష్యా సెంట్రల్ బ్యాంకు చర్యలు

    Currency market

    ఫొటో సోర్స్, EPA

    ప్రజలు విదేశీమారక ద్రవ్యం కోసం రూబుల్స్ విక్రయించడాన్ని అరికట్టేందుకు రష్యా సెంట్రల్ బ్యాంకు చర్యలు చేపడుతున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

    కరెన్సీ ఎక్స్ఛేంజ్ ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని కొనుగోలు చేయడంపై 30 శాతం కమిషన్ విధిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది.

    రూబుల్ విలువ పతనాన్ని నివారించేందుకు అధ్యక్షుడు పుతిన్ చర్యలు ప్రకటించారు.

    రష్యా ప్రజలు విదేశాలకు నగదు బదిలీ చేయడంపై నిషేధం విధించారు. మునుపెన్నడూ లేనంతగా రూబుల్ విలువ అత్యంత కనిష్టానికి పతనమైంది.

  4. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానంపై ఓటింగుకు భారత్ దూరం

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానంలో ఓటింగుకు భారత్ దూరంగా ఉంది.

    రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐరాస చేసిన తీర్మానాలకు భారత్ దూరంగా ఉండడం ఈ వారంలో ఇది మూడోసారి.

    రష్యా, యుక్రెయిన్ సంక్షోభంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని అమెరికా కోరినప్పటికీ భారత్ ఈ విషయంలో ఐరాస తీర్మానాలకు గైర్హాజరు అవుతూనే ఉంది.

    అమెరికా, రష్యా రెండు దేశాలకీ సమదూరం పాటించే విధానంలో ఉన్న భారత దౌత్యపరంగా ఆచితూచి ముందుకెళ్తోంది.

    అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడంపై పాశ్చాత్య దేశాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి

  5. కీయెవ్ వెళ్తున్న రష్యా ఆర్మీ కాన్వాయ్ ఆగింది

    కీయెవ్ దిశగా వెళుతున్న రష్యాకు చెందిన భారీ సాయుధ వాహనశ్రేణి తాత్కాలికంగా ఆగిందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.

    సాయుధ శ్రేణిలోనివారంతా ఒకచోట చేరి పరిస్థితుల్ని అంచనా వేసుకొని ముందుకు సాగేందుకు తీసుకుంటున్నా విరామంగా కిర్బీ అభిప్రాయపడ్డారు.

    రవాణా పరమైన సమస్యలు యుక్రెయిన్ సైన్యం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన కూడా ఈ విరామానికి కారణం కావచ్చు అని అన్నారు. రష్యా సైనికులు చమురు, ఆహారం కొరత కూడా ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు.

    రష్యా అధీనం లోకి వెళ్ళిన పట్టణాలలో సైనికులు సూపర్ మార్కెట్లను దోచుకుంటున్నారని ట్రైన్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

    అయితే బీబీసీ దీన్ని స్వయంగా ధ్రువీకరించలేదు.

    Russia troops convoy

    ఫొటో సోర్స్, Maxar

  6. రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందనే భయంతోనే యుక్రెయిన్‌కు అండగా ఏ దేశమూ యుద్ధం చేయడం లేదా?

    ప్రపంచంలో తొలి అణ్వాయుధ పరీక్ష అమెరికాలో న్యూ మెక్సికో లోని అలోమాగార్డో ఎయిర్ బేస్ లో 1945 జులై 16వ తేదీన జరిగింది. ట్రినిటీ అనే కోడ్ తో నిర్వహించిన ఈ పరీక్ష జరిగి 76 సంవత్సరాలు అవుతోంది .

    ఈ పరీక్ష జరిగిన మరి కొన్ని వారాలలోనే, అదే సంవత్సరం ఆగస్టు 6న జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి మీద అణు బాంబు ప్రయోగం జరిగింది.

    ఈ బాంబు దాడితో హిరోషిమాలో 90000 నుంచి 166000 మంది ప్రజలు మరణించారు. నాగసాకిలో 60000 నుంచి 80000 మంది మరణించినట్లు అంచనా.

    అణు బాంబు దాడుల వలన నగరాలకు నగరాలే సమూలంగా నాశనమవుతాయి.

    న్యూక్లియర్ ఆయుధాలను ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాలుగా పేర్కొంటారు.

    మరి ప్రస్తుతం ప్రపంచంలో ఏఏ దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి? ఎవరి దగ్గర ఎన్నేసి అణ్వాయుధాలున్నాయి?

    పూర్తి వివరాలు ఈ వీడియోలో..

    వీడియో క్యాప్షన్, భారత్‌కన్నా పాకిస్తాన్ దగ్గరే ఎక్కువ అణు బాంబులున్నాయా?
  7. యుక్రెయిన్ సైన్యం మా విద్యార్థులను మానవ కవచాలుగా వాడుకోవడం లేదు: భారత్

    యుక్రెయిన్ సైన్యం చేతిలో భారతీయ విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న రష్యా ఆరోపణలను భారత్ ఖండించింది.

    యుక్రెయిన్ సాయుధ బలగాలు విద్యార్థులను మానవ కవచాలుగా వాడుకుంటున్నాయని రష్యా చెప్పింది.

    అయితే, ఇంతవరకు తమకు అలాంటి సమాచారం ఏమీ లేదని భారత్ తెలిపింది.

    భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘‘భారత విద్యార్థులను బందీలుగా పట్టుకున్నారని ఇంతవరకు మాకు ఫిర్యాదులేవీ అందలేదు’ అని స్పష్టం చేసింది.

    ఖార్కియెవ్, ఇతర పట్టణాల నుంచి భారతీయ విద్యార్థులు యుక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు చేరుకునేలా రైళ్లు ఏర్పాటుచేయాలని యుక్రెయిన్ అధికారులను కోరినట్లు ఆ ప్రకటనలో భారత్ పేర్కొంది.

    ఖార్కియెవ్‌లో ఇప్పటికీ వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని భావిస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. 10 లక్షల మంది యుక్రెయిన్ విడిచి వెళ్లారు: ఐరాస

    శరణార్థులు

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ నుంచి 10 లక్షల మంది ప్రజలు పొరుగుదేశాలకు చేరుకున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

    ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తరువాత వారం రోజుల్లోనే వీరంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సరిహద్దులు దాటారని ఐరాస తెలిపింది.

    కాల్పులు విరమించాలని, అప్పుడే యుక్రెయిన్‌లో ఉండిపోయిన మిగతా బాధితులకు మానవతా సహాయం అందించగలమని యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీ క్రైసిస్ ఫిలిప్పో గ్రాండి ట్విటర్ వేదికగా కోరారు.

    యుక్రెయిన్‌లో అంతర్గత వలసలు వెళ్లే 1.2 కోట్ల మందికి సహాయం అవసరమని ‘యూఎన్ హైకమిషన్ ఫర్ రిఫ్యూజీ క్రైసిస్’ అంచనా వేస్తోంది.

  9. కీయెవ్ ప్రజలు నగరం నుంచి సురక్షితంగా బయటపడేందుకు రష్యా సైన్యం అనుమతి

    కీయెవ్‌లో చిక్కుకుపోయిన కుటుంబాలు

    ఫొటో సోర్స్, Getty Images

    కీయెవ్‌లోని ప్రజలు ఆ నగరం నుంచి సురక్షితంగా వెళ్లిపోవడానికి రష్యా సైనికులు అనుమతిస్తున్నారు. కీయెవ్ నుంచి సెంట్రల్ యుక్రెయిన్ నగరం వాసిల్కీవ్ దిశగా ప్రజలు వెళ్లిపోయేందుకు రష్యా సైన్యం అనుమతిస్తుందని మాస్కోలోని అధికారులు ప్రకటించారు.

    యుక్రెయిన్‌పై దాడి గురించి రష్యాలోని ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ ఈ మేరకు తెలిపారు.

    ‘రష్యా 24’ చానల్‌తో మాట్లాడిన ఆయన.. ‘కీయెవ్ నుంచి బయటకు వెళ్లే ప్రజలకు మా సైన్యం ఎలాంటి ఆటంకాలు కలిగించదు’ అని స్పష్టం చేశారు.

    పౌరులు సురక్షితంగా వెళ్లిపోవడానికి వీలు కల్పిస్తామని రష్యా సైన్యం చెప్పడం ఇది రెండోసారి.

    కొనషెంకోవ్ సోమవారం కూడా ఇదే ప్రకటన చేశారు. ప్రజలు కీయెవ్ నుంచి సురక్షితంగా బయటపడాలని.. వాసిల్కీవ్ వైపు వెళ్లడానికి దారులన్నీ తెరిచే ఉన్నాయని, అటువైపు వెళ్లడం ప్రజలకు సురక్షితమని కొనషెంకోవ్ సోమవారం చెప్పారు.

    అయితే, ప్రస్తుతం వాసిల్కీవ్‌పైనా రష్యా పెద్ద ఎత్తున షెల్లింగ్ జరుపుతోంది.

  10. యుక్రెయిన్ సరిహద్దులకు చేరుకునే భారతీయులను మాత్రమే స్వదేశానికి తేగలమా? చేరుకోలేని వారి పరిస్థితి ఏమిటి, ఇరాక్, యెమెన్, కువైట్ యుద్ధాల సమయంలో భారతీయులను స్వదేశానికి ఎలా తెచ్చారు? ఇప్పుడు ఏం జరుగుతోంది?

    యుక్రెయిన్ నుంచి స్వదేశానికి వస్తున్న భారతీయులు

    ఫొటో సోర్స్, ANI

    వైమానిక దళానికి చెందిన సి-17 యుద్ధ విమానాలను, నలుగురు కేంద్ర మంత్రులను యుద్ధ పీడిత యుక్రెయిన్ సమీప దేశాలలో మోహరించడం ద్వారా ఆ దేశంలో చిక్కుకున్న తమ విద్యార్థులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తోంది.

    యుక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ తక్షణ సహాయం అవసరం.

    అయితే, ఇక్కడ ఒక సందేహం ఉంది. యుక్రెయిన్‌ను ఆనుకుని ఉన్న వివిధ ఈయూ దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపడం వల్ల విద్యార్థులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే పని సులభం అవుతుందా?

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  11. నిషేధాన్ని ఉల్లంఘించి స్వీడన్ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు

    రష్యా యుద్ధ విమానాలు

    ఫొటో సోర్స్, Swedish Armed Forces

    నిషేధాన్ని ఉల్లంఘించి రష్యా ఫైటర్ జెట్‌లు బుధవారం తమ గగనతలంలోకి ప్రవేశించాయని స్వీడిష్ ఆర్మ్‌డ్ ఫోర్స్ తెలిపింది.

    స్వీడన్ నాటో కూటమిలో లేనప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో తమ గగనతలంలో రష్యా విమానాలు ప్రయాణించరాదంటూ సోమవారం నిషేధం విధించింది.

    అయితే, బుధవారం రష్యా విమానాలు బాల్టిక్ సముద్రంపై తమ గగనతలంలో కొద్దిసేపు తిరిగాయని స్వీడన్ పేర్కొంది.

    నిషేధం ఉన్నా రష్యా విమానాలు ఇలా రావడం సరికాదని, పూర్తిగా బాధ్యతారహితమైన చర్య అని స్వీడన్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

  12. బ్రేకింగ్ న్యూస్, వరుస పేలుళ్లతో దద్దరిల్లుతున్న కీయెవ్

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో గురువారం వేకువజామున వరుస పేలుళ్లు జరిగాయి.

    నగరం మధ్యలో రెండు తీవ్రమైన పేలుళ్లు చోటుచేసుకోగా ఓ మెట్రో స్టేషన్ వద్ద మరో రెండు పేలుళ్లు జరిగాయి.

    గగనతల దాడుల సైరన్‌లు వినిపిస్తున్నాయి.

    పేలుళ్లకు సంబంధించిన ఓ వీడియోను ‘ఓఎస్ఐఎన్ టెక్నికల్’ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ట్విటర్ హ్యాండిల్ యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తోంది.

    అయితే, ఈ వీడియోను కానీ, పేలుళ్ల సమాచారాన్ని కానీ బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. బుధవారం ఏం జరిగిందంటే

    ధ్వంసమైన భవనాలు

    ఫొటో సోర్స్, Reuters

    • రష్యా బలగాలు యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులను ముమ్మరం చేశాయి.
    • ఖెర్సాన్ పోర్టును స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించుకుంది. అయితే, పోర్ట్ ఇంకా తమ అధీనంలోనే ఉందని ఖెర్సాన్ నగర మేయర్ చెబుతున్నారు.
    • రష్యా సరిహద్దుల్లోని మరియుపూల్‌ పట్టణంలో భారీగా షెల్లింగ్ జరిగింది. ఆ పట్టణం దాదాపు ధ్వంసమైందని అక్కడి డిప్యూటీ మేయర్ చెప్పారు. అక్కడ ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉండొచ్చని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
    • ఖార్కియెవ్‌లో ఒక పోలీసు విభాగం భవనం, ఒక యూనివర్సిటీలోని కొంత భాగం రాకెట్ దాడికి దెబ్బతిన్నాయి.
    • గత రాత్రి రష్యా, ఖార్కియేవ్ నగరంలోకి పారాట్రూపర్లను దించిందని, నగరాన్ని ఆక్రమించుకోవడానికి దాడులు జరుపుతోందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.
    • రష్యా దాడులు మొదలైన దగ్గర నుంచి 2,000 మందికి పైగా యుక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
    • రష్యా, యుక్రెయిన్‌ల మధ్య తిరిగి శాంతి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ తెలిపింది.
  14. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    యుక్రెయిన్‌ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది.

    రాజధాని కీయెవ్ సహా పలు నగరాలు రష్యా అధీనంలోకి వెళ్లాయి.

    మిగతా నగరాలు, పట్టణాలపై పట్టు కోసం రష్యా సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు యుక్రెయిన్ సైనికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది.

    అక్కడ చిక్కుకున్న భారతీయులను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు.

    యుక్రెయిన్ నగరాలను వీడి పొరుగు దేశాలకు చేరుకోవాలని ఇప్పటికే భారత్ తన పౌరులకు అడ్వయిజరీ జారీ చేసింది.

    యుద్ధంలో రష్యా సైనికులు 6 వేల మందికిపైగా చనిపోయారని యుక్రెయిన్ చెబుతోంది. అలాగే, తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఆ దేశం ఆరోపిస్తోంది.

    రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ పేజీ చూస్తూఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.