ప్రపంచంలోనే అతి పెద్ద విమానం రష్యా చేతిలో ధ్వంసమైంది: యుక్రెయిన్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ‘ది ఆంటోనోవ్ ఏఎన్-225’ని రష్యా ధ్వంసం చేసిందని యుక్రెయిన్ రక్షణ మంత్రి దిమిత్రీ కులేబా చెప్పారు.
సోవియెట్ యూనియన్ పతనానికి ముందు ఈ భారీ విమానం తయారు చేశారు.
స్పేస్ షటిల్స్ రవాణాకు ఉద్దేశించి తయారుచేసిన ఈ విమానం ఇటీవల కాలంలో చాలా అరుదుగా గగనతలంలో ప్రయాణించింది.
కీయెవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ విమానాశ్రయంలో ఉన్న దీన్ని రష్యా సేనలు ధ్వంసం చేశాయని యుక్రెయిన్ చెప్పింది.
‘మ్రియ’(యుక్రెయిన్ భాషలో కల అని అర్థం) అనే పేరుగల ఈ విమానాన్ని రష్యా సేనలే ధ్వంసం చేశాయని... వారు దీన్ని నాశనం చేసినా స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య యూరప్ దేశంగా ఉండాలన్న తమ కలను మాత్రం నాశనం చేయలేరని కులేబా ట్వీట్ చేశారు.