COP26: ‘వాతావరణ మార్పులపై చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యత, చర్యలకు ఇవ్వట్లేదు’ - మోదీ

భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు వాతావరణ మార్పు అనేది చాలా పెద్ద సవాలుతో కూడిన అంశం అని కాప్‌26 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన ప్రసంగంలో భాగంగా ఆయన మూడు సూచనలు చేశారు.

లైవ్ కవరేజీ

  1. ‘వరదలు, వడగాడ్పులు, తుపాన్‌లకు ఇక అలవాటుపడాల్సిందే’

  2. కొడుకు కష్టం చూసి కాలుష్య నివారణ ఉద్యమం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

  3. హిమాలయ గ్రామాల్లో నీళ్లు దొరకట్లేదు ఎందుకు?

    హిమాలయాలు

    ఫొటో సోర్స్, UNIVERSITY OF ABERDEEN

    ఫొటో క్యాప్షన్, హిమాలయాలు

    హిమాలయాల్లో నీటి సమస్య పరిష్కారానికి ఒక కృత్రిమ గ్లేసియర్‌ డిజైన్‌ను అభివృద్ధి చేస్తున్నారు అబెర్డీన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.

    ఈ కృత్రిమ గ్లేసియర్లను 'ఐస్ స్తూపాలు' అని పిలుస్తున్నారు. నిజానికి 2013లోనే ఇంజినీర్ సోనం వాంగ్‌చుక్‌ దీన్ని కనిపెట్టారు. కానీ అదింకా ప్రారంభ దశలోనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

    వసంత కాలంలో కరిగిన నీటిని ఈ మంచు స్తూపాలు విడుదల చేస్తాయి.ఆ నీటితో స్థానికులు పంటలు పండించుకోవచ్చు.

    ఇలాంటి మంచు స్తూపాలను లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యంత పొడిబారిన (arid place) ప్రాంతాల్లో ఇది ఒకటి.

    ఈ వార్తను పూర్తిగా చదివేందుకు కింది లింక్‌పై క్లిక్ చేయండి.

  4. 70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు

    ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు.

    అందులో పండే పండ్లను, కాయలను ఆయన తీసుకోరు.

    పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు.

    ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనే ఉంది.

    ఆ పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణపై ప్రత్యేక కథనం..

    వీడియో క్యాప్షన్, 70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
  5. ‘వరదలు, వడగాడ్పులు, తుపాన్‌లకు ఇక అలవాటుపడాల్సిందే’

    LUIS SINCO

    ఫొటో సోర్స్, LUIS SINCO

    ఫొటో క్యాప్షన్, LUIS SINCO

    తీవ్ర వడగాడ్పులు, ముంచెత్తే వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక సర్వసాధారణం అయిపోతాయని హెచ్చరిస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ).

    "మన కళ్ల ముందే ప్రపంచం మారిపోతోంది" అంటూ 2021 వాతావరణ నివేదిక (స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్) ప్రముఖంగా పేర్కొంది.

    2002 నుంచి లెక్కిస్తే.. ఇరవై ఏళ్ల సగటు ఉష్ణోగ్రత తొలిసారిగా పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతల స్థాయిని దాటి 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండబోతోంది.

    2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది.

    ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఈ కింది లింక్‌పై క్లిక్‌చేయండి.

  6. పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాలనే అంకితం చేశారు

    వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై వనజీవి రామయ్య, దుశర్ల సత్యనారాయణలతో బీబీసీ మాట్లాడింది.

    రామయ్య ఇప్పటికే లక్షలాది చెట్లు నాటారు. సత్యనారాయణ తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చారు.

    వాతావరణ మార్పుల కట్టడికి గ్లాస్గోలో కాప్26 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో.. వీరిద్దరితో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ లైవ్..

  7. ఆల్ఫ్స్ పర్వతాల్లో మంచు వింతగా ఎరుపు రంగులో ఎందుకుంది

    ఆల్ఫ్స్

    ఫొటో సోర్స్, BOB GIBBONS/ALAMY

    ఫొటో క్యాప్షన్, ఆల్ఫ్స్

    మంచు ఎక్కడైనా తెల్లగా ఉంటుంది. కానీ ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాలలో మాత్రం మంచు ఎరుపు రంగులో కనిపిస్తోంది.

    వసంత రుతువు చివర్లో, వేసవి కాలం ప్రారంభంలో ఆల్ఫ్స్ పర్వతాల్లోని మంచులో కొన్ని విచిత్రమైన మార్పులను మనం చూడవచ్చు.

    ఈ మంచు తెలుపు రంగులో కాకుండా రక్తపు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటోంది.

    ప్రశాంతమైన పర్వత సానువుల్లో ఈ రకమైన మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    ఆల్ఫ్స్ పర్వతాల్లో రంగురంగుల మంచు ముక్కలు కనిపించడం అక్కడి వాతావరణ మార్పుల ప్రభావానికి సంకేతం కావచ్చు. దీనిపై పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  8. ఈ ద్వీపం మాల్దీవులకు ప్రత్యామ్నాయం అవుతుందా?

    మాల్దీవులు

    ఫొటో సోర్స్, HASSAN MOHAMED

    ఫొటో క్యాప్షన్, మాల్దీవులు

    మాల్దీవులు ఎదుర్కొన్నంతగా ఇంకే దేశమూ పర్యావరణ ముప్పును ఎదుర్కోలేదు.

    మాల్దీవుల్లోని విలాసవంతమైన బీచ్ రిసార్ట్స్ ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఉండొచ్చు..

    కానీ, ఆ దేశంలోని విసిరేసినట్లుగా ఉండే సుమారు 1,200 దీవుల్లో 80 శాతం కంటే ఎక్కువ సముద్ర మట్టానికి మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉంటూ మహాసముద్రం నుంచి ముంపు ముప్పు ఎదుర్కొంటున్నాయి.

    కానీ, మాల్దీవుల ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాలని నిశ్చయించుకున్నారు.

    మహాసముద్రం నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి కాపాడుకోవడానికి 'ది సిటీ ఆఫ్ హోప్' అనే ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నారు. హుల్హుమాలె అనే కృత్రిమ ద్వీపంలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఆ నగర విశేషాలు ఈ కింది కథనంలో చూడొచ్చు.

  9. ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు?

    ఈ ఊళ్లో ఇప్పటివరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసిపోయాయి.

    ఆ మధ్య విడుదలైన 'ఉప్పెన' సినిమాలో సముద్రపు ఒడ్డున ఓ గుడి కనిపిస్తుంది. కానీఇప్పుడా గుడి కూడా లేదు.

    తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రం ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రాణభయం నిత్యం వెంటాడుతోంది.

    అందమైన జాంధానీ చీరలకు, చేనేత వృత్తి నైపుణ్యానికి నిలయంగా ఉండే ఊరు ఉప్పాడ. కానీ సముద్రపు అలల తాకిడితో ఈగ్రామం అల్లాడిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాల్లో వందల ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అక్కడి పరిస్థితులపై బీబీసీ అందించిన కథనం ఇదీ

    వీడియో క్యాప్షన్, ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?
  10. ప్రపంచ దేశాలు కలిసి పనిచేయడం తప్పనిసరి – బోరిస్ జాన్సన్

    బోరిస్ జాన్సన్
    ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్

    వాతావరణ మార్పులపై పోరాటంలో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నొక్కిచెప్పారు.

    గ్లాస్గోలో కాప్26 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో బీబీసీతో ఆయన మాట్లాడారు.

    ‘‘వాతావరణ మార్పుల కట్టడి కోసం మనం ఆకాంక్షల నుంచి చర్యల వైపుగా అడుగులు వేయాలి.’’

    ఈ సదస్సు తనకు చాలా కీలకమని ఆయన వివరించారు. అయితే, సదస్సులో తీసుకోబోయే నిర్ణయాలపై ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉందని చెప్పారు.

    గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కట్టడిలో ప్రపంచ దేశాలు విఫలం అవుతున్నాయంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... గ్లాస్గోలో ఈ సదస్సు జరుగుతోంది.

    అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే నాలుగేళ్లపాటు ఏడాదికి ఒక బిలియన్ యూరోలు చొప్పున నిధులు అందిస్తామని తమ ప్రభుత్వం తరఫున జాన్సన్ హామీఇచ్చారు.

    మిగతా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇలానే తమ వంతు నిధులను అందించాలని ఆయన కోరారు.

  11. ఉప్పాడ తీరం కోతకు కారణం ఏమిటి

    సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు ఎంతలా మునిగిపోతున్నాయో చెప్పేందుకు ఉప్పాడ తీరం ప్రత్యక్ష నిదర్శనం.

    ఇక్కడ తీరం క్రమంగా కోతకు గురవుతోంది. దీనిపై పర్యావరణవేత్తలు, మత్స్యకారులు, స్థానిక ఎంపీ వంగా గీత బీబీసీతో మాట్లాడారు.

    ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇంకా ఏలాంటి చర్యలు అవసరం? లాంటి అంశాలపై వారు మాట్లాడారు.

    గ్లాస్గోలో కాప్26 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై బీబీసీ లైవ్ ఇదీ..

  12. వాతావరణ మార్పులతో ఈ దేశంలో సరస్సులన్నీ ఎండిపోయాయి..

    ప్రపంచంలోని నిరుపేద దేశాలలో పశ్చిమాఫ్రికాలోని మాలీ ఒకటి.

    ఈ దేశం పర్యావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొంటోంది.

    ఇక్కడి దారుణ పరిస్థితులు... పర్యావరణ సంక్షోభం కారణంగా మరింత తీవ్రమవుతున్నాయని రెడ్ క్రాస్ హెచ్చరించింది.

    దేశంలో ఉన్న సరస్సులన్నీ ఎండిపోయి ఇప్పుడు ఎడారులను తలపిస్తున్నాయి.

    బీబీసీ ప్రతినిధి క్రిస్టీన్ ఒటియానో అందిస్తున్న కథనమిదీ

    వీడియో క్యాప్షన్, వాతావరణ మార్పులతో ఈ దేశంలో సరస్సులన్నీ ఎండిపోయాయి..
  13. 'మా పొలాలను సున్నపు గనులు మింగేస్తున్నాయి.. మేము బతికేదెట్లా'

    మదురైలో వ్యవసాయాధారిత పరిశ్రమలను అభివృద్ధి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

    అయితే, మదురైకిదాదాపు 200 కిలో మీటర్ల దూరంలోఉన్న అరియలూర్‌లో బీబీసీ బృందం పర్యటించినప్పుడు అక్కడ భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.

    సున్నపురాయి గనులుపుష్కలంగా ఉన్న అరియలూర్‌జిల్లాలో గత ముప్పైఏళ్లలో అనేక సిమెంటు ఫ్యాక్టరీలు వెలిశాయి.

    దాంతో ఆ ప్రాంత రైతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.

    అక్కడి వాళ్లుఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

    వీడియో క్యాప్షన్, ఇళ్లూ పొలాలూ ఏవీ మిగలవేమోనని అరియలూర్ ప్రజల ఆవేదన
  14. కాప్26లో మోదీ ఏం మాట్లాడబోతున్నారు?

    మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మోదీ

    వాతావరణ మార్పుల సదస్సు కాప్-26లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం ప్రకటనలు చేస్తారా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    భారతదేశం తరఫున గ్లాస్గోలో ప్రతిపాదించాల్సిన అజెండాపై మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

    ఈ అంశంపై పర్యావరణవేత్త, ఐఫారెస్ట్ సీఈఓ చంద్రభూషణ్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) డైరెక్టర్ సునీతా నారాయణ్ బీబీసీతో మాట్లాడారు.

    వారితోపాటు భారత అజెండాపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకునేందుకు ఈ కింద కథనాన్ని చూడండి.

  15. గ్లాస్గోలో మోదీకి స్వాగతం

    మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, మోదీ

    రోమ్‌లో జీ20 సదస్సు అనంతరం, కాప్26 సదస్సు కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ నగరం గ్లాస్గో చేరుకున్నారు.

    సదస్సు అనంతరం, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

    గ్లాస్గో చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు.

    ‘‘కాప్26లో పాల్గొనేందుకు గ్లాస్గో చేరుకున్నాను. వాతావరణ మార్పుల కట్టడికి ప్రపంచ నాయకులతో కలిసి పనిచేస్తా. ఈ దిశగా భారత్ చేస్తున్న కృషి కూడా ప్రపంచ దేశాలకు తెలియజేస్తా’’అని మోదీ ఓ ట్వీట్ చేశారు.

    అక్టోబరు 31న మొదలైన ఈ సదస్సు నవంబరు 12 వరకు కొనసాగుతుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ఇదే చివరి, అత్యుత్తమ అవకాశం

    అలోక్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అలోక్ శర్మ

    ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు కట్టడి చేసేందుకు సమయం మించిపోతోందని కాప్-26 అధ్యక్షుడు అలోక్ శర్మ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. బ్రిటన్ నగరం గ్లాస్గోలో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు.

    ‘‘మన భూమి విధ్వంసం దిశగా దూసుకెళ్తోందని మనకు తెలుసు. మన అందరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి’’అని ఆయన అన్నారు.

    2020లో జరగాల్సిన ఈ సదస్సు కోవిడ్-19 వ్యాప్తి నడుమ వాయిదాపడి అక్టోబరు 31న మొదలైంది.

    ‘‘తక్షణమే అవసరమైన చర్యలను మనం ప్రారంభించాలి. ఇప్పుడే పనులు మొదలుపెట్టాలి. విజవంతమైనా లేదా విఫలమైనా.. మన పనులు మాత్రం ఆపకూడదు’’అని అలోక్ అన్నారు.

    ‘‘పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదల కట్టడికి ఇదే చివరి, అత్యుత్తమ అవకాశం. మనం ఆనాడు ప్రతిన చేశాం. నేడు ఆ ప్రతినకు కట్టుబడి చర్యలు తీసుకుందాం’’అని ఆయన పిలుపునిచ్చారు.

  17. కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యంగా..

    వాతావరణ మార్పుల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కాప్-26 సదస్సుకు బ్రిటన్ ఆతిథ్యం వహిస్తోంది.

    ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లాస్గో చేరుకున్నారు.

    ఉష్ణోగ్రతల పెరుగుదలను 2100నాటికి 1.5 డిగ్రీలకు కట్టడి చేయాలని పారిస్ ఒప్పందంలో నిర్దేశించారు.

    అయితే, ప్రపంచ దేశాలు 2.7 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుదల దిశగా ముందుకు వెళ్తున్నాయి.

    వాతావరణ విధ్వంసానికి ఇది దారితీయొచ్చని ఐరాస ఇప్పటికే హెచ్చరించింది. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేసేందుకే ఈ సదస్సు ‘‘చివరి, అత్యుత్తమ అవకాశం’’ అని కాప్-26 అధ్యక్షుడు అలోక్ శర్మ చెప్పారు.

    రెండు వారాలపాటు గ్లాస్గోలో జరగబోతున్న ఈ సదస్సుకు 25,000 మందికిపైగా ప్రపంచ ప్రముఖులు హాజరుకాబోతున్నారు.

    గ్లాస్గో సదస్సుకు ముందుగా ఇటలీలోని రోమ్‌లో జీ20 దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు.

    1.5 డిగ్రీల లక్ష్యాన్ని చేరుకునేందుకు ‘‘అర్థవంతమైన, సమర్థవంతమైన’’ చర్యలు అవసరమని వారు తీర్మానించారు.

    అయితే, కేవలం కొన్ని చర్యలకు మాత్రమే వారి మధ్య అంగీకారం కుదిరింది. కార్బన ఉద్గారాలను తగ్గించుకునే దిశగా మరింత కచ్చితమైన లక్ష్యాలతో ముందుకురావాలని ఇప్పటికే దాదాపు 200 దేశాలకు బ్రిటన్ సూచించింది.

  18. ‘బీబీసీ న్యూస్ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    నమస్తే! ‘బీబీసీ న్యూస్ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం. వాతావరణ మార్పులను అదుపు చేసే లక్ష్యంతో బ్రిటన్ వేదికగా జరుగుతున్న కాప్-26 సదస్సుకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.