అఫ్గానిస్తాన్: 'షరియా చట్టం ప్రకారమే మా పాలన ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు'
‘అఫ్గానిస్తాన్‌లో ఎలాంటి పాలన అందించాలనే విషయంలో మేం చర్చించుకోం. ఎందుకంటే షరియా చట్టం ప్రకారం పాలన సాగించాలనే విషయంలో మేమంతా స్పష్ఠంగా ఉన్నాం’ అని తాలిబాన్‌ల విధాన నిర్ణయాల గురించి సమాచారం పొందే స్థాయిలో ఉన్న నేత వహీదుల్లా హషీమీ రాయిటర్స్‌తో అన్నారు.
లైవ్ కవరేజీ
అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?
ఫొటో సోర్స్, EPA
కొన్నిరోజులుగా అఫ్గానిస్తాన్‌లో భారీగా నగరాలు, పట్టణాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నారు. వారు దేశ రాజధాని కాబూల్‌లోకి కూడా ప్రవేశించారు. ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
అఫ్గానిస్తాన్‌లో పరిణామాలను చుట్టుపక్కల ముస్లిం దేశాలతోపాటు ప్రపంచం మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ సంక్షోభంలో కొన్ని దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
నిస్సహాయ స్థితిలో ఉన్న వేలాది అఫ్గాన్ ప్రజలు విమానాశ్రయానికి చేరుకోవడంతో గందరగోళం ఏర్పడినట్లు అధికారులు చెప్పారు.
విమానాశ్రయం ప్రస్తుతం అమెరికా అధీనంలో ఉందని, వారు తమ పౌరులు, దౌత్య సిబ్బందిని తరలించడంపై దృష్టి పెట్టారని అధికారులు తెలిపారు.
కాబుల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు
అఫ్గానిస్తాన్ కాబుల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని వాణిజ్య విమానాలను నిలిపి వేశారు.
విమానాశ్రయంలో రద్దీని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
కాబూల్ విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో దిల్లీ నుంచి కాబుల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని తొలుత రీషెడ్యుల్ చేశారు.
కానీ, తర్వాత కాబుల్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఇక విమానాలు నడపలేమని ఎయిర్ ఇండియా సంస్థ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
కాబుల్ విమానాశ్రయంలో గాల్లోకి కాల్పులు జరిపిన అమెరికా సైన్యం
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, కాబుల్ విమానాశ్రయం
అఫ్గానిస్తాన్
కాబుల్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారనే
వార్తలు వస్తున్నాయి.
జనం విమానం ఎక్కకుండా ఆపడానికి అమెరికా సైనికులు కాబుల్
ఎయిర్‌పోర్టులో గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది అని ఒక అధికారి రాయిటర్స్‌కు
చెప్పారు.
"జనం అదుపు తప్పారు. ఈ ఫైరింగ్ జనాలను చెదరగొట్టడానికే
చేశారు" అని ఆయన చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్‌లో
కాల్పులు శబ్దం కూడా వినిపిస్తోంది.
ఎయిర్ పోర్టులో ఉన్న అమెరికా సైనిక దళాలు ఆర్మీ
విమానాల్లో తమ దౌత్య సిబ్బందిని దేశం నుంచి తరలించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు
చెబుతున్నారు.
తమ రాయబార కార్యాలయం మొత్తం సిబ్బందిని ఎయిర్ పోర్టుకు
తరలించినట్లు అమెరికా అంతకు ముందు చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు కాబుల్ ఎయిర్ పోర్టులో వాణిజ్య విమానాలను రద్దు చేసినట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి.
కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో జనం విమానాశ్రయంలో గుమిగూడవద్దని అపీల్ చేసినట్లు అఫ్గాన్ టీవీ చానల్ టోలో న్యూస్ చెప్పింది.
అఫ్గానిస్తాన్‌లో మహిళల స్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
తాలిబాన్లు, మిగతా మిలిటెంట్ గ్రూపులు సామాన్యుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ టోనియో గుటెరస్ కోరారు.
ముందు ముందు
అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల గురించి ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోందని యూఎన్ ప్రతినిధి
ఒకరు చెప్పారు. ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్తాన్‌లో శాంతి కోరుకుంటోందని తెలిపారు.
“అఫ్గానిస్తాన్‌లో ఘర్షణ, మానవ హక్కుల ఉల్లంఘన
వార్తలతో వేల మంది అక్కడ నుంచి పారిపోతున్నారు. దేశంలో ఏళ్ల తర్వాత మహిళలు,
బాలికలకు లభించిన మానవ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది” అని ఆంటోనియో
గుటెరస్ ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఫొటో సోర్స్, AFP
ఫొటో క్యాప్షన్, గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్
‘తాలిబాన్లకు అధికారం అప్పగించేందుకు కౌన్సిల్’
మరోవైపు, తాలిబాన్ల ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వడానికి మిగతా మిత్ర దేశాలు తొందరపడకూడదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు.
తాలిబాన్ల చేతికి అధికారం అప్పగించేందుకు ఒక కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ చెప్పారు.
అందులో తాలిబాన్లతోపాటూ తాలిబాన్ శాంతి చర్చల్లో పాల్గొన్న అబ్దుల్లా, 80వ దశకంలో ముజాహిదీన్లకు నేతృత్వం వహించిన గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ ఉన్నట్లు తెలిపారు.
ఒకప్పుడు గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్‌ను ‘బుచర్ ఆఫ్ కాబుల్’(కాబుల్ కసాయి) అని పిలిచేవారు. అఫ్గానిస్తాన్ చరిత్రలోని అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో ఆయన ఒకరు.
బస్సులో సీటు కోసం పోటీపడినట్లు...
కాబూల్ విమానాశ్రయంలో ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కడుతూ బీబీసీ దక్షిణాసియా బ్యూరో చీఫ్ నికోలా
కరీమ్ ట్వీట్ చేశారు.
"అఫ్గానిస్తాన్‌లో నేను చూసిన అత్యంత విషాధ దృశ్యాల్లో బహుశా ఇది ఒకటి. ఇక్కడ సహాయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వం ఏదీ లేదు" అని నికోలా అన్నారు.
నికోలా పోస్ట్ చేసిన వీడియోలో బస్సుల్లో సీటు కోసం జనం ఎలా ఒకరినొకరు తోసుకుంటారో, అలాగే ఒక విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొంతమంది ఎలాగైనా సీటు సంపాదించడానికి మెట్ల మీద నుంచి జారిపోతున్నా తమ ప్రయత్నం వదులుకోవడం లేదు.
తాలిబాన్లు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవడంతో విదేశీయులు, అఫ్గానిస్తాన్‌లోని కార్మికులు, ఇతరులు దేశం వదిలి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
తాలిబన్ల పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరు?
ఫొటో సోర్స్, SEFA KARACAN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్
తాలిబాన్లు దాదాపు మొత్తం అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఉపాధ్యక్షుడు అమీరుల్లా సాలేహ్ దేశం వదిలిపెట్టారు.
దాంతో, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, హీబాతుల్లా అఖండ్ జాదా.
అఫ్గానిస్తాన్ నుంచి
అమెరికా సైన్యాన్ని వేగంగా ఉపసంహరించినందుకు అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్విట్టర్ వేదికగా రిపబ్లికన్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
రిపబ్లికన్ పార్టీ
అధికారిక ఖాతా నుంచి మాత్రమే కాకుండా, అనేక మంది రిపబ్లికన్ సెనేటర్లు అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితులకు జో బైడెన్ నిర్ణయాలే
కారణమంటూ ట్వీట్లు చేశారు.
అఫ్గానిస్తాన్‌లో 'యుద్ధం ముగిసింది'- తాలిబాన్ ప్రతినిధి
ఫొటో సోర్స్, EPA
తాలిబన్ల ప్రతినిధి ఒకరు ఆదివారం వార్తా చానల్ అల్ జజీరాతో
మాట్లాడారు. అప్గానిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని చెప్పారు.
తమ సంస్థ అంతర్జాతీయ సమాజంతో శాంతిపూర్వక సంబంధాలు కోరుకుంటోందని,
ఏ అంశంపైఅయినా చర్చలు జరిపేందుకు తాము
సిద్ధంగా ఉన్నామని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి మొహమ్మద్
నయీమ్ చెప్పారని రాయిటర్స్ తెలిపింది.
అఫ్గానిస్తాన్ అధ్యక్ష భవనంలో తాలిబాన్ ఫైటర్లు ఉన్న ఒక
వీడియోను అల్ జజీరా ప్రసారం చేసింది.
ఫొటో సోర్స్, EPA
ఒంటరిగా జీవించాలని తాలిబాన్లు కోరుకోవడం లేదని మొహమ్మద్ నయీమ్ అన్నారు. అఫ్గానిస్తాన్‌లో ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటవుతుంది అనేదానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు.
షరియా చట్టం ప్రకారం మహిళలు, మైనారిటీల హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు.
‘అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసునంతవరకూ, తాలిబాన్లు ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకూడదు’ అనే విధానాన్ని తాము అనుసరిస్తామని మొహమ్మద్ నయీమ్ చెప్పారు.
"20 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మేం చేరుకోవాలనుకున్న ఈ స్థాయికి చేరుకున్నాం. మేం మా స్వేచ్ఛ, మా ప్రజల స్వేచ్ఛ కోరుకుంటున్నాం. వేరే ఎవరినీ లక్ష్యంగా చేసుకోడానికి మేం మా భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వం, ఎవరికీ హాని కలిగించం" అని ఆయన చెప్పారు.
విదేశీ దళాలు అఫ్గానిస్తాన్‌లో తమ విఫల అనుభవాలను పునరావృతం చేస్తాయని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు.
కాబూల్ విమానాశ్రయంలో గాల్లోకి కాల్పులు
కాబుల్ విమానాశ్రయంలో జన సమూహాన్ని అదుపులోకి తీసుకురావడనికి అమెరికా భద్రతాబలగాలు గాల్లోకి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షిని ఊటంకిస్తూ వార్తా సంస్థ ఏఫ్‌పీ పేర్కొంది.
లైవ్ పేజీకి స్వాగతం.., నమస్కారం, అఫ్గానిస్తాన్‌లో తాజా పరిణామాలపై లైవ్ పేజీకి స్వాగతం
అఫ్గానిస్తాన్‌లో ఇది ఒక సరికొత్త రోజు. కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు తాము విజయం సాధించామని ప్రకటించుకున్నారు.
గత కొన్ని గంటలుగా జరిగిన అసాధారణ ఘటనలు ఇవే:
అధ్యక్షుడు అష్రఫ్
ఘనీ ఉజ్బెకిస్తాన్ పారిపోయారనే రిపోర్టులతో అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం కుప్పకూలినట్లు
అయింది.
వేలాది అఫ్గాన్లు,
విదేశీయులు కాబుల్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాబుల్ విమానాశ్రయంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది.
అఫ్గానిస్తాన్లో భద్రత,
పౌరహక్కులను వెంటనే పునరుద్ధరించాలని దాదాపు 60కిపైగా దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారిని వదిలేయాలని తాలిబాన్లను కోరాయి.
అమెరికా తన రాయబార
కార్యాలయ సిబ్బందిని పూర్తిగా తరలించింది. దౌత్య కార్యాలయంపై ఉన్న తమ జాతీయ జెండాను తొలగించింది.
అఫ్గానిస్తాన్‌లో
మహిళల హక్కుల గురించి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాలిబాన్లు ఇప్పటికే
దేశంలోని కొన్ని ప్రాంతాలలో బలవంతంగా మార్పులు చేస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి.