కమలా హారిస్: 'మా ఊరి బిడ్డ అమెరికాలో చరిత్ర సృష్టించింది'

అధ్యక్షుడిగా జో బైడెన్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్న కమలా హారిస్ తల్లిగారి ఊరు తమిళనాడులోని ఓ చిన్న పల్లె. ఆమె గెలిచారని తెలియగానే ఆదివారం తెల్లవారుజామున ఆ ఊరిలో పండుగ వాతావరణం కనిపించింది. కమలాకు శుభాకాంక్షలు తెలిపే రంగవల్లులు, ఆలయాల్లో పూజలతో ఆ ఊరంతా సందడే సందడి.

లైవ్ కవరేజీ

నెవాడాలో కొనసాగుతున్న బైడెన్ ఆధిక్యం

నెవాడాలో బైడెన్ ఆధిక్యం

ఫొటో సోర్స్, Reuters

నెవాడాలో ఇప్పటికే 91 శాతం కౌంటింగ్ పూర్తయింది. ట్రంప్ కంటే బైడెన్ 22,657 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

చాలా గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు పడినప్పటికీ జనాభా ఎక్కువగా ఉన్న కౌంటీలలో బైడెన్‌‌కు ఓట్లు పడడంతో ఆయన అధిక్యం కొనసాగిస్తున్నారు.

లాస్ వెగాస్ నగరం ఉన్న క్లార్క్ కౌంటీలో బైడెన్‌క 2,520 ఓట్లు అదనంగా వచ్చాయి. నెవాడాలో ఆరు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి.

కాగా మొత్తంగా బైడెన్‌కు ప్రస్తుతం 253 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. మరో 17 సాధిస్తే అధ్యక్ష పదవి ఆయన పరమవుతుంది.