నెవాడాలో కొనసాగుతున్న బైడెన్ ఆధిక్యం
నెవాడాలో ఇప్పటికే 91 శాతం కౌంటింగ్ పూర్తయింది. ట్రంప్ కంటే బైడెన్ 22,657 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
చాలా గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు పడినప్పటికీ జనాభా ఎక్కువగా ఉన్న కౌంటీలలో బైడెన్‌కు ఓట్లు పడడంతో ఆయన అధిక్యం కొనసాగిస్తున్నారు.
లాస్ వెగాస్ నగరం ఉన్న క్లార్క్ కౌంటీలో బైడెన్‌క 2,520 ఓట్లు అదనంగా వచ్చాయి. నెవాడాలో ఆరు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి.
కాగా మొత్తంగా బైడెన్‌కు ప్రస్తుతం 253 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. మరో 17 సాధిస్తే అధ్యక్ష పదవి ఆయన పరమవుతుంది.