న్యూహాంప్‌షైర్ చట్టసభకు టీనేజర్ ఎన్నిక
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈశాన్య అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర చట్టసభకు ఒక టీనేజర్ ఎన్నికయ్యారు.
అమెరికాలో పిన్న వయసులో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో ఆయన ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ఆయన పేరు టోనీ లాబ్రాంచే. వయసు 18 ఏళ్లు.
ఆమ్‌హెర్ట్స్ ప్రతినిధిగా డెమొక్రటిక్ పార్టీ తరపున టోనీ ఎన్నికయ్యారు. న్యూహాంప్‌షైర్ రాష్ట్ర చరిత్రలో 'స్టేట్ రెప్రజెంటేవివ్'గా ఎన్నికైన తొలి స్వలింగ సంపర్కుడిని తానేనని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
తాను పదేళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడ్డానని, దేశంలో వైద్యం బాగా ఖరీదైనదైపోవడం తనను ఆలోచింపజేసిందని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఉద టెలిగ్రాఫ్’పత్రికతో టోనీ చెప్పారు.
తాను ఇంతకుముందు క్యాన్సర్‌ను జయించానని, ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించానని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.















