అమెరికా
ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీపైనే ప్రధానంగా ప్రపంచ దృష్టి
కేంద్రీకృతమైంది. అయితే.. అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) మీద
పట్టు కోసం కూడా ఈ ఎన్నికల్లో అంతే తీవ్రమైన పోరాటం జరుగుతోంది.
కాంగ్రెస్‌లోని
ఉభయ సభల్లో ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల పట్టు ఉంది. దీనిని నిలుపుకోవాలని వారు
ప్రయత్నిస్తున్నారు. అలాగే మరో సభ సెనేట్‌లో బలం పెంచుకోవాలని భావిస్తున్నారు.
సెనేట్‌లో
ప్రస్తుతం రిపబ్లికన్లకు మూడు సీట్ల ఆధిక్యం ఉంది. ఇప్పుడు 35 మంది సెనెటర్లు ఈ ఎన్నికల
బరిలో తలపడుతున్నారు. వారిలో చాలా మంది గెలుపోటముల మధ్య ఊగిసలాడుతున్నారు.
కాంగ్రెస్‌లోని
ఉభయ సభల్లోనూ డెమొక్రాట్లే బలంగా ఉన్నట్లయితే.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైతే ఆయన
ప్రణాళికలను అడ్డుకునే శక్తి ఉంటుంది. బైడెన్ అధ్యక్షుడైతే ఆయన అజెండాను
నిరాటంకంగా అమలు చేసే శక్తి కూడా వారికి ఉంటుంది.
సెనేట్ స్థానాలకు
పోటీ చేస్తున్న వారిలో వ్యోమగామి మార్క్ కెల్లీ, ఫుట్‌బాల్ కోచ్ టామీ టుబెర్‌విల్, ట్రక్ డ్రైవర్ కెల్లీ లోఫ్లెర్ కూడా ఉన్నారు.
కానీ, ఐదు సెనేట్ స్థానాల ఫలితాల కోసం అమెరికన్లు ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.
ఆరిజోనా: ప్రముఖ వ్యోమగామి
మార్క్ కెల్లీ, రిపబ్లికన్ మార్థా
మెక్‌సలీ 2018లో సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ 2018లో చనిపోవడంతో ఖాలీ యిన ఈ స్థానం కోసం
పోటీపడుతున్నారు.
సౌత్ కెరోలినా: రిపబ్లికన్
ప్రముఖ నేత, మొదట ట్రంప్ విమర్శకులుగా,
తర్వాత ఆయన బలమైన మద్దతుదారుల్లో
ఒకరుగా మారిన లిండ్సీ గ్రాహంకు, స్టేట్ డెమాక్రటిక్
పార్టీ అధ్యక్షుడు జామీ హారిసన్‌నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
మేన్: ఇక్కడి ప్రస్తుత
సెనేటర్, మితవాద రిపబ్లికన్
సెనేటర్లలో ఒకరినైన సుసాన్ కాలిన్స్ ను ఓడించడానికి ఓటర్లు సిద్ధమయ్యారు.
జార్జియా:ఇక్కడ
1992 నుంచి డెమాక్రాట్లు గెలవలేదు. నాలుగేళ్ల క్రితం అట్లాంటా శివార్లలో హిల్లరీ క్లింటన్
చాలా బాగా పని చేశారు. ఇప్పుడు స్టేట్‌లోని రెండు సెనేట్ స్థానాలను సొంతం చేసుకోవడానికి
సిద్ధమయ్యారు.
అలబామా: ఈ ఎన్నిక
డెమాక్రాట్ల పట్టున్న స్థానాన్ని ఒడిసిపట్టేందుకు రిపబ్లికన్ పార్టీకి అరుదైన అవకాశాన్ని
అందిస్తోంది. ఇక్కడి సెనేటర్ డెమాక్రాట్ డగ్ జోన్స్, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ కోచ్, ట్రంప్ మద్దతు ఉన్న రిపబ్లికన్ టామీ టుబెర్‌విల్
కంటే 10 శాతం పాయింట్లతో వెనకబడి ఉన్నారు.