బుద్ధపూర్ణిమ
సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు దుఃఖం, నైరాశ్యం ఎక్కువగా ఉంటుంది.
అప్పుడు బుద్ధుడి బోదనలు, మరింత సందర్భోచితం అవుతాయి. ఈ పరిస్థితుల్లో బుద్ధుడి బోధనలు మనోధైర్యం అందిస్తాయి.
ఇప్పుడు
మనం కఠిన పరిస్థితిని నుంచి బయటపడ్డానికి నిరంతరం కలిసి ప్రయత్నిస్తున్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు చూపించిన దయ, కరుణ, సుఖదుఃఖాల సమదృష్టి,
ఎవరు ఎలా ఉంటారో వారిని అలాగే స్వీకరించడం అనే నాలుగు సత్యాలు నిరంతరం భారత భూమికి
ప్రేరణగా నిలుస్తాయి.
భారత్
నిస్వార్థ భావనతో ఎలాంటి బేధభావాలు లేకుండా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో
నిలిచిన వారందరికీ పూర్తి అండగా నిలుస్తోంది.
ఈ
సంక్షోభ సమయంలో మీకు వీలైనంత సాయం చేయడానికి మీ చేయి అందించండి. అందుకే ప్రపంచంలో
ఎన్నో దేశాలు ఈ కష్ట సమయంలో భారత్‌ను గుర్తు చేసుకుంటున్నాయి. భారత్ కూడా అవసరమైన
ప్రతి ఒక్కరికీ తన సాయం అందించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.
దేశం
ఇప్పుడు ప్రతి భారతీయుడి జీవితం కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదే
సమయంలో తన అంతర్జాతీయ బాధ్యతను కూడా తీవ్రంగా పాటిస్తోంది.
బుద్ధుడి
ప్రతి బోధన, ప్రతి ఉపదేశం మానవ సేవ పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధతను బలోపేతం
చేస్తాయి. భారత బోధనలకు, భారత ఆత్మబోధనలకు బుద్ధుడు ప్రతీక.
ఇదే
ఆత్మబోధనతో భారత్ నిరంతరం మానవాళి కోసం, ప్రపంచహితం కోసం పనిచేస్తుంది,
పనిచేస్తూనే ఉంటుంది. భారత్ ప్రగతి ఎప్పుడూ విశ్వ ప్రగతికి అండగా నిలిచేలా ఉంటుంది.
నిరంతరం
మానవసేవ చేసేవారే బుద్ధుడి బాటలో నడిచే అసలైన అనుచరులు.
ఈ
కష్టకాలంలో మీరు, మీ కుటుంబం ఏ దేశంలో ఉన్నా సురక్షితంగా ఉండండి. వీలైనంత వరకూ
ఇతరులకు సేవ చేయండి. మీ ఆరోగ్యం కాపాడుకోండి.