కరోనావైరస్: 'భారత్‌లో గత 24 గంటల్లో 2,411 కోవిడ్ కేసులు... మొత్తం బాధితులు 37,776' -కేంద్ర ఆరోగ్య శాఖ
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 37,776కు చేరుకుంది. ఒక్క రోజులోనే 2,411 కొత్త కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. పదివేలకు పైగా కోవిడ్ బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 1,223 మంది చనిపోయారు.
లైవ్ కవరేజీ
ఆంధ్రప్రదేశ్‌లో 62 కొత్త కేసులు.. మొత్తం కేసుల సంఖ్య 1,525
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 62 కేసులు
నమోదయ్యాయని రాష్ట్ర నోడల్ అధికారి తాజా బులెటిన్‌లో తెలిపారు.
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,525కు
పెరిగింది. వీరిలో ఇప్పటివరకూ 441 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 33 మంది చనిపోయారు. గత
24 గంటల్లో ఎటువంటి మరణాలూ సంభవించలేదు. అయితే.. 38 మంది కోలుకున్నారు. ప్రస్తుతం
1,051 మంది చికిత్స పొందుతున్నారు.
రెడ్ జోన్లలో ఆంక్షలేమిటి? ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఏమిటి?
ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం, మే 4 నుంచి వచ్చే రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలను సడలించిన ప్రభుత్వం, దేశమంతటా అన్ని ఆస్పత్రిల్లోనూ ఓపీ సేవలకు అనుమతి ఉంటుందని తెలిపింది.
కొన్ని ఆంక్షలు జోన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయని పేర్కొంది. ఆ ఆంక్షలు ఏంటంటే...
ఎబోలా చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివీర్ ఔషధాన్ని కరోనావైరస్
అత్యవసర చికిత్సలో ఉపయోగించేందుకు అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)
అధికారికంగా ఆమోదించింది.
ఎఫ్‌డీఏ ఆమోదించడంతో ఈ ఔషధాన్ని కోవిడ్-19తో తీవ్రంగా
ప్రభావితమైన రోగులకు అందించే చికిత్సలో ఉపయోగించవచ్చు.
ఈ ఔషధం తీవ్రంగా బాధపడుతున్న రోగుల్లో కోలుకునే వ్యవధిని
తగ్గిస్తున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
ఎఫ్‌డీఏ అత్యవసర అనుమతి అంటే అర్థం ఈ మందును పూర్తి
స్థాయిలో వినియోగించేందుకు అనుమతి లభించడం కాదు. దీనికోసం ఉన్నత స్థాయి అనుమతులు,
సమీక్షలు అవసరం.
కరోనావైరస్‌పై పోరాటంలో ఇదేమీ ‘మ్యాజిక్ బుల్లెట్’ కాదని ఇప్పటికే నిపుణులు
హెచ్చరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 37,336కు చేరింది.
వీటిలో 26,167 యాక్టివ్ కేసులున్నాయి. 9,950 మంది వ్యాధి నుంచి కోలుకుని హాస్పటళ్ల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు 1,218 మంది మరణించారు.
గత 24 గంటల్లో 2293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71 మంది
మరణించారు.
ఒక్కరోజులో భారత్‌లో ఇన్ని కేసులు వెలుగుచూడడం ఇదే
తొలిసారి.
మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రణాళికలు సిద్ధం చేయండి: కేజ్రీవాల్
ఫొటో సోర్స్, ANI
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ ప్రభుత్వ
పరిధిలోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాబోయే విద్యా
సంవత్సరానికి ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆయన వీసీలకు సూచించారు.
“యూనివర్సిటీలన్నీ
టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తద్వారా విద్యా సంవత్సరానికి
కలిగిన నష్టాన్ని కొంతవరకూ పూరించే ప్రయత్నం చేయాలి. మహమ్మారిపై పోరాటంలో సామాజిక దూరం
పాటించడం చాలా ముఖ్యమైన అంశం. ఈ నిబంధనలన్నీ దృష్టిలో ఉంచుకుని తరగతుల నిర్వహణకు
ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి” అని
కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా
పాల్గొన్నారు. కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలు, ప్రస్తుత విద్యార్థుల ప్లేస్‌మెంట్లు,
దానిపై మహమ్మారి ప్రభావం వంటి అంశాలను వీరిద్దరూ వీసీలతో కలసి చర్చించారు.
వాయిదా పడిన పరీక్షల నిర్వహణ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు
వచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికై, పరీక్షలు వాయిదా పడిన విద్యార్థుల అంశం
కూడా వారు చర్చించారు.
“పరీక్షలు
రాసి, పాసై డిగ్రీ సర్టిఫికెట్ పొందకపోతే, అలాంటివారికి ఉద్యోగాల్లో చేరడానికి
ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి విద్యార్థులకు ప్రావిజనల్ డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చే
అంశాన్ని కూడా ఈ సమావేశం చర్చించింది” అని
ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
దిల్లీ ఆర్థిక పరిస్థితిని సాధారణ స్థితికి
తీసుకువచ్చేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా సిసోడియా ఆర్థిక శాస్త్ర
నిపుణులకు విజ్ఞప్తి చేశారు.
కరోనావైరస్ మహమ్మారి విషయంలో మేం సరిగ్గానే స్పందించాం: డబ్ల్యూహెచ్ఓ
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు డాక్టర్ టెడ్రాస్ అదనామ్ జెబ్రియాసుస్
కరోనావైరస్ మహమ్మారి విషయంలో చర్యలు తీసుకోవడంలో తాము
ఆలస్యం చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
మహమ్మారిని నియంత్రించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందనే
విమర్శలు రావడంతో ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.
జనవరి 30న అంతర్జాతీయంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని
ప్రకటించిందని, దీనిపై ప్రపంచ దేశాలన్నీ స్పందించి, తగిన చర్యలు తీసుకునేందుకు
తగిన సమయం ఇచ్చిందని డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు డాక్టర్ టెడ్రాస్ అదనామ్
జెబ్రియాసుస్ అన్నారు.
ఆ సమయానికి చైనా బయట కేవలం 82 కేసులు మాత్రమే నమోదయ్యాయని,
ఎవరూ చనిపోలేదని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33.5 లక్షల కేసులు
వెలుగుచూశాయి.2.38 లక్షల మంది మరణించారు.
డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్
ట్రంప్ ఇటీవల విమర్శించారు.
డబ్ల్యూహెచ్ఓకు వివిధ దేశాల నుంచి అందే నిధుల్లో అమెరికా నుంచే అధికభాగం
వస్తాయి. ఈ నిధులను నిలిపివేస్తామని కూడా ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలను జెబ్రియాసుస్ తోసిపుచ్చారు. ఆరోగ్య అత్యవసర స్థితిని
ప్రకటించడానికి ముందే డబ్ల్యూహెచ్ఓ అధికారుల బృందం చైనాలో పర్యటించి, వైరస్
గురించి సమాచారాన్ని సేకరించిందని ఆయన వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన
వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఇప్పటివరకూ 5 ప్రత్యేక రైళ్లను
ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.
వలసకూలీలు, విద్యార్థులు, ఇతర
ప్రజలను తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ రైళ్లను
నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు.
లింగంపల్లి నుంచి హాతియా, అలువా
నుంచి భువనేశ్వర్, నాశిక్ నుంచి భోపాల్, జైపూర్ నుంచి పట్నా, కోట నుంచి హాతియాలకు
ఈ రైళ్లు ప్రయాణమయ్యాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
గత 24 గంటల్లో అమెరికాలో 1883 మంది
కోవిడ్-19 కారణంగా మరణించారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 64,808కి
చేరింది. ఇప్పటివరకు 11,03,115 వైరస్ కేసులు నమోదయ్యాయి. 1.64 లక్షల మంది
కోలుకున్నారు.
కరోనావైరస్: బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం
జాతీయంగా, అంతర్జాతీయంగా కరోనావైరస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీ.
ఇప్పటివరకు ముఖ్యాంశాలు:
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు.
భారత్‌లో మే3తో ముగుస్తున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
భారత్‌లో 35,365 కేసులు నమోదుకాగా, 1152 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 1463కి చేరగా మృతుల సంఖ్య 33కి పెరిగింది.
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 1044 కాగా మృతుల సంఖ్య 28.
ప్రపంచవ్యాప్తంగా 33.4 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 2.38 లక్షల మంది మరణించగా, 10.5 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.