కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 29,20,660 కోవిడ్ కేసులు... 2,03,670 మంది మృతులు
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా రిసోర్స్ సెంటర్ తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 29,20,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 2,03,670 మంది కోవిడ్-19 రోగులు మృతిచెందారు.
లైవ్ కవరేజీ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా అప్‌డేట్స్, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం...
- ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 29,20,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 2,03,670 మంది కోవిడ్-19 రోగులు మృతిచెందారు.
- అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,41,628కి చేరింది, మృతుల సంఖ్య 54,024
- స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 22,3459కు పెరిగింది. దేశంలో మృతుల సంఖ్య 22902.
- ఇటలీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 1,95,351కు చేరింది. మొత్తం మృతులు సంఖ్య 26,384.
- ఫ్రాన్స్ లో కరోనా పాజిటివ్ కేసులు 1,61,665కు పెరిగాయి. మొత్తం 22,648 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,49,569కి చేరింది. 20,319 మంది మృతిచెందారు.
- పాకిస్తాన్‌లో ఇప్పటివరకూ 12,723 కరోనా కేసులు నమోదుకాగా, 269 కోవిడ్ రోగులు చనిపోయారు.
- భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,197కు చేరుకుంది. మొత్తం 826 మంది మృతిచెందారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1097కి చేరింది. ఇప్పటివరకూ 31 మంది చనిపోయారు.
- తెలంగాణలో మొత్తం కేసులు 1001కు చేరింది. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 25గా ఉంది.

మధ్యప్రదేశ్‌లో 100 దాటిన కరోనా మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, ep
మధ్యప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకూ ఇక్కడ 103 మంది చనిపోయారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2090కి చేరింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఆదివారం కొత్తగా మరో 144 కేసులు నమోదు కాగా, మరో నలుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు ఉజ్జయినిలో, ఖండ్వా, హోషంగాబాద్‌లో ఒక్కో వ్యక్తి ఉన్నారు.
ఇప్పటివరకూ అత్యధిక కరోనా మరణాలు ఇండోర్‌లో సంభవించాయి. రాష్ట్రంలో 302 మంది రోగులు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.
సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఫొటో సోర్స్, Getty Images
కరోనా నియంత్రణ చర్యలపై సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతారు.
కరోనా గురించి ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కావడం ఇది మూడోసారి.
లాక్‌డౌన్‌ను దశవారీగా ఎత్తివేసే అంశంపై ఈ సమావేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులు చర్చిస్తారని భావిస్తున్నారు.
ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ దేశం ఈ సమయంలో యుద్ధం చేస్తోందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమను తాము రక్షించుకోడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సోమవారం జరగబోయే సమావేశంలో రాబోవు రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరో మూడు-నాలుగు నెలలు కీలకం-ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, CMO MAHARSHTRA
మహారాష్ట్రలోని 80 శాతం కరోనా పాజిటివ్ కేసుల్లో రోగులకు ఎలాంటి లక్షణాలూ కనిపించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రిఉద్ధవ్ ఠాక్రే ఆదివారం చెప్పారు.
భారత్‌లో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7258కి చేరుకుంది. దేశంలోని 26 వేల కేసుల్లో ఇది నాలుగోవంతు కంటే ఎక్కువ.
“లాక్‌డౌన్‌పైఈ నెల చివర్లో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఏప్రిల్ 30 తర్వాత ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మేం కొన్ని ప్రారంభిస్తున్నాం. పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తాం” అన్నారు.
మహారాష్ట్ర డాక్టర్లకు క్లినిక్స్ తెరవడానికి అనుమతి ఇవ్వబోతున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. డయాలసిస్ సెంటర్లు కూడా తెరవనున్నారు. ప్రజలు సంయమనంతో ఉండాలని చెప్పిన ఉద్ధవ్ ప్రస్తుతానికి లాక్‌డౌన్ తప్ప తమకు వేరే దారి లేదని చెప్పారు.
“కరోనా వైరస్ వెంటనే మాయం అయిపోదు. మీరు మాస్క్ ధరించాలి. జనంలోకి వెళ్లకుండా ఉండాలి. ఇళ్లలో ఉండాలి.లక్షణాలు కనిపిస్తే చికిత్స తీసుకోవాలి. రాబోవు మూడు నాలుగు నెలలు చాలా కీలకం” అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
కరోనా అలర్ట్- తమిళనాడు పోలీసుల గోడ

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దీంతో చిత్తూరు జిల్లాలోంచి వాహనాలు, ప్రజలు లోపలికి రాకుండా అంతర్ రాష్ట్ర సరిహద్దు దగ్గర తమిళనాడు పోలీసులు ఏకంగా ఒక గోడ కట్టేశారు.
తమిళనాడు పోలీసులు ఈ గోడను వెల్లూరు జిల్లా గుడిపాల దగ్గర కట్టారు.
తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ఈరోజు కొత్తగా 11 కేసులు నమోదవడంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1001కి చేరింది.
తెలంగాణలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 660కి పెరిగింది.
ఈరోజు కరోనా వల్ల మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 25.
కరోనా పాజిటివ్ రోగి, మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిని ఈరోజు డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఈయనతో కలిపి ఇప్పటివరకూ 316 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకూ గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 371 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 18 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, ts i&pr
గత వందేళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదు-టీటీడీ చైర్మన్
గత వందేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
కరోనా లాక్‌డౌన్ వల్ల శ్రీవారి దర్శనాలు ఆపివేసి ఇప్పటికి 45 రోజులు అయ్యిందన్నారు.
ప్రతి నెలా వచ్చే హుండీ ఆదాయం, సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, గదుల అద్దెలు అన్నిటి నుంచి వచ్చే ఆదాయం సుమారు రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు ఉంటుందని. ప్రస్తుత పరిస్థితులతో టీటీడీ ఆ ఆదాయం కోల్పోయిందని అన్నారు.
రాబోయే కాలంలో ఆ లోటు ఎలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు.
రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగులు, పాలక మండలి సభ్యులు సహకరిస్తారని ఆశించారు.
పాలకమండలి సభ్యులు, చైర్మన్‌గా తాను కూడా వేతనాలు తీసుకోవడం లేదని ఆయన గుర్తుచేశారు.
మహారాష్ట్రలో ఈరోజు 440 కొత్త కేసులు, 19 మంది మృతులు
ఈరోజు 440 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 19 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు చెప్పింది.
కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8068కి చేరింది, మృతుల సంఖ్య 342కు పెరిగింది.
ఈరోజు మహారాష్ట్రలోని ఆస్పత్రుల నుంచి 112 మంది రోగులు కూడా డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకూ మొత్తం 1188 మంది కోలుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ చెప్పింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుజరాత్‌లో కొత్తగా 230 పాజిటివ్ కేసులు, 18 మంది మృతులు
గత 24 గంటల్లో గుజరాత్‌లో 230 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 18 మృతులు నమోదయ్యాయని ఏఎన్ఐ చెప్పింది.
వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3301కి చేరుకుంది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 155 మంది చనిపోయారని గుజరాత్ ఆరోగ్య శాఖ ఏఎన్ఐకు చెప్పింది.
ఇప్పటివరకూ 313 మంది కోవిడ్ రోగులు డిశ్చార్జ్ అయ్యారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రపంచ దేశాలు దేనికి భయపడుతున్నాయి?, డేవిడ్ షుక్‌మెన్, బీబీసీ సైన్స్ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలూ ఒక విషయంలో చాలా ఆందోళనగా ఉన్నాయి.
అదే కరోనా సంక్రమణ రేటు లేదా రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దీనినే R అంటారు
గత నెల బ్రిటన్‌లో ఒక వ్యక్తి శరీరంలోకి వైరస్ చేరగానే, అది సగటున మరో ముగ్గురికి వ్యాపించింది.
లాక్‌డౌన్, మిగతా పద్ధతుల వల్ల ఆ రేటు ఇప్పుడు తగ్గి 0.7కు చేరిందని అంచనా వేస్తున్నారు.
అది 1.0 అంటే ఒకరి కంటే తక్కువ ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే దానికి ఏమాత్రం ఎక్కువైనా, ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మందికి వైరస్ వచ్చేలా చేస్తాడు. తర్వాత ఆ సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతుంది.
ఒక అంచనా ప్రకారం ఏదైనా ఒక వేడుకలో ఈ రేటు 0.6 నుంచి పెరగవచ్చని లండన్ ఇంపీరియల్ కాలేజ్ భావిస్తోంది. అంటే ఈ రేటు పెరిగి 1.0కు పైకి చేరుకోగలదు.
స్కూళ్లు తెరిస్తే ఈ వ్యాప్తి రేటు 0.2 పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ దీనిపై చాలా అనిశ్చితి ఉంది.
పిల్లల వల్ల వేరు వేరు ఇళ్లలో వైరస్ వ్యాపిస్తుందా, లేదా అనేది ఇప్పటివరకూ ఎవరికీ అంతుపట్టలేదు.
నెల తర్వాత స్పెయిన్‌కు శుభవార్త

ఫొటో సోర్స్, Reuters
స్పెయిన్‌లో గత 24 గంటల్లో 288 మంది చనిపోయారు.
మార్చి 20 తర్వాత కరోనాతో ఒకే రోజు ఇంత తక్కువ మృతులు నమోదవడం ఇదే మొదటిసారి. శనివారం స్పెయిన్‌లో 378 మంది మృతిచెందారు.
స్పెయిన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,190కి చేరింది.
ఆరు వారాల తర్వాత ఆదివారం మొదటిసారి స్పెయిన్‌లో 14 ఏళ్ల కంటే చిన్న పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించారు.
సోమవారం నుంచి తిరిగి విధుల్లోకి వెళ్లనున్న బోరిస్ జాన్సన్
సోమవారం నుంచి తిరిగి విధుల్లోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, AFP
కరోనా వల్ల మూడు వారాలు విధులకు దూరంగా ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు తిరిగి తన విధులు చూసుకోడానికి ఉత్సాహంగా ఉన్నారు.
బోరిస్ జాన్సన్ సోమవారం లండన్‌లోని తన నివాసం 10,డౌనింగ్ స్ట్రీట్ నుంచి పనులు ప్రారంభించనున్నారు.
"ఆయన తిరిగి రావడం వల్ల దేశంలో ఉత్సాహం వస్తుంది" అని బోరిస్ జాన్సన్ గైర్హాజరీలో ఆయన బాధ్యతలు చూసుకున్న విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ బీబీసీకి చెప్పారు.
కరోనా పాజిటివ్ రావడంతో బ్రిటన్ ప్రధానిని ఏప్రిల్ 5న ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన ఒక వారం పాటు ఉన్నారు. ఐదు రోజులు ఆయన ఐసీయూలో ఉండాల్సి వచ్చింది.
ఏప్రిల్ 12న డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన లందన్ బయట బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం లండన్ బయట బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం చెకర్స్ లో విశ్రాంతి తీసుకున్నారు.
రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, ఉపరాష్ట్రపతి స్పందన
రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలుగు విద్యార్థుల కష్టాలపై పత్రికల్లో వార్తలు రావడంతో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పందించారు.
పత్రికల్లో వచ్చిన కథనాలను లోక్‌సభ స్పీకర్, కోట ఎంపీ ఓం బిర్లాకు పంపించారు.
కరోనా వల్ల అక్కడ ఉన్న హాస్టళ్లు ఖాళీ అవడంతో విద్యార్థులకు భోజన వసతి లేకుండా పోయిందని, కోటలో కరోనా కేసులు కూడా పెరుగుతుండడంతో తెలుగు విద్యార్థులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని వెంకయ్య సూచించారు.
దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. కోచింగ్ కోసం కోట వచ్చిన తెలుగు విద్యార్థుల తక్షణం భోజనం, వైద్య సంబంధిత ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. తన కార్యాలయ సిబ్బంది ఫోన్ నెంబర్లను అందజేసిన స్పీకర్.. విద్యార్థులతో మాట్లాడారు. వారికి తగిన సహాయం అందజేయాలని తమ సిబ్బందిని ఆదేశించారు.
విజయవాడలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
విజయవాడలో శనివారం రాత్రి 7.30 వరకూ 50 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య పెరగడంతో వైద్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
మాచవరంలోకోవిడ్-19 కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. కార్మికనగర్‌లో కేసులు విస్తరించగా, గూడవల్లిలో కూడా కరోన కేసులు నమోదయ్యాయి. కృష్ణలంకలో కూడా కొత్తగా మరో 4 కేసులు బయటపడ్డాయి.
వీటితోపాటు మధురానగర్‌లో 4, కేదారేశ్వరపేటలో 2, విద్యాదరపురంలో ఒక కేసు నమోదయ్యాయి.
రామవరప్పాడు, చోడవరం,సుమేధ భవన్‌లో కూడా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
సుమేధ క్యాంపస్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుచేసి, కృష్ణలంక నుంచి 300 మందిని తరలించారు. కృష్ణలంకలో పాజిటివ్ కేసులు భారీగా ఉండచ్చని భావిస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒక లారీ డ్రైవర్ ఉండడంతో కాంటాక్ట్ కేసులు పెరుగుతాయని అనుకుంటున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఆయన కృష్ణలంక వెనుకభాగంలో ఉన్న అన్ని ఇళ్లకూ వెళ్లేవాడని చెబుతున్నారు.
విజయవాడ రాజీవ్ గాంధీ హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో భారీగా పాజిటివ్ కేసులు రావడంతో, అక్కడి హమాలీలు అందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
మార్కెట్ నుంచి నగరంలో చాలా ప్రాంతాలకు కూరగాయలు పంపిణీ అయ్యాయి. వీటిని తీసుకున్నవారిలో జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు.
భారత్‌లో 826కు చేరిన కరోనా మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,917కు చేరుకుంది.
ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 20177 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కోవిడ్-19 వల్ల 826 మంది చనిపోయారు.
చికిత్స చేయించుకుని నెగటివ్ వచ్చిన 5914 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో 1975 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. కొత్తగా 47 మంది చనిపోయారు.
కరోనావైరస్ వల్ల లక్ష్యాన్ని అందుకున్న చైనా

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌తో ప్రపంచంలో ఎక్కువ దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అందుకే చాలా దేశాల్లో కాలుష్య స్థాయి అంతకు ముందుతో పోలిస్తే చాలా తగ్గింది. తరచూ దుమ్ము, ధూళితో నిండి ఉండే చైనాలోని ఉత్తర హుబే ప్రాంతంలో గాలి కూడా పూర్తిగా శుభ్రమైంది.
ఆ ప్రాంతంలో గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టిన అధికారులు కరోనా లాక్‌డౌన్ వల్ల తాము అనుకున్న లక్ష్యాన్ని కూడా అందుకున్నారు.
అయితే కరోనా లాక్‌డౌన్ లేకుండా అది సాధ్యమయ్యేది కాదని స్థానిక అధికారులు అంటున్నారు. ప్రాంతీయ పర్యావరణ బ్యూరో అధికారి హీ లితాయో అక్టోబర్-మార్చి మధ్యలోగాలిలో ఉండే PM2.5 సగటు సాంధ్రతలో 15 శాతం తగ్గుదల కనిపించిందని చెప్పారు. దానితోపాటూ సల్ఫర్ డయాక్సైడ్ సాంద్రత కూడా మూడొంతులు తగ్గిందన్నారు.
గత ఏడాది చివర్లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి బయటపడింది. ఆ తర్వాత అప్రమత్తమైన చైనా అక్కడ లాక్‌డౌన్ ప్రకటించింది. దానివల్ల రోడ్లపై వాహనాలు, పరిశ్రమలు కూడా మూతపడ్డాయి.
చైనాలో కాలుష్య తగ్గడానికి ఇదే కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికీ లక్షల మంది ఇళ్లలోనే ఉంటున్నారు. 2020లో మొదటి మూడు నెలల గణాంకాల్లో 300కు పైగా చైనా పట్టణాల్లో ఊపిరితిత్తులకు హాని కలిగించే PM2.5 అణువులు సాంద్రత దాదాపు 15 శాతం తగ్గిందని చెబుతున్నారు.
పెన్షనర్లకు ఏప్రిల్ నెలకు పూర్తి వేతనం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కరోనా వైరస్ వల్లదేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏప్రిల్ నెలకు గాను వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని, మిగతా ఉద్యోగులకు మార్చిలో ఇచ్చినట్లే సగం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏప్రిల్ నెల వేతనాల కోత నుంచి పించనుదారులను మినహాయించిన ప్రభుత్వం ఈసారీ వారికి ఉపశమనం అందించింది.
గత నెల వారికి 50 శాతం వేతనాలే రాగా, ఈసారీ వారికి పూర్తి వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది.
సచివాలయ ఉద్యోగులకు కూడా పూర్తి వేతనం చెల్లిస్తున్నట్లు ఏపీ సీఎస్ జీవోలో తెలిపారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో క్యూబాకు ప్రశంసలు

ఫొటో సోర్స్, Getty Images
క్యూబా శనివారం దక్షిణాఫ్రికాలో 216 వైద్య సిబ్బందిని పంపించింది. కరోనావైరస్ మహమ్మారితో పోరాటంలో సాయం చేయడానికి క్యూబా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 20 వైద్య బృందాలను పంపించింది. కొంతమంది దీనిని సోషలిస్టు యూనిటీగా చెబుతుంటే, మరికొందరు దీనిని మెడికల్ డిప్లొమసీ పేరు ఇస్తున్నారు.
లెఫ్ట్ పాలన ఉన్న క్యూబాలో ఇటీవల ఆఫ్రికా, కరిబియన్ దేశాలకు సుమారు 1200 మంది వైద్య సిబ్బందిని పంపించింది. క్యూబా యూరప్ సంపన్న దేశాలకు కూడా తమ వైద్య సిబ్బందిని పంపించింది. అమెరికా డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబా వైద్య సిబ్బంది సాయం తీసుకోవద్దని ప్రపంచ దేశాలను కోరింది.
అయితే క్యూబా తమ వైద్య సిబ్బందిని పంపిన దేశాల్లో వారికి స్వాగతం లభిస్తోంది. క్యూబాలో మొత్తం 1337 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ 51 మంది చనిపోయారు. క్యూబాలో తలసరి డాక్టర్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది. మహమ్మారిని ఎదుర్కోవడంలో క్యూబాలో హెల్త్ కేర్ సిస్టమ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జ్వెలీ మఖీజ్ “క్యూబాలో మంచి విషయం ఏంటంటే ఇక్కడ సామాజిక ఆరోగ్య సేవలు ఉన్నాయి. మేం ఈ మోడల్‌ను ఇష్టపడతాం. దక్షిణాఫ్రికాలోకరోనా వైరస్ వ్యాపించి 4361 కేసులు వచ్చాయి. 86 మంది చనిపోయారు. దక్షిణాఫ్రికాకు క్యూబాతో ప్రత్యేక బంధం ఉంది. క్యూబా సైనికులు దక్షిణ అంగోలా యుద్ధంలో పోరాడారు. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదల కావడానికి సాయం చేశారు. నెల్సన్ మండేలా విడుదలైన తర్వాత ఫిదెల్ కాస్ట్రోకు ధన్యవాదాలు కూడా చెప్పారు” అన్నారు.
వుహాన్‌లో కరోనా రోగులందరూ డిశ్చార్జ్

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో కరోనావైరస్ బయటపడిన వుహాన్ నగరంలో ఆస్పత్రుల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఏవీ లేవని అధికారులు చెబుతున్నారు.
నేషనల్ హెల్త్ కమిషన్ అధికారి మీ ఫెంగ్ "విషమ పరిస్థితుల్లో ఉన్న చివరి రోగికి కూడా శుక్రవారం కోలుకున్నాడు" అని చెప్పారు.
వుహాన్ సిటీలో ప్రస్తుతం కొత్త కేసులేవీ లేవని వారు చెప్పారు.
డిసెంబర్‌లో కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి చైనాలో మొత్తం 82816 కేసులు నమోదయ్యాయి. 4632 మంది చనిపోయారు.
వుహాన్‌లో 46,452 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా మొత్తం కేసుల్లో ఇవి 56 శాతం
