కరోనావైరస్: ఈరోజు ముఖ్యాంశాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు 28,40,830కి పెరిగాయి. మృతుల సంఖ్య 1,99,271కి చేరింది.
* అమెరికాలో 9,07,096మందికి వైరస్ సోకగా 52,546 మంది.. ఇటలీలో 1,92,994 మందికి వైరస్ సోకగా 25,969 మంది మరణించారు. స్పెయిన్‌లో 22,902 మందికి వైరస్ సోకగా 22,902 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో 1,59,952 మంది వైరస్ బారిన పడగా 22,245 మంది చనిపోయారు. యూకేలో 1,49,554 మందికి వైరస్ సోకగా 20,319 మంది ప్రాణాలు కోల్పోయారు.
* భారత్‌లో 24,942 పాజిటివ్ కేసులు నమోదు కాగా 779 మంది మరణించారు.
* తెలంగాణలో 990 పాజిటివ్ కేసులు.. 25 మరణాలు నమోదయ్యాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో 1016 పాజిటివ్ కేసులు.. 31 మరణాలు నమోదయ్యాయి.