కిడ్డీ బ్యాంక్ మనీతో యూకేకు 20వేల మాస్క్ లు పంపిన చిన్నారులు
వియత్నాంకు చెందిన ఇద్దరు చిన్నారులు 20 వేల మెడికల్ మాస్క్ లను యునైటెడ్ కింగ్ డమ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.
నాన్, ఖోయి అనే ఈ ఇద్దరు చిన్నారులు కొద్ది సంవత్సరాలుగా తాము దాచుకున్న డబ్బుతో ఈ మాస్కులు కొన్నారు.
వియత్నాంలో ఉన్న బ్రిటీష్ రాయబారి గరెత్ వార్డ్ ...ఈ చిన్నారులకు కృతజ్జతలు చెబుతూ లేఖ రాశారు.
లాక్‌డౌన్ కారణంగా వియత్నాంలో చిక్కుకుపోయిన వందమందిని గతవారం ఇంగ్లాండ్ పంపారు. ఆ విమానంలోనే ఈ మాస్క్ లను చేరవేశామని రాయబారి గరెత్ వార్డ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది







