బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్
ఏప్రిల్ 24 వరకు లైవ్ అప్‌డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
కరోనావైరస్‌పై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు బీబీసీ తెలుగు ప్రతిరోజూ LIVE అప్‌డేట్స్ పేజీని అందిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 27 లక్షలకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. 1.93 లక్షల మంది మరణించారు. అమెరికాలో కోవిడ్ బాధితుల సంఖ్య 8.7 లక్షలు దాటింది. 50 వేల మంది మరణించారు. భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 23,000 దాటింది.
ఏప్రిల్ 24 వరకు లైవ్ అప్‌డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
కరోనావైరస్‌పై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు బీబీసీ తెలుగు ప్రతిరోజూ LIVE అప్‌డేట్స్ పేజీని అందిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 2 లక్షలకు చేరువవుతోంది.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి ప్రపంచవ్యాప్తంగా 1,93,041 మంది కరోనావైరస్ బారినపడి మరణించారు.
మొత్తం 27,45,677 మంది ఈ వైరస్ బారినపడ్డారు.
* భారత్‌లో మొత్తం 23,452మందికి ఇప్పటివరకు వైరస్ సోకగా అందులో 723 మంది మరణించారు.
* తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కి చేరగా వారిలో 25 మంది చనిపోయారు.
* ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955 కాగా ఇప్పటివరకు 29 మంది మరణించారు.
* శనివారం కర్ణాటకలో తొలి ప్లాస్మా థెరపీ క్లినకల్ ట్రయల్‌కు ఐసీఎంఆర్ అనుమతించింది.
* తెలంగాణలోనూ ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించింది.
* దేశంలోనే కరోనా టెస్టుల నిర్వహణలో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందు నిలిచిందని.. ప్రతి 10 లక్షల మందిలో 1,018 మందిని పరీక్షిస్తున్నామని.. ఇది దేశంలోనే మిగతా అన్ని రాష్ట్రాల సగటు కంటే అధికమని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్ శనివారం జరగనుంది.
పరిస్థితి విషమంగా ఉన్న రోగి కోసం ప్లాస్మా దాత శనివారం వస్తుండడంతో ఈ థెరపీ చేపడుతున్నట్లు కర్ణాటక వైద్య విద్య, కోవిడ్-19 మంత్రి డాక్టర్ కె.సుధాకర్ చెప్పారు.
కోవిడ్ చికిత్సలందిస్తున్న విక్టోరియా ఆసుపత్రిలో.. ప్రయివేట్ ఆసుపత్రి హెచ్‌సీజీ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ విశాల్ రావు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతించింది.
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరో 62 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 955కి చేరిందని.. కొత్తగా 7 మండలాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 54,341 కరోనా టెస్టులు చేసినట్లు జవహర్ రెడ్డి చెప్పారు.
దేశంలో సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 391 టెస్టులు చేస్తుండగా ఏపీలో ఆ సగటు 1,018గా ఉందన్నారు.
దేశంలోని ఇంకే రాష్ట్రానికి ఇంత సగటు లేదని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన 955 పాజిటివ్ కేసుల్లో 642 నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయన్నారు.
కర్నూలు జిల్లాలో 281, గుంటూరు జిల్లాలో 206, కృష్ణాజిల్లాలో 102, చిత్తూరు జిల్లాలో 73 కేసులున్నాయన్నారు.
శుక్రవారం వచ్చిన 62 కేసుల్లో 46 పాత క్లస్టర్లలోనే వచ్చాయని చెప్పారు.
ఇప్పటివరకు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని వరుసగా రెండుసార్లు నెగటివ్ రిజల్ట్ వచ్చిన సుమారు 100 మందిని డిశ్చార్జి చేస్తున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, IandPR andhrapradesh

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతోంది.
కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది.
ఆ దేశంలో మొత్తం 8,70,468 కేసులు నమోదయ్యాయి. 50,031 మంది మరణించారు.
ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 16వేలకు పైగా ప్రజలు ప్రాణాలు విడిచారు.
80 వేల మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది.
ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో కూడా మరణాల సంఖ్య 20 వేలు దాటింది.
తెలంగాణలో శుక్రవారం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు లేవు. 29 మంది డిశ్చార్జయ్యారు.
ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జి అయిన వారు 291 మంది కాగా ప్రస్తుతం 663 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
రాష్ట్రంలో ఇంతవరకు 25మంది మరణించారని, మొత్తం కేసులు 983కి చేరాయని చెప్పారు.
తెలంగాణలో ప్లాస్మా థెరపీ చేేసేందుకు అనుమతి వచ్చిందన్నారు. పరిస్థితి విషమించిన వారికే ఈ థెరపీ చేస్తారని చెప్పారు. రోగులకు ఇచ్చే ఆహారం బాగానే ఉందని, గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తమిళనాడులోని తిరుపూర్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘించిన కొందరికి అక్కడి పోలీసులు బుద్ధి చెప్పడానికి ఎంచుకున్నపద్ధతికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తాసంస్థ పోస్ట్ చేసింది.
అంబులెన్సులో ఒక నకిలీ కోవిడ్-19 రోగిని ఉంచి అందులోకి ఈ లాక్‌డౌన్ ఉల్లంఘునులను ఎక్కించి భయపెట్టి, బుద్ధి చెబుతున్నారని పేర్కొంది.
దేశంలో గత 24 గంటల్లో 1752 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని, 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,452కి మృతుల సంఖ్య 723కి పెరిగింది. 4,813 మందికి నయం కావడంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,915గా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఉపాధి కోల్పోవడం వల్ల పేదరికాన్ని ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవటానికి భారత ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే విషయంలో మరింత ఉదారంగా ఉండాలని.. సంక్షేమ ప్రయోజనాలను విస్తరించటం కోసం నిధులు సమకూర్చేందుకు నగదు ముద్రించడానికి భారతదేశం భయపడాల్సిన అవసరం లేదని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ‘ అన్నారు.
"మార్కెట్లు మూతబడినప్పుడు ప్రజలకు డబ్బు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్న వస్తుందని నాకు తెలుసు. కానీ, ముందుగా.. డబ్బులు రాబోతున్నాయని ప్రజలకు చెప్పటం ద్వారా డిమాండ్ పెరిగే పరిస్థితికి సంసిద్ధం చేయవచ్చు. ప్రజలకు భరోసా అవసరం. ఆ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం చురుకుగా స్పందించాలి" అని ఆయన పేర్కొన్నారు.
లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగే వేగం తగ్గిందని.. ఎన్నో ప్రాణాలను కాపాడడం సాధ్యమైనట్లు తమ విశ్లేషణలో తేలిందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు.
సకాలంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారని.. ఒకవేళ లాక్‌డౌన్ ఆలస్యమయ్యుంటే ఇప్పటికి దేశంలో 73,000 కరోనా పాజిటివ్ కేసులు ఉండేవని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
కరోనాకు విరుగుడుగా క్రిమి సంహారకాలను శరీరంలోకి ఇంజెక్టు చేసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సూచనలపై ప్రపంచంలోనే అతి పెద్ద క్రిమి సంహాకర మందుల తయారీ సంస్థ స్పందించింది.
ఆయన సూచనలు పాటించడం ప్రమాదకరమని తేల్చింది. డెట్టాల్, లైజాల్ లాంటి క్రిమి సంహాకర ద్రావణాలను తయారు చేసే ఆర్‌బీ సంస్థ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
‘‘ప్రపంచంలో క్రిమి సంహారక మందులను తయారు చేసే అతి పెద్ద కంపెనీగా మేం చెబుతున్నదేంటంటే...మేం తయారు చేసే ఈ ద్రావణాన్ని, రసాయనాన్ని ఇంజెక్టు చేయడం, మరే మార్గం ద్వారానైన శరీరంలోకి పంపుకోవడం ప్రమాదకరం’’ అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ క్రిమి సంహారక ద్రావణాలను, రసాయనాలకు సూచించిన నిబంధనలు, నియమాల ప్రకారమే వాడాలని కూడ ఆ ప్రకటనలో సంస్థ పేర్కొంది.
కరోనా సంక్షోభంతో కుదుపునకు లోనయిన దేశీయ మార్కెట్లు ఈ వారం కూడా నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఈ రోజు 535.86 పాయింట్లు నష్టపోయి 31,327.22 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 159.50 పాయింట్లు నష్టపోయి 9,154.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.45గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా కట్టడిలో భాగంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న స్ప్రింక్లర్ సంస్థకు అందించిన క్వారంటీన్‌లో ఉన్నవారి హెల్త్ డాటా మొత్తాన్నీ అనామకంగా(బాధితుల పేర్లు లేకుండా) మార్చాలని.. ఆ తరువాతే స్ప్రింక్లర్ సంస్థ డాటాను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించాలని కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1684 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.
దీంతో దేశంలో కొవిడ్ -19 కేసుల సంఖ్య 23,077 చేరుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు.
ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి రికవరీ రేటు 20.57శాతం ఉందని అగర్వాల్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కరోనా వైరస్ ను పారదోలడానికి శరీరంలోకి క్రిమి సంహారక మందులు, అల్ట్రావయెలెట్ కిరణాలు పంపుకుంటే మంచిదంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సలహాలను వైద్య నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఇలాంటి సూచనలు తప్పుదోవ పట్టించేవిగా కనిపిస్తున్నాయి.
వీటి గురించి వైద్యనిపుణులు ఇంత వరకు ఎప్పుడూ చెప్పలేదు.
ఉపరితలం మీదున్న కరోనా వైరస్ ను క్రిమి సంహారకాలు చంపేయగలవు.
మనం నిత్యం స్పృశించే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఒక మంచి పద్దతి. ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండే లిక్విడ్ లు, శానిటైజర్ లను క్రిములను దూరం చేయడానికి వాడుకోవచ్చు.
సామాన్యంగా ఉపరితలాలపై ఉండే కొన్ని వైరస్ లు నేరుగా పడే సూర్యకిరణాల ప్రభావానికి చనిపోతాయి.
కాని వాటిపై అల్ట్రా వయెలెట్ కిరణాలు ఎంతసేపుపడితే అవి చనిపోతాయన్నది ఎవరికీ తెలియదు. దానికన్నా మన చేతులను, మనం నిత్యం తాకే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఉత్తమమైన పని.
ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయమేంటే...ఇదంతా కేవలం వైరస్ బయట ఉన్నప్పుడే. ఒక్కసారి అది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేనిది. దగ్గులు, తుమ్ములు సమయంలో వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుంచి వెలువడే తుంపరల నుంచి ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిని చేరుతుంది.
ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక..వేగంగా పెరిగిపోతూ, వ్యాపిస్తూ చివరకు ఊపిరితిత్తులను చేరుతుంది. క్రిమి నిరోధక మందులను ఇంజెక్టు చేసుకోవడం వల్ల, అది వైరస్ ను చేరుతుందో లేదో తెలియదుగానీ...ప్రాణాలు పోయే ప్రమాదం మాత్రం కచ్చితంగా ఉంటుంది.
ఇక ఒక్కసారి మీ వైరస్ లోపలికి ప్రవేశించాక...శరీరం మీద ఎన్ని అల్ట్రా వయెలెట్ కిరణాలు ప్రసరించినా...పెద్దగా తేడా ఉండదు.
అంతేకాదు. అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల మీ చర్మం పాడైపోవచ్చు. మొత్తంగా ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల....వైరస్ కన్నా దాని చికిత్సా విధానాలే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుత సమయంలో ఎవరూ మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేయొద్దని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు సూచించారు.
సాయంత్రం 7 గంటల నుంచి కర్ఫ్యూ మొదలవతుంది కాబట్టి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని.. అందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ జూలో ఒక ఆడ పులి చనిపోయింది.
చనిపోయిన పులి శాంపిళ్లను కరోనా పరీక్షల కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కరోనా సంక్షోభం పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును నిలిపివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.
బుల్లెట్ రైలు, కేంద్రీయ విస్టా సుందకరీకరణలాంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నిలిపివేయకుండా కరోనా నిర్మూలనలో రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు డీఏ పెంచకపోవడం దారుణమైన నిర్ణయమని రాహుల్ ట్విటర్‌లో విమర్శలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తమిళనాడులోని చెన్నై, మదురై, కోయంబత్తూరులలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.
సేలం, తిరుప్పూర్‌లలో ఏప్రిల్ 26 నుంచి 28 వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆరోగ్యవంతులైన వ్యక్తులు కరోనా నుంచి రక్షణ పొందడానికి మాస్కులు ధరించాలా వద్దా అనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కొన్ని దేశాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయగా...మరికొన్ని దేశాలు వాడాల్సిందిగా ప్రజలకు సూచించాయి.
అయితే యూకేలో మాత్రం మాస్కుల వాడకం అంశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు.
మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన అధికారిక సూచన ఏంటి ?
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది.
మాస్కులనేవి కేవలం ఆరోగ్య విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అవసరమని, సాధారణ వ్యక్తులకు అవసరం లేదని ఈ సమావేశంలో తేల్చారు.