కరోనావైరస్ LIVE అప్‌డేట్స్
బీబీసీ తెలుగు ప్రతిరోజూ కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీని నిర్వహిస్తోంది.
ఏప్రిల్ 21 లైవ్ అప్‌డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. ఇప్పటివరకు 1,71,810 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985, మృతుల సంఖ్య 603కు చేరింది.
బీబీసీ తెలుగు ప్రతిరోజూ కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీని నిర్వహిస్తోంది.
ఏప్రిల్ 21 లైవ్ అప్‌డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.
ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడి 1,71,810 మంది ప్రణాలు కోల్పోయారు. 6,59,732 మంది పూర్తిగా కోలుకున్నారు.
మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.
దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5218కి చేరింది. మృతుల సంఖ్య 251కి పెరిగింది.
ఇవాళ ఒక్క రోజే 150 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 722కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో 24 గంటల్లో 828 మంది కోవిడ్-19తో చనిపోయారు. దాంతో, మొత్తం మృతుల సంఖ్య 17,337కు చేరింది.
గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,301 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
దాంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 29 వేలు దాటింది.
తెలంగాణలో మంగళవారం కొత్తగా 56 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కు చేరింది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 23 మంది మృతిచెందారు. ఇవాళ మరణాలు నమోదు కాలేదు.
ఈ రోజు ఆస్పత్రుల నుంచి 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో, ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 194కు చేరింది.
ప్రస్తుతం 711 మంది చికిత్స పొందుతున్నారు.
ఇవాళ సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, TS GOVT
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సేకరించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 24,94,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,71,152 మరణించారు.


ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం కొరత ఎదుర్కుంటున్న వారి సంఖ్య రెంట్టింపు కావచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం హెచ్చరించింది.
2019లో 13.5 కోట్ల మంది తిండి లేక అలమటించగా, 2020లో ఆ సంఖ్య 13 కోట్లకు పైగా పెరిగి 26.5కుచేరుకోవచ్చని చెప్పింది. కోవిడ్-19వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రభావమే దీనికి ప్రధాన కారణం అని చెప్పింది.
ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం, దాని సహచరులు ప్రపంచ ఆహార సంక్షోభంపై ఒక కొత్త నివేదిక ఇవ్వడంతో ఈ హెచ్చరిక జారీ చేశారు.
ఆహార సంక్షోభంపై విడుదల చేసిన నాలుగో వార్షిక నివేదికలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించానికి ముందు ఆహారం కొరత తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు.
గత 24 గంటల్లో ఇంగ్లండ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 778 మంది కరోన పాజిటివ్ రోగులు మృతిచెందినట్లు ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.
వీటితో కలిపి దేశంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 15,607కి చేరింది.
పాకిస్తాన్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 9500 దాటింది.
కోవిడ్-19 వల్ల 197 మంది చనిపోగా, ఇప్పటివరకూ 2101 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19 వేలకు చేరువలో ఉంది.
దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985కు చేరింది. మృతుల సంఖ్య 603కు చేరింది.
ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుల సంఖ్య 3,259కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్-19 యాక్టివ్ కేసులు 15,122 ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో మరో రెండు రోజుల వరకూ ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు చేయరని ఐసీఎంఆర్, ఆరోగ్య శాఖ సంయుక్త సమావేశంలో చెప్పారు.
"వివిధ రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్ట్కిట్లతో చేస్తున్న పరీక్షల్లో ఫలితాలు రకరకాలుగా వస్తున్నాయి. అలా రాకూడదు. అందుకే ఐసీఎంఆర్ తమ బృందాలను అక్కడకు పంపిస్తోంది. రెండు రోజులు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఉపయోగించకుండా ఉండాలని కూడా రాష్ట్రాలకు సూచించాం" అని ఐసీఎంఆర్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ చెప్పారు.
పూర్తిగా పరిశోధనల తర్వాత ఐసీఎంఆర్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ మార్గదర్శకాలు జారీ చేస్తుందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ వల్ల లాటిన్ అమెరికా దేశాల్లో పరిస్థితి:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్‌కతాలోని రాజాబజార్‌లో పర్యటించారని ఏఎన్ఐ చెప్పింది.
వాహనంలోనే ఉండి, అందరూ ఇళ్లలోనే ఉండాలని, కరోనావైరస్‌తో చేస్తున్న పోరాటంలో సహకరించాలని ప్రజలను కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ నుంచి ఒడిషాకు ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక విమానంలో మొత్తం 459 ప్యాకెట్ల పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు), శానిటైజర్లు పంపించారని ఏఎన్ఐ చెప్పింది.
ఇవి భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కోవిడ్-19పై దృష్టిపెట్టిన కేంద్రం, హెచ్ఐవీ, డయాలసిస్, క్యాన్సర్ లాంటి మిగతా అత్యవసర సేవలు కూడా అందించాలని అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ఏఎన్ఐ చెప్పింది.
అదే సమయంలో వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పామని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ ఆగర్వాల్ చెప్పారని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోడానికి అమలు చేస్తున్న ఆంక్షలను, లాక్‌డౌన్‌ను మెల్లమెల్లగా తొలగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
చాలా దేశాలు తమ దగ్గర లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తేయాలని ఆలోచిస్తున్న సమయంలో డబ్ల్యుహెచ్ఓ ఈ హెచ్చరికలు చేసింది.
మంగళవారం హడావుడిగా సరైన సమయానికి ముందే లాక్‌డౌన్ తొలగిస్తే అది కరోనా మరింత వ్యాపించడానికి కారణం కావచ్చని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.
"కనీసం ఎదైనా చికిత్స వెతికే వరకూ దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యం కాదు. లాక్‌డౌన్ మనకు 'న్యూ నార్మల్' కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి" డబ్ల్యుహెచ్ఓ రీజనల్ డైరెక్టర్(వెస్ట్రన్-పసిఫిక్) తాకేషీ కసాయీ అన్నారు.
ఏయే ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తేయాలని అనుకుంటున్నాయో, అవి దానిని మెల్లమెల్లగా చేయాలి. పరిస్థితిపై నిరంతరం నిఘా పెట్టాలి అని సూచించారు..

ఫొటో సోర్స్, Getty Images
కరోనా సంక్షోభ సమయంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ క్యాబినెట్ విస్తరించారు.
మంగళవారం మధ్యాహ్నం భోపాల్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, AFP
ఇండోనేషియాలో కరోనావైరస్ వ్యాప్తి అడ్డుకోడానికి దేశ అధ్యక్షుడు జోకో విడోడో రంజాన్ నెలలో ప్రజల రాకపోకలు నిషేధించారు.
అయితే ప్రభుత్వం చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు.
ఇండోనేసియాలో దాదాపు 10 లక్షల మంది రంజాన్ సమయంలో నగరాల నుంచి తమ గ్రామాలకు వెళ్తుంటారు. దీనిపై ఇప్పుడు నిషేధం విధించారు.
ఇండోనేషియా అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం. ఇక్కడ రంజాన్ నెలలో ప్రత్యేక సామూహిక కార్యక్రమాలు జరుగుతాయి. వాటిపై కూడా ప్రభుత్వం నిషేధించింది.
దిల్లీ-గాజియాబాద్ సరిహద్దుల్లో వాహనాలు క్యూ కట్టాయి. ఈ సరిహద్దులను పూర్తిగా సీల్ చేశారు. కేవలం అవసరమైన సేవలు అందించేవారు, చట్టబద్ధమైన పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఆమె తన పుత్తూరు నియోజకవర్గంలోని సుందరయ్య కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికిబోరు వేయించారు. సోమవారం దానిని ప్రారంభించిన సమయంలో ఎమ్మెల్యేను ఘనంగా పూలతో స్వాగతం పలికారు.
లాక్‌డౌన్ సమయంలో ఎమ్మెల్యే రోజాకు ఇలా పూలతోస్వాగతం పలకడాన్ని కొందరు తప్పుబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిని విమర్శించారు.
అయితే, ఎమ్మెల్యే మీద అభిమానంతో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంపై విమర్శలు తగదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని అంటున్నారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC