భారత్ లాక్‌డౌన్‌లో ఈరోజు నుంచి సడలింపులు ఇవే
భారతదేశంలో ఈరోజు నుంచి లాక్‌డౌన్లో కొన్ని సడలింపుల అమలవుతాయి. అయితే, ఈ సడలింపులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తించవు. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశాయి.
ఈ రోజు నుంచి తెరుచుకునే రంగాలు:
- వ్యవసాయం, హార్టికల్చర్ కార్యకలాపాలకు అనుమతి.
- అన్ని రకాల ఆరోగ్య సేవలు. ఆయుష్ సేవలు.
- ఉపాధి హామీ పనులు. శ్రామికులు భౌతిక దూరం పాటించాలి.
- వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, వాటి సరఫరా.
- ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల కర్మాగారాలు.
- టీ, కాఫీ, రబ్బరు తోటలు గరిష్టంగా 50% ఉద్యోగులతో పనిచేయడానికి అనుమతి.
- చమురు, గ్యాస్ రంగానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి.
- పోస్టల్ సేవలు. పోస్టాఫీసులు తెరచి ఉంటాయి.
- అత్యవసర సేవల కొనసాగింపు.
- నిర్మాణ పనులకు అనుమతి.
- హైవే ధాబాలు, ట్రక్కుల రిపేర్ షాపులు, ప్రభుత్వ సేవలతో అనుసంధానమైన కాల్ సెంటర్లు.
- ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్ చేసేవారు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, వడ్రంగి పనివారు వంటి స్వయం ఉపాధితో జీవిస్తున్న వారికి అనుమతి.
- గోశాలలు, ఇతర జంతు శాలలు తెరుచుకుంటాయి.
- అయితే, ఈ సడలింపులేవీ హాట్ స్పాట్ జోన్లలో వర్తించవు.
- గ్రామీణ ప్రాంతాలలోని పరిశ్రమలకు అనుమతి. భౌతిక దూరం తప్పనిసరి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయి.
- నిత్యావసరాలు, పళ్ళు - కూరగాయలు, ఔషధాలు, పాలు, మాంసం, చేపలు, రేషన్ షాపులు తెరుచుకుంటాయి.
- బ్యాంకులు, ఏటీఎంలు తెరిచి ఉంటాయి.
- స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయి.
లాక్‌డౌన్ కొనసాగే చోట్లు ఇవే:
- మే 3 వరకు రైలు, మెట్రో, రోడ్డు, విమానయానాలు ఉండవు.
- షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, బార్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు.
- పాఠశాలలు, కళాశాలలు.
- దేవాలయాలు, మసీదులు, గురువద్వారా, చర్చిలు, ఇతర మతపమైన ప్రదేశాలు. మతపరమైన కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు.
- పెళ్ళిళ్ళు, బహిరంగ కార్యక్రమాలు, సామాజిక వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సభలు, సెమినార్లు, క్రీడాకార్యక్రమాలపై కూడా నిషేధం కొనసాగింపు.
- అంత్యక్రియలకు 20 మందికి మించకూడదు.