అదే నిజమైతే తీవ్ర పరిణామాలు: చైనాకు ట్రంప్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చైనాను మరోసారి హెచ్చరించారు. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచమంతటికీ విస్తరించడానికి వాళ్లదే బాధ్యత అని తెలిస్తే అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోకక తప్పదన్నారు.
శనివారం శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వైరస్ విషయంలో బీజింగ్ సరిగ్గా వ్యవహరింలేదని మరో సారి ఆరోపించారు. చైనా నిర్లక్ష్యం వల్ల యావత్ ప్రపంచం బాధపడుతోందని అన్నారు.
వైరస్ వూహాన్లో పుట్టినందున ఈ పరిణామాలకు చైనాయే బాధ్యత వహించాలా అన్న ప్రశ్నకు ఆయన "ఒక వాళ్లు కావాలనే ఏదైనా చేస్తే అందుకు కచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సిందే."అని సమాధానం ఇచ్చారు.
వైరస్‌ను వ్యాప్తి కాకుండా అడ్డుకోవడంలో విఫలం కావడానికి, ఉద్ధేశపూర్వకంగా చెయ్యడానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ప్రస్తుతానికి మొత్తం పరిణామాలపై వాళ్లు విచారణ జరుపుతున్నారని, ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే అమెరికా తరపు నుంచి కూడా విచారణ జరుపుతామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


