కరోనావైరస్: భారత్‌లో 14,792కి చేరిన కోవిడ్-19 కేసులు; 488 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా 22,40,191 మంది కరోనావైరస్ బారినపడ్డారు. 1,53,822 మంది ప్రాణాలు విడిచారు. 5,68,343 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య 7 లక్షలకు సమీపంలో ఉంది. ఇప్పటివరకు 36,773 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వుహాన్‌లో ఒక్కసారిగా మరణాల సంఖ్యలో 50శాతం పెరుగుదల నమోదైంది. దేశం మొత్తంలో 4,636 మంది చనిపోయారు.

లైవ్ కవరేజీ

  1. కోవిడ్-19 మరణాలను 50 శాతం పెంచిన వుహాన్

    కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్యను అధికారికంగా 50 శాతం (1,290 మంది) పెంచింది చైనాలోని వుహాన్ నగరం. గతేడాది ఈ నగరంలోనే కరోనావైరస్ పుట్టి, ప్రపంచం మొత్తం వ్యాపించింది.

    తాజా లెక్కలతో నగరంలో కోవిడ్-19 మృతుల సంఖ్య 3,869కి చేరింది. చైనాలో మృతుల సంఖ్య 4,600లకు పెరిగింది.

    కొత్తగా నమోదైన మరణాలన్నీ ఆస్పత్రులకు వెలుపల సంభవించినవేనని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో దాచిపెడుతున్నది ఏమీ లేదని చైనా ప్రభుత్వం అంటోంది.

    కరోనావైరస్ విషయంలో చైనా సరైన సమాచారాన్ని పంచుకోవడం లేదని, వాస్తవాలను తొక్కిపెడుతోందనే విమర్శలు ఉన్నాయి.

    వుహాన్ జనాభా 1.1 కోట్లు. కొన్ని నెలల పాటు ఈ నగరాన్ని నిర్బంధించారు. ఈ మధ్యనే లాక్ డౌన్ సడలించారు.

    వుహాన్

    ఫొటో సోర్స్, Getty Images

  2. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం.

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన సమాచారం..

    ప్రపంచవ్యాప్తంగా 2,240,191 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,53,822 మంది మరణించారు.(18.04.2020 ఉదయం 6.30 గంటల వరకు వివరాలు)

    * భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,352కి చేరింది. ఇందులో మృతులు 486, కోలుకున్నవారు 1766.

    * ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 14 మంది మరణించారు.

    * తెలంగాణలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 766 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు.