కరోనావైరస్: తెలంగాణలో 700 కోవిడ్ కేసులు; వాటిలో 645 మర్కజ్‌ వెళ్ళివచ్చిన వారు, వాళ్ళ కాంటాక్ట్‌లేనన్న ఈటల రాజేందర్

గురువారం కొత్తగా నమోదైన 50 కేసులతో కలిపి తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య 7 వందలకు చేరింది. ఇప్పటివరకు 186 మంది కోలుకున్నారు. మర్కజ్ వెళ్ళివచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరిన ఆరోగ్య శాఖ మంత్రి.

లైవ్ కవరేజీ

  1. అమెరికాలో ఒక్కరోజే దాదాపు 2600 మంది మృతి, ఇప్పటివరకూ ఇదే ఒక్కరోజులో అత్యధిక మరణాల సంఖ్య

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అమెరికాలో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో మరణాల సంఖ్య అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఉంది.

    గత 24 గంటల్లో అమెరికాలో దాదాపు 2600 మంది చనిపోయారని, ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించిందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

    మొత్తంగా అమెరికాలో ఇప్పటివరకూ 28,364 మంది చనిపోయారు.

    మొత్తం కేసుల సంఖ్య 6.37 లక్షలు దాటింది.

  2. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం.

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన సమాచారం..

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మృతుల సంఖ్య లక్షా 34వేలు దాటింది. 5 లక్షలకు పైగా రోగులు కోవిడ్-19 బారినుంచి కోలుకున్నారు.

    అమెరికాలో ఇప్పటివరకూ 6.37 లక్షల మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 28,300 మంది మృతి చెందారు. 52వేల మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    ఇటలీ, స్పెయిన్‌లలో కూడా వ్యాధి విజృంభిస్తోంది. ఇటలీలో 21వేలమంది చనిపోగా, స్పెయిన్‌లో 18వేలమంది మరణించారు.

    భారత్‌లో కేసుల సంఖ్య 12వేలకు దగ్గరలో ఉంది. ఇప్పటివరకూ 382మంది మరణించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 525 కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం 491 యాక్టివ్ కేసులున్నాయి.

    తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 644కు చేరింది. ఏపీలో కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. దాంతో, రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 525కు పెరిగింది.