కరోనావైరస్: తెలంగాణలో 52 కొత్త కేసులతో కలిపి 644కు చేరిన కోవిడ్ బాధితులు, ఏపీలో 483

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరువలో కరోనావైరస్ కేసులు, 1.21,897 మంది మృతి. అమెరికాలో 5.83 లక్షల కరోనా బాధితులు, 23,709 మృతులు. కోవిడ్ బాధితుల సంఖ్య 10 వేలు దాటిన భారత్‌లో ఇప్పటివరకు 353 మంది చనిపోయారు.

లైవ్ కవరేజీ

కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం.

కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన తాజా వార్తా విశేషాలు...

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 19.18 లక్షల మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 1.19 లక్షల మంది మృతి చెందారు. 4.4 లక్షల మంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. 23,529 మంది మరణించారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌లో కేసుల సంఖ్య 9,352కు చేరింది 324 మంది మరణించారు.