You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 4 వేలు దాటిన కోవిడ్ బాధితులు, 24 గంటల్లోనే 693 కొత్త కేసులు... 109 మృతులు

భారతదేశంలో 4 వేలు కరోనావైరస్ బాధితులు. 109 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సోకిన వారిలో 1,445 మంది దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నవారితో సంబంధం ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ఇంట్లో చేసిన మాస్క్ సురక్షితమేనా?

    ఫేస్ మాస్కులు, గ్లోవ్స్, ఇతర రక్షణ దుస్తులు అత్యవసర విధుల్లో ఉన్నవారికి కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి సహాయపడతాయి.

    ఇప్పుడు, కొందరు ఇళ్లలోనే మాస్కులు తయారు చేసుకుంటున్నారు. వాటిని బయట ఉపయోగించుకోవచ్చని అమెరికన్లకు సలహాలు కూడా ఇస్తున్నారు. కానీ అవి సురక్షితమేనా?

    అందరూ మాస్కులు ఎందుకు వేసుకోరు?

    ప్రస్తుతం రెండు రకాల ప్రజలు మాత్రమే ప్రొటెక్టివ్ మాస్క్ వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

    • వ్యాధికి గురైనవారు, ఆ లక్షణాలు కనిపిస్తున్నవారు.
    • కరోనావైరస్ అనుమానితులను సురక్షితంగా చూసుకునేవారు.

    అన్నింటికన్నా అత్యుత్తమ మాస్క్ ఏదంటే... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  2. అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్... ఎలా వచ్చిందంటే...

    అమెరికాలో ఓ పులికి కరోనావైరస్ సోకింది. న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ జూలో ఉంటున్న నాలుగేళ్ల మలయన్ జాతి ఆడపులికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో పాజిటివ్ వచ్చిందని నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ ల్యాబొరేటరీ వెల్లడించింది.

    ఈ పులి పేరు నదియా.

    నదియా తోబుట్టువు అజుల్‌తో పాటు మరో రెండు అమూర్ పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలు పొడి దగ్గు సమస్యతో ఉన్నాయని, ఇవన్నీ పూర్తిగా కోలుకుంటాయని భావిస్తున్నామని తెలిపింది.

    పులికి కరోనావైరస్ ఎలా సోకిందంటే... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  3. మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు.. ఇంటిముందు పెద్దసంఖ్యలో జనం

    మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఓ ఎమ్మెల్యే పుట్టినరోజున ఆయన ఇంటి ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటం వివాదాస్పదంగా మారింది.

    ఆర్వి నియోజకవర్గం ఎమ్మెల్యే (బీజేపీ) దాదారావు కెచె పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వార్దాలోని ఆయన ఇంటి ముందు పెద్ద సంఖ్యలో జనం చేరారు. ఆయన నిత్యావసరాలు పంపిణీ చేస్తారనే సమాచారంతో వీరంతా అక్కడకు చేరారని చెబుతున్నారు.

    కానీ, కరోనావైరస్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.

    “నా పుట్టినరోజున ఎవరూ నా ఇంటికి రావద్దని నాలుగు రోజుల క్రితమే అందరికీ విజ్ఞప్తి చేశాను. అయినా కొందరు కార్యకర్తలు వచ్చారు. నా ఇంటిదగ్గర నిత్యావసరాలు పంపిణీ జరుగుతోందని నా ప్రత్యర్థులు కుట్రపూరిత సమాచారం ప్రచారం చేశారు. దీంతో వారంతా నా ఇంటిముందు పోగయ్యారు. నా ప్రతిష్టను భంగపరిచేందుకే జరిగిన కుట్ర ఇది” అని దాదారావు తర్వాత వివరణనిచ్చారు.

  4. తారాస్థాయికి చేరువవుతున్నాం: ట్రంప్

    కరోనావైరస్ మహమ్మారి అమెరికాలో దాని తారాస్థాయికి చేరుకుంటోందని, మరణాలు ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

    అమెరికాలో ఇప్పటివరకూ 3.37 లక్షల మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణైంది. 9,600కుపైగా మంది ఈ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాలు వదిలారు.

    అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరుగుదల ఆగిపోతున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చీకటి సొరంగం చివర్లో తాను వెలుగును చూస్తున్నానని ఆయన అన్నారు.

    కరోనావైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న న్యూయార్క్‌లో ఆదివారం కొత్త ఇన్ఫెక్షన్లు, మరణాల సంఖ్య తగ్గింది. దీన్ని ‘మంచి సంకేతం’గా ట్రంప్ వర్ణించారు.

  5. హాస్పటల్‌లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను వైద్య పరీక్షల కోసం హాస్పటల్‌లో చేర్చారు. 10 రోజుల క్రితం ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థరణైంది.

    జ్వరం, ఇతర లక్షణాలు కూడా ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆయన్ను లండన్‌లోని ఓ హాస్పటల్‌లో చేర్చినట్లు డౌనింగ్ స్ట్రీట్ అధికారులు తెలిపారు. అయితే, ఇది వైద్యుల సలహా మేరకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్య మాత్రమేనని వెల్లడించారు.

    “కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన 10 రోజుల తర్వాత కూడా జ్వరం వంటి లక్షణాలు కొనసాగుతుండటంతో వైద్యుల సూచనల మేరకు ప్రధానిని హాస్పటల్‌లో చేర్చాం. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే” అని వారు తెలిపారు.

    ప్రస్తుతానికి ప్రధాని నేతృత్వంలోనే బ్రిటన్‌లో పాలన కొనసాగుతోంది, కానీ, సోమవారం కరోనావైరస్ వ్యాధి వ్యాప్తిపై జరిగే సమీక్షా సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి అధ్యక్షత వహించే అవకాశముంది.

  6. అమరావతి రైతులు, మహిళల నిరసన దివ్వెలు

    అమరావతిని ఆంధ్ర ప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ఉంచాలంటూ దీక్షలు చేస్తున్న మహిళలు, రైతులు అమరావతి శంకుస్తాపన శిలాఫలకం వద్ద దివ్వెలు వెలిగించారు.

  7. కరోనావైరస్‌పై పోరుకు దివ్వెలతో సంఘీభావం తెలిపిన భారత ప్రజలు