కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 42,000 దాటిన మరణాలు, వైరస్ సోకిన వారి సంఖ్య 8.6 లక్షలు
భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 1637కు చేరుకుంది. 38 మంది చనిపోయారు. ఏపీలో ఒకే రోజు 43 కొత్త కేసులు. మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది.
లైవ్ కవరేజీ
800 మందిని క్వారంటైన్‌కు పంపిన కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కర్ణాటకకు చెందిన 1500 మంది ఉన్నారు.
కర్ణాటక ఆరోగ్య శాఖ వారిలో 800 మందిని క్వారంటైన్‌లో ఉంచిందని, 143 మంది నుంచి శాంపిళ్లు సేకరించిందని చెప్పారు. వీరికి సంబంధించిన రిపోర్టులు రేపు వస్తాయని భావిస్తున్నారని బెంగళూరులోని జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ తెలిపారు.
“మా దగ్గర కేంద్రం పంపిన 1500 మంది జాబితా ఉంది. వారు నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని ఉంటే తక్షణం మమ్మల్ని సంప్రదించాలి. గత 14 రోజుల నుంచీ రాష్ట్రానికి వచ్చిన వారిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే హోం క్వారంటైన్‌లో ఉంచుతాం” అని కర్ణాటక ఉప ప్రధాన కార్యదర్శి జావేద్ అఖ్తర్ చెప్పారు.
కొంతమంది స్క్రీనింగ్ చేసే సంస్థలను సంప్రదించారు, వారిలో కొంతమంది స్వయంగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, కొంతమంది ప్రభుత్వం వారితో మాట్లాడిన తర్వాత ముందుకు వచ్చారు అని ఆయన చెప్పారు.
గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా రోగి బంధువుల దాడి
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లను ఒక రోగి బంధువులు కొట్టారని ఆస్పత్రి సూపరింటెండెట్ శ్రవణ్ ధ్రువీకరించారు.
అయితే, దీని గురించి పోలీసులు స్పష్టంగా ఏదీ చెప్పడం లేదు. అది చిన్న గొడవే అంటున్నారు.
"క్వారంటైన్లో ఎందుకు ఉండలేదని ప్రశ్నించడంతో రోగి బంధువులు ఒక సెక్యూరిటీ గార్డును కొట్టారని" స్థానిక ఏసీపీ చెప్పారు.
సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని జానియర్ డాక్టర్లు తమను కోరినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
మంత్రి ఈటల స్పందన
ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తక్షణం స్పందించారు.
“గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి?” అన్నారు.
“డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. డాక్టర్లు 24 గంటలు ప్రజల కోసం పని చేస్తున్నారు.వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టరుకూ రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము”అని చెప్పారు.
జూనియర్ డాక్టర్ల వాదన
వెంటిలేటర్ మీద ఉన్న కరోనా రోగి ఈరోజు చనిపోవడంతో మృతుడి సోదరులు డ్యూటీలో ఉన్న డాక్టర్లపై చేయిచేసుకున్నారని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చెప్పింది.
“ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ముగ్గురు సోదరులకూ కరోనా పాజిటివ్ వచ్చిందని, వారిలో 56 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, ఆయన పరిస్థితి విషమంగా ఉందని మిగతా ఇద్దరు సోదరులకు, వారి బంధువులకు చెప్పామని, దాంతో నిన్ననే వారు తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని డాక్టర్లు చెప్పారు. తాము అదనపు సెక్యూరిటీ ఇవ్వాలని కోరామని, కానీ ఇవ్వలేదని” తెలిపారు.
తబ్లీగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసా నిబంధనల ఉల్లంఘన
కరోనావైరస్ నియంత్రణపై తీసుకుంటున్న చర్యల గురించి అన్నిరాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు రుజువైందని, రాష్ట్రాలు వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించాలనీ కేబినెట్ సెక్రటరీ ఆదేశించారు.
ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన ప్రయోజనాలను వచ్చేవారం నుంచి పేదలకు అందించడం ప్రారంభించాలని ఆయన కోరారు.
ముంబయి ధారావిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ, ముంబయిలోని ధారావిలో ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడినట్లు ఏఎన్ఐ చెప్పింది.
ధారావిలో 56 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన్ను సియాన్ ఆస్పత్రికి తరలించారని బీఎంసీ అధికారులు చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
బాధితుడి కుటుంబంలోని మరో ఏడుగురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారికి రేపు పరీక్షలు చేస్తారు. వారు ఉంటున్న భవనాన్ని సీల్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీలో ఒకే రోజు 32 కొత్త కేసులు నమోదు
దిల్లీలో కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కు చేరింది.
దిల్లీ సీఎంఓ ఈ గణాంకాలు జారీ చేసింది.
- ·కొత్త కేసులు: 32
- ·మొత్తం పాజిటివ్ కేసులు: 152
- ·మర్కజ్ మసీదు కేసులు: 53
- ·మృతులు: 2
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుడి ఆత్మహత్యాయత్నం
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నిజాముద్దీన్ మర్కజ్ నుంచి దిల్లీలోని ఆస్పత్రికి తీసుకువచ్చిన వారిలో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారని ఏఎన్ఐ తెలిపింది.
"నిజాముద్దీన్ నుంచి తీసుకువచ్చిన అందరినీ దిల్లీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, ఆరో అంతస్తులో అడ్మిట్ చేశాం, వారిలో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు" ఆస్పత్రి అడ్మిన్ ఏఎన్ఐకి చెప్పారు.
"మేం అతడిని విజయవంతంగా కాపాడాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలూ చేపడుతున్నాం" అని ఆయన చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కరోనా వైరస్‌తో సైబీరియా మంత్రి మృతి
సైబీరియా పర్యావరణ శాఖ మంత్రి బ్రనిస్లావ్ బ్రాజిక్ కోవిడ్-19 వల్ల చనిపోయారు. ఈ వైరస్ వల్ల చనిపోయిన మొదటి సైబీరియా ప్రజా ప్రతినిధి ఈయనే.
బ్రాజిక్ సైబీరియా అధికార ప్రోగ్రెసివ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. ఆయన 1990ల్లో కూడా మంత్రిగా పనిచేశారు.
దేశంలో కరోనాకేసులు గణనీయంగా పెరిగాయి. సైబీరియాలో ఇప్పటివరకూ 1060 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30 మంది చనిపోయారు. దేశంలో అత్యవసర స్థితి ప్రకటించారు.
అమెరికాలో 2,40,000 మంది వరకూ చనిపోవచ్చు: వైట్ హౌస్
కరోనా వైరస్ వల్ల రాబోవు వారాల్లో అమెరికాలో లక్ష నుంచి 2,40,000 మంది వరకూ చనిపోవచ్చని వైట్ హౌస్ తాజాగా అంచనా వేసింది.
"దేశంలో ప్రజలు సోషల్ డిస్టన్సింగ్, ఐసొలేషన్ మార్గదర్శకాలను ఎంత కఠినంగా ఆచరిస్తున్నారు అనేదాన్ని బట్టి ఇది ఉంటుంది" అని అమెరికా అధికారులు హెచ్చరించారు.
ఏప్రిల్ 30 వరకూ పొడిగించిన ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుంటే, ఈ సంఖ్య ఇంకా పెరగచ్చని అంటున్నారు.
కరోనావైరస్: బ్రిటన్‌లో ఒకే రోజు 500 మందికి పైగా మృతి
- ·బ్రిటన్‌లో మొదటిసారి ఒకే రోజులో కరోనావైరస్‌కు గురైన 500 మందికి పైగా మృతిచెందారు.
- ·బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం మంగళవారం నుంచి ఇప్పటివరకూ 563 మంది చనిపోయారు..
- ·బ్రిటన్ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకూ 2,352 మంది మృతి చెందారు.
- ·కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 30 వేలకు చేరింది.

కరోనావైరస్: యూరప్‌లో 30 వేలు దాటిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
చైనాలో వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఐరోపా దేశాల్లో ఇప్పటివరకూ కరోనావైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 30 వేలు దాటింది.
జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 43.291 మంది మృతిచెందారు.
దీనితోపాటు చికిత్స తర్వాత బయటపడినవారి సంఖ్య 1,85,194కు చేరింది.
మహారాష్ట్రలో క్వారంటైన్‌కు మరో 15 మంది
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీలో మర్కజ్‌కు వెళ్లి థానే వచ్చిన 13 మంది బంగ్లాదేశీయులు, ఇద్దరు అస్సాం వాసులను క్వారంటైన్‌కు పంపినట్లు థానే పోలీసులు చెప్పారు.
వీరికి పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని థానే ముంబ్రా డీసీబీ సుభాష్ బుర్సే చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
తమిళనాడులో ఒకే రోజు 110 కరోనా పాజిటివ్ కేసులు
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తమిళనాడులో ఒకే రోజు 110 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏఎన్ఐ చెప్పింది.
తమిళనాడు నేషనల్ హెల్త్ మిషన్ వివరాల ప్రకారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయని, ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 234కు చేరిందని పేర్కొంది.
“వీరు ఎలాంటి రవాణా సౌకర్యాలు ఉఫయోగించారు?.. వారితో పాటూ ఎవరెవరు ప్రయాణించారు?, వాళ్లు ఏం చేస్తూ వచ్చారు? వీరందరూ ఎక్కడెక్కడికి వెళ్లారు? అన్నీ తెలుసుకుంటున్నాం”.
“ఈ సంఖ్య భారీగా ఉండడంతో దానికి చాలా సమయం పడుతుంది” అని తమిళనాడు హెల్త్ సెక్రటరీ బీల రాజేష్ ఏఎన్ఐతో చెప్పారు.
కరోనావైరస్: 'ఆంధ్రప్రదేశ్‌లోని 87 కేసుల్లో 70 మంది దిల్లీకి వెళ్ళి వచ్చిన వారే' - వైఎస్ జగన్, దిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంబంధీకులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ఫొటో సోర్స్, AP I &PR
దిల్లీలో జరిగిన మతపరమైన సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనావైరస్ సోకిందని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
బుధవారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, "రాష్ట్రంలో నమోదైన మొత్తం 87 కరోనావైరస్ కేసుల్లో 70 మంది దిల్లీ వెళ్లివచ్చిన వారే ఉన్నారు" అని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి పట్ల ఎవరూ వివక్ష చూపకూడదని, ఇతర రుగ్మతల నుంచి కోలుకున్నవారిని చూసినట్లే వారిని కూడా చూడాలని చెప్పిన ముఖ్యమంత్రి, ఎవరికి ఆరోగ్య సమస్య ఉన్నా 104 నంబరుకు ఫోన్ చేసి, వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కరోనావైరస్ కట్టడికి తెలంగాణ పకడ్బందీగా పని చేస్తోంది' - ఈటల రాజేందర్, మర్కజ్ గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనన్ని ఈటల

ఫొటో సోర్స్, Telangana CMO
ఫొటో క్యాప్షన్, తెలంగాణ సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనావైరస్ కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి తాజా పరిస్థితులను తెలుపుతూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, "దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్రమే" అని గుర్తు చేశారు.
అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదటగా కోరింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు.
దిల్ల నిజాముద్దీన్ మర్కజ్ గురించి కూడా తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి సమాచారం ఇచ్చిందని చెబుతూ, కేంద్రం ఇంకా చురుగ్గా పని చేయాలని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.
వైద్య ఆరోగ్య శాఖ పూర్తి ప్రకటన:

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 8.61 లక్షల కేసులు, 42 వేలు దాటిన మృతులు, భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 1637కు చేరింది. 38 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతటా కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వైరస్ సోకిన వారి సంఖ్య 8 లక్షల 60 వేలు దాటింది. ఇప్పటివరకు 42 వేలకు పైగా ప్రజలు కోవిడ్ వ్యాధికి బలయ్యారు.ఈ దేశంలో 1,89,633 మందికి వైరస్ సోకింది.
కరోనావైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పుడు అమెరికాలో అత్యధికం. ఇటలీలో 1,05,792 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటలీలో 12,428 మంది చనిపోయారు. అమెరికాలో మృతుల సంఖ్య 4 వేలు దాటింది.
భారతదేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 1637కు చేరింది. 38 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 87కు చేరింది.
కేరళలో 264 మందికి వైరస్ సోకింది. వీరిలో 23 మందికి వ్యాధి నయమైంది. ఇద్దరు చనిపోయారు.
మహారాష్ట్రలో 341 మందికి వైరస్ సోకింది. వీరిలో 39 మంది పూర్తిగా కోలుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి 9 మరణాలు నమోదయ్యాయి.
దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో 10కు పైగా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 43 కొత్త కోవిడ్ కేసులు, మొత్తం 87 మందికి వైరస్, ఏపీలో ఒకే రోజు నలభైకి పైగా కరోనా కేసులు

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో కొత్తగా 43 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 87కు చేరింది.
మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 373 శాంపిల్స్ పరీక్షించగా 43 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.
జిల్లాల వారీగా కోవిడ్ బాధితుల వివరాలు:
1. ప్రకాశం: 15
2. కడప: 15
3. పశ్చిమ గోదావరి: 13
4. విశాఖపట్నం: 11
5. గుంటూరు: 9
6. చిత్తూరు: 6
7. తూర్పు గోదావరి: 6
8. కృష్ణా: 6
9. నెల్లూరు: 3
10. అనంతపురం: 2
11. కర్నూలు: 1
మొత్తం 87 కరోనా కేసుల్లో ఇప్పటివరకు ఇద్దరు వ్యాధి నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న 25 వేల మందిపై పర్యవేక్షణ, జియో లొకేషన్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ ఉంటుందన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న 25 వేలకు పైగా కరోనా అనుమానితుల్ని వారి జియో లొకేషన్ ద్వారా రియల్ టైమ్‌లో ఆరోగ్య శాఖ ట్రాక్ చేస్తుందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు.
దిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారి ప్రభావం విస్తృత స్థాయిలో ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేను దిల్లీ వెళ్లాను, కానీ ఆ కార్యక్రమం కోసం కాదు: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేను మార్చి రెండున దిల్లీ వెళ్లాను కానీ, మర్కజ్ లో పాల్గొనడానికి కాదు అని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు.
సుప్రీం కోర్టులో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కేసు విచారణకు వెళ్లానని, కానీ కొన్ని సోషల్ మీడియా పేజీల్లో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో మరో 16 పాజిటివ్ కేసులు
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మహారాష్ట్రలో మరో 16 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 320కి చేరింది.
ఈ రాష్ట్రంలో కరోనావైరస్ కారణంగా 12 మంది చనిపోయారు.