మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది. మిజోరంలో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4న చేపట్టనున్నారు.

లైవ్ కవరేజీ

  1. రాజస్థాన్ ఎన్నికలు 2023: బీజేపీ 71 స్థానాలు, కాంగ్రెస్ 46 స్థానాల్లో ఆధిక్యం

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

    ఫొటో సోర్స్, ECI

    రాజస్థాన్‌లో 199 స్థానాలకు గాను ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

    ఉదయం 9:40 గంటల సమయానికి ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం..

    బీజేపీ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  2. ఎన్నికలు 2023: మొదటి రౌండ్‌లో ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది?

    మధ్యప్రదేశ్‌: మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి 7 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్‌లు ఆధిక్యంలో ఉన్నాయి.

    రాజస్థాన్: 34 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 17 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీఎస్పీ ఒక స్థానం, ఆర్‌ఎల్‌డీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    తెలంగాణ: బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ స్థానంలో ఆధిక్యంలో ఉంది.

    ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

    ఫొటో సోర్స్, ECI

  3. రాజస్థాన్‌ ఎన్నికలు 2023: ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం

    రాజస్థాన్‌లోని 199 స్థానాలకు సంబంధించి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

    ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో 199 స్థానాలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లుగా ఈసీ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: బీబీసీ డిబేట్ - లైవ్

  5. మూడు రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ

    అసెంబ్లీ ఎన్నికలు 2023

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు

    లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల కన్నా తక్కువ సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య సెమీ ఫైనల్‌ను తలపిస్తున్నాయి.

    రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

    ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

    రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది.

    మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో మళ్లీ తమదే విజయమని, హ్యాట్రిక్ ఖాయమని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విశ్వాసంగా ఉన్నారు.

  6. ఓట్ల లెక్కింపు ప్రారంభం .. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో గెలిచేదెవరు?

    కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు

    తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, ఓట్ల లెక్కింపు మొదలైంది.

    మిజోరం ఓట్ల లెక్కింపును డిసెంబరు 4న చేపడతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

    తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న పోలింగ్ జరగగా, మధ్యప్రదేశ్‌లో 230 నియోజకవర్గాలకు నవంబర్ 17న, ఛత్తీస్‌గఢ్‌లోని 90 నియోజకవర్గాలకు నవంబర్ 7న,రాజస్థాన్‌లో 200 నియోజకవర్గాలకునవంబర్ 23న,మిజోరంలో 40 నియోజకవర్గాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది.

    ఈ రాష్ట్రాలన్నింటిలోనూ మిజోరం మినహా మిగిలిన వాటికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది.

    ఇక పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే తెలంగాణలో పోలింగ్ శాతం - 71.34 ( 2018లొ 73.74) రాజస్థాన్‌లో పోలింగ్ శాతం 74.13 ( 2018 లో- 74.72), మధ్యప్రదేశ్‌లో మధ్యప్రదేశ్ పోలింగ్ శాతం -76.22 (2018లో- 75.63 ), ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ శాతం -76.31 ( 2018లో - 76.88) మిజోరంలో పోలింగ్ శాతం -78.40 ( 2018 లో -81.61) గా నమోదైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడ క్లిక్ చేయండి..

  8. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం