You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆసియా కప్ - ఇండియా vs పాకిస్తాన్: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.

లైవ్ కవరేజీ

  1. Aditya-L1 launch LIVE: ఇస్రో ఆదిత్య-ఎల్1 ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం చూడండి

    ఆదిత్య-ఎల్‌1ను భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నారు. ఆ మిషన్ ఇక్కడ లైవ్ చూడండి.

  2. ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది: దక్షిణ కొరియా

    దేశానికి దక్షిణ తీరంలో ఉత్తర కొరియా కొన్ని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.

    శనివారం ఉదయం జరిగిన ఈ ప్రయోగాలపై తాము విచారణ చేపడుతున్నట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

    తాము అమెరికాతో కలిసి పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

    కొన్ని రోజుల క్రితం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

    దక్షిణ కొరియాలో లక్ష్యాలపై న్యూక్లియర్ దాడులకు సన్నద్ధం కావడంలో భాగంగానే ఆ క్షిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా తెలిపింది.

  3. సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతి నేత థర్మన్ షణ్ముగరత్నం ఎవరు?

    భారత సంతతి ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 70 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

    66 ఏళ్ల షణ్ముగరత్నం ఇదివరకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం 24.8 లక్షల ఓట్లలో ఆయనకు 17.46 లక్షల ఓట్లు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

    రెండు, మూడు స్థానాల్లో చైనా మూలాలున్న కోక్ సాంగ్‌, తాన్ కీన్ లియాన్‌లకు వరుసగా 15.72, 13.88 ఓట్లు వచ్చాయి.

    ఈ ఎన్నికల ఫలితాలను శుక్రవారం రాత్రి ప్రకటించారు. దీంతో సింగపూర్ అధ్యక్షుడైన మూడో భారత సంతతి వ్యక్తిగా షణ్ముగరత్నం రికార్డు సృష్టించారు.

    సింగపూర్‌లోనే జన్మించిన షణ్ముగరత్నం ప్రముఖ ఆర్థికవేత్త. ఆయన తండ్రి తమిళ మూలాలున్న పాథాలజిస్టు. తల్లి చైనా సంతతివారు. ఆయనకు ఇంగ్లిష్, తమిళ్, మలయ్, మాండరీన్ భాషలు వచ్చు.

    బ్యాచిలర్ డిగ్రీని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి, మాస్టర్ డిగ్రీని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన పూర్తిచేశారు.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  5. ఇస్రో ఏర్పాటులో నెహ్రూ పాత్ర ఏమీ లేదనే ప్రచారం నిజమేనా?