దిల్లీ లిక్కర్ ‘స్కాం’: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలు వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టులో ఊరట దొరకలేదు.

లైవ్ కవరేజీ

  1. కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?

  2. టీమ్ ఇండియాలో ఎవరికెంత చెల్లిస్తారో తెలుసా

    కోహ్లీ, రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు సీజన్‌కు బీసీసీఐ క్రికెట్ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది.

    పురుషుల సీనియర్ క్రికెట్‌లో ఎవరు ఏ గ్రేడ్‌లో ఉన్నారు, ఎవరికెంత మొత్తం అందుతుందనేది వెల్లడించింది.

    ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు చెల్లించనున్నారు. ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, సి గ్రేడ్ ఆటగాళ్లకు రూ. కోటి చెల్లిస్తారు.

    బుమ్రా

    ఫొటో సోర్స్, Getty Images

    ఏ+ గ్రేడ్‌లో ఎవరెవరు ఉన్నారంటే..

    రోహిత్ శర్మ

    విరాట్ కోహ్లీ

    జస్‌ప్రీత్ బుమ్రా

    రవీందర్ జడేజా

    హార్దిక్ పాండ్యా

    ఫొటో సోర్స్, Getty Images

    ఏ గ్రేడ్‌లో ఎవరెవరు ఉన్నారంటే..

    హార్దిక్ పాండ్యా

    ఆర్.అశ్విన్

    మొహమ్మద్ షమీ

    రిషబ్ పంత్

    అక్షర్ పటేల్

    KL Rahul

    ఫొటో సోర్స్, Getty Images

    బి గ్రేడ్‌లో ఉన్నది వీరే..

    ఛటేశ్వర్ పుజారా

    కేఎల్ రాహుల్

    శ్రేయాస్ అయ్యర్

    మొహమ్మద్ సిరాజ్

    సూర్యకుమార్ యాదవ్

    శుభమన్ గిల్

    Dhawan

    ఫొటో సోర్స్, Getty Images

    సి గ్రేడ్‌లో ఉన్నది వీరే..

    ఉమేశ్ యాదవ్

    శిఖర్ ధవన్

    శార్దూల్ ఠాకుర్

    ఇషాన్ కిషన్

    దీపక్ హూడా

    యజువేంద్ర చాహల్

    కుల్దీప్ యాదవ్

    వాషింగ్టన్ సుందర్

    సంజు శాంసన్

    అర్షదీప్ సింగ్

    కేఎస్ భరత్

  3. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో దిల్లీ ఆసుపత్రులలో మాక్ డ్రిల్

    కోవిడ్ మాక్ డ్రిల్

    ఫొటో సోర్స్, ANI

    కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధత పరీక్షించుకునేందుకు దిల్లీలోని ఆసుపత్రులలో ఆదివారం మాక్ డ్రిల్ నిర్వహించారు.

    ఎమర్జెన్సీ సర్వీసులు, అంబులెన్సులు, హాస్పిటల్ అడ్మిషన్ ప్రక్రియ, కోవిడ్ వార్డులు, ఆక్సిజన్ వసతులు, వెంటిలేటర్లు వంటి ఏర్పాట్లన్నీ సమీక్షించుకున్నారు.

    దిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్(ఎల్ఎన్‌జేపీ) ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రస్తుతం 450 బెడ్‌లు కేటాయించారు.

    తమ ఆసుపత్రిలో మొత్తం 2000 పడకలు ఉండగా అందులో 450 కోవిడ్ రోగుల కోసం రిజర్వ్ చేసినట్లు ఎల్ఎన్‌జేపీ మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్ ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు. ఈ 450 బెడ్‌లకూ ఆక్సిజన్ సదుపాయం ఉన్నట్లు చెప్పారు.

  4. అమెరికా: సిక్కు పరేడ్‌లో కాల్పులు, ఇద్దరి పరిస్థితి విషమం

    సిక్కు పరేడ్‌లో కాల్పులు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అమెరికాలో జరిగిన సిక్కు పరేడ్‌లో కాల్పులు చోటుచేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

    రవీందర్ సింగ్ రాబిన్, బీబీసీ కోసం

    అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలోగురుద్వారాలో కాల్పులు జరగడంతో ఇద్దరు సిక్కులు గాయపడ్డారు. ఆ ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

    ఇది 'విద్వేషపూరిత హింస' కాదని, తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయని స్థానిక అధికార యంత్రాంగం చెప్పిందని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.

    బ్రాడ్‌ షా సిక్కు సొసైటీ తొలిసారిగా సిక్కు పరేడ్‌ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "పరేడ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు మతపరమైన కార్యక్రమానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాం. దాడి చేసినవారు కవాతులో భాగం కాదు'' అని సంబంధిత సిక్కు సొసైటీ తెలిపింది.

    అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  5. ఇజ్రాయెల్: కొత్త చట్టాన్ని వ్యతిరేకించిన రక్షణ మంత్రిని తొలగించిన నెతన్యాహు, ఆందోళనలకు దిగిన ప్రజలు

    ఇజ్రాయెల్‌లో నిరసనలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహు రక్షణ శాఖ మంత్రిని కేబినేట్ నుంచి తొలగించారు.

    ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల మంది ప్రజలు వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారు.

    జెరూసలేంలో, నెతన్యాహు నివాసానికి సమీపంలో ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు, సైనికులు జల ఫిరంగులను ప్రయోగించారు.

    బెంజమిన్ నెతన్యాహు తన రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ని కేబినెట్ నుంచి తొలగించిన తర్వాత ఈ నిరసనలు మొదలయ్యాయి.

    న్యాయవ్యవస్థ పరిధిని తగ్గించేలా తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని యోవ్ గాలంట్ శనివారం వ్యతిరేకించారు. ఆయన మాజీ సైనికుడు. కొత్త చట్టంపై ఇజ్రాయెల్ సైనిక బలగాలు కోపంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

    న్యాయమూర్తులను నియమించే కమిటీపై ప్రభుత్వానికి పూర్తి అధికారాలను కట్టబెట్టడం నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పుల్లో ఒకటి. కొత్త చట్టానికి ఈ వారంతంలోపు పార్లమెంటు ఆమోదముద్ర వేయించుకొనేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు.

    ఏదైనా పదవికి యోగ్యులుకాని నాయకుడిని లేదా నాయకురాలిని అందులోంచి తొలగించడం కోర్టులకు కష్టమవుతుంది.

    అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని చాలా మంది భావిస్తున్నారు. దీనిపై వారు ఆగ్రహంగా ఉన్నారు.

    ప్రతిపాదిత మార్పులు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను తగ్గిస్తాయని, అవినీతిని ప్రోత్సహిస్తాయని విమర్శకులు అంటున్నారు. కోర్టులు వాటి పరిధికి మించి అధికారాలు చలాయించడాన్ని అడ్డుకొనేందుకే సంస్కరణలు తెస్తున్నామని నెతన్యాహు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వీటికి ప్రజలు మద్దతు ఇచ్చారని అంటున్నారు.

    ఇజ్రాయెల్‌ పరిణామాలపై అమెరికా ఆందోళన

    ఇజ్రాయెల్‌ పరిణామాలపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.

    ప్రజాస్వామ్య వ్యవస్థలో మౌలిక మార్పులేవైనా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల మద్దతు ఉంటేనే చేయాలని అమెరికా అధ్యక్ష భవనం అధికారి ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ నాయకులు వీలైనంత త్వరగా రాజీ మార్గాన్ని కనుక్కోవాలని సూచించారు.

  6. డబ్ల్యూపీఎల్: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ముంబయి ఇండియన్స్

    ట్రోఫీతో సంబరాలు చేసుకొంటున్న ముంబయి ఇండియన్స్ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ట్రోఫీతో ముంబయి ఇండియన్స్ జట్టు

    వుమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 తొలి సీజన్ టైటిల్‌ను ముంబయి ఇండియన్స్ గెలుచుకుంది.

    ఆదివారం ముంబయిలోని బ్రబౌర్న్ స్డేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి జట్టు ఏడు వికెట్ల తేడాతో దిల్లీ కేపిటల్స్‌ను ఓడించింది.

    దిల్లీ కేపిటల్స్ జట్టు ముంబయి ఇండియన్స్‌కు 132 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

    సివర్ బ్రంట్ (55 బంతుల్లో 60 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యారు.

    అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు సాధించింది.

    ఇన్సింగ్స్ ప్రారంభించిన దిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

    ముంబయి ఇండియన్స్ బౌలర్ ఇసి వాంగ్ రెండో ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి దిల్లీని ఇబ్బందుల్లో పడేశారు.

    ఆ తర్వాత దిల్లీ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. కెప్టెన్ మెగ్ లానింగ్ చేసిన 35 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

    షెఫాలీ వర్మ (11 పరుగులు), ఎలిస్ క్యాప్సీ (0), జెమీమా (9), మారిజానె క్యాప్ (18), జెస్ జొనాసెన్ (2), తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అరుంధతీ రెడ్డి డకౌట్ అయ్యారు.

    చివరి ఓవర్లలో శిఖా పాండే, రాధా యాదవ్‌ల జోడీ ముంబయి బౌలర్లపై విరుచుకుపడటంతో దిల్లీకి గౌరవప్రదమైన స్కోరు దక్కింది.

    చివరి వికెట్‌కు కేవలం నాలుగు ఓవర్లలోనే 52 పరుగులు జోడించారు.

    ముంబయి బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగుఓవర్లలో కేవలం ఐదుపరుగులు మాత్రమే ఇచ్చి మూడువికెట్లు పడగొట్టారు.

  7. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తుండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.