దిల్లీ లిక్కర్ ‘స్కాం’: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలు వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టులో ఊరట దొరకలేదు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    రేపు ఉదయం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా సమాచారంతో మళ్లీ కలుద్దాం.

  2. ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్‌ కోసం పెనాల్టీగా రూ.3 కోట్లు కట్టాం.. వై వి సుబ్బారెడ్డి

    తిరుమల తిరుపతి దేవస్థానం

    ఫొటో సోర్స్, TTDevasthanams

    ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీకి) ఆర్‌బీఐ జరిమానా విధించింది. దీనిపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు.

    "విదేశీ విరాళాలను ఫారిన్ కాంట్రిబ్యూషన్(రెగ్యులైజేషన్) యాక్ట్ కింద తీసుకోవడానికి హోమ్ మినిస్టరీ లైసెన్స్ ఉండేది. దాన్ని 2018కి ముందు రద్దు చేశారు. అప్పట్లో సరిగ్గా డాక్యుమెంట్లు సమర్పించలేదని క్యాన్సిల్ చేశారు.

    గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఫారిన్ కరెన్సీ తీసుకోలేదు. అయితే, భక్తులు నేరుగా హుండీలో వేస్తున్నారు. దాదాపు రూ.30 కోట్ల ఫారిన్ కరెన్సీ ఇప్పుడు మా దగ్గర ఉంది. దాన్ని కన్వర్ట్ చేసుకునేందుకు లైసెన్స్ లేదు కాబట్టి, ఈ ఫారిన్ కరెన్సీ ఎలా వచ్చింది అని ఆర్‌బీఐ ప్రశ్నించింది. కానీ, దీన్ని భక్తులు హుండీలో వేస్తున్నారు.

    ఇది ధార్మిక సంస్థ. వ్యాపార సంస్థ కాదు. దీనికి సడలింపులు ఇచ్చి, లైసెన్స్‌ రివైండ్ చేయాలని కోరాం. అప్పుడు ఎందుకు అలా జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు మేం సహకరిస్తామని ముందుకొచ్చాం.

    గతంలో చేసిన దానికి పెనాల్టీ కట్టాలన్నారు. దానికి కూడా తయారయ్యాం. రూ.3 కోట్లు కూడా కట్టాం. స్వామివారి దగ్గర భక్తులు వేసిన కానుకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాబోయే పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది" అని సుబ్బారెడ్డి చెప్పారు.

  3. నిఖత్ తండ్రి: నెలరోజులుగా ఎంత కష్టపడ్డదంటే...

  4. ఆంధ్రప్రదేశ్: పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా? ప్రాజెక్ట్ స్వరూపాన్ని బ్యారేజ్‌గా మార్చేస్తున్నారా?

  5. ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?

  6. కర్నాటక: బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్

    లంచం కేసులో కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్పను అరెస్టు చేశారు.

    విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ దొరికారు. ఆ కేసులో మదల్ విరూపాక్షప్ప కూడా నిందితునిగా ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. క్రికెట్: టీం ఇండియా‌కు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు సవాలుగా మారారా..? విరాట్ కోహ్లీ వారిని ఎదుర్కోగలడా?

  8. భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీలో సమ్మె

    భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీలో రాయబారి సహా సిబ్బంది సమ్మె చేస్తున్నారు.

    ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడి సిబ్బంది సమ్మె చేస్తున్నారు.

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశంలో న్యాయవ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వివాదాస్పద సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి.

    అందులో భాగంగానే భారత్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది కూడా వారికి సంఘీభావం ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి నోటీసులు

    అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చిందంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీకి సూరత్‌లోని కోర్టు రెండేళ్ల శిక్ష వేయడంతో ఆయనపై అనర్హత వేటు వేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ఇజ్రాయెల్‌: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?

  11. రాహుల్ గాంధీకి సావర్కర్ మనవడి సవాల్

    ‘క్షమాపణ చెప్పడానికి నేనేమీ సావర్కర్‌ కాదు, నేను గాంధీ’ అని రాహుల్ గాంధీ అనడంపై వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు వీడీ సావర్కర్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

    తన ముత్తాత సావర్కర్ బ్రిటిషర్లకు క్షమాపణ చెప్పినట్లు ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ చేశారు.

    రాహుల్ గాంధీయే రెండు సార్లు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారని ఆయన అన్నారు.

    రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని.. దేశభక్తుల పేర్లతో రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. దిల్లీ లిక్కర్ స్కాం: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలు వాయిదా

    కవిత

    ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టులో ఊరట దొరకలేదు.

    ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన బెంచ్ ఈ కేసు విచారణను మూడు వారాలు వాయిదా వేశారు.

    తొలుత మార్చ్ 24న కేసు విచారించాల్సి ఉండగా ఆ రోజున మార్చ్ 27(సోమవారం)కి వాయిదా వేశారు.

    తాజాగా మరో మూడు వారాలు వాయిదా వేశారు.

    కాగా కవిత ఇప్పటికే మూడు సార్లు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

    కవితను ఈడీ కార్యాలయంలో కాకుండా ఇంట్లోనే విచారించడానికి సంబంధించిన అంశం కావడం కోర్టు విచారణకు తీసుకోవాలని ఆమె తరఫున వాదించిన కపిల్ సిబల్ కోరినప్పటికీ కోర్టు ఆ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఎలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేదు.

  13. గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?

  14. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఓబీసీ ఎంపీల నిరసన

    ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఓబీసీ ఎంపీలు నిరసన తెలిపారు.

    రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

    తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. తిరుపతిలో పందుల బెడద.. స్థానికులకు అంతుచిక్కని జ్వరాలు

  16. మీ జ్ఞాపకశక్తి బాగుండాలంటే ఈ చిట్కాలు పాటించండి

  17. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

    సుప్రీంకోర్ట్

    ఫొటో సోర్స్, Getty Images

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జాప్యంపై సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవసరమైతే దర్యాప్తు అధికారిని మార్చాలని చెప్పింది.

    జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్.. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మార్చడంపై మార్చ్ 29 సరికి అభిప్రాయం చెప్పాలని సీబీఐ డైరెక్టర్‌కు సూచించింది.

  18. గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?

  19. దొంగ ఓట్లతోనే గెలిచాను: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

    Rapaka Vara Prasad

    ఫొటో సోర్స్, UGC

    జనసేన నుంచి గెలిచి, వైఎస్సార్సీపీకి పక్షం వహించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివాదంలో ఇరుక్కున్నారు.

    ఆయన తన అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

    దొంగ ఓట్లు వేయడం వల్ల తానే గెలిచానంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో బయటకు రావడం ఈ వివాదానికి కారణం.

    తన స్వగ్రామం చింతలమోరిలో వేసిన దొంగ ఓట్ల కారణంగానే తనకు అప్పట్లో 800 ఓట్ల మెజార్టీ వచ్చిందని ఆయన అన్నారు.

    2009లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుపున గెలిచిని ఆయన 2019లో జనసేన అభ్యర్థిగా రెండోసారి రాజోలు ఎమ్మెల్యేగా గెలిచారు.

    విజయం తర్వాత ఆయన జనసేనకి దూరమై, వైఎస్ జగన్‌కు జై కొట్టారు.

    తన విజయానికి జనసేన ఓటర్ల మద్ధతు కారణం కాదని చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు.

    రాపాక మీద చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నట్టు జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ప్రకటించారు.

  20. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి వేదిక పంచుకున్న బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషి, బీజేపీ అంటే బలత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ కేటీఆర్ విమర్శలు

    గుజరాత్ ప్రభుత్వం శనివారం దాహోద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వేదికపై  శైలేష్ భట్ కనిపించారు.

    ఫొటో సోర్స్, DAHOD DISTRICT INFORMATION DEPARTMENT

    బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి శిక్ష అనుభవించినవారిలో ఒకరైన శైలేష్ భట్ మరోసారి వార్తల్లో నిలిచారు.

    గుజరాత్ ప్రభుత్వం శనివారం దాహోద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వేదికపై ఆయన కనిపించారు.

    ఆయనతో పాటు బీజేపీ ఎంపీ జశ్వంత్ సింగ్ భాబోర్, బీజేపీ ఎమ్మెల్యే శైలేశ్ భాబోర్ కూడా అదే వేదికపై ఉన్నారు.

    Bilkis

    ఫొటో సోర్స్, Getty Images

    వీరంతా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అందులో శైలేష్ భట్ ముందువరుసలో కూర్చుని కనిపించారు. అక్కడ వేదికపై ఉన్న బ్యానర్‌పై ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఫొటోలున్నాయి.

    అయితే, వేదికపై శైలేష్ భట్ ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అనేది తనకు తెలియదని ఎమ్మెల్యే శైలేష్ భాబోర్ చెప్పారు.

    కాగా బిల్కిస్ బానో అత్యాచార దోషి శైలేష్ భట్‌ను ఈ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారో తమకు తెలియదని దాహోద్ అధికారులు చెప్పారు.

    దీనిపై విపక్షాలకు చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు. బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులు 11 మంది 2022 ఆగస్ట్‌లో జైలు నుంచి విడుదలయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ దీనిని బీజేపీ పేరుతో ముడిపెడుతూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

    బీజేపీని బలత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అని ఆయన అభివర్ణిస్తూ.. బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులతో బీజేపీ నేతలు వేదిక పంచుకోవడం ఆ పార్టీ మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2