You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: వీధి కుక్కల దాడిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

జీఎంహెచ్‌సీ అసలు ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. మీ నిర్లక్ష్యంతో పసిబాలుడు చనిపోయాడని మందలించింది.

లైవ్ కవరేజీ

  1. ఒకటో తరగతిలో చేరటానికి కనీస వయసు ఆరేళ్లు.. రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం

    పిల్లలను స్కూల్లో మొదటి తరగతిలో చేర్చటానికి కనీస వయసును ఆరేళ్లుగా నిర్ణయించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ నిర్దేశించింది.

    కొత్త విద్యా విధానం ప్రకారం.. ప్రాధమిక విద్యా దశలో మూడేళ్ల పాటు ప్రీ-స్కూలింగ్, ఆ తర్వాత ఒకటి, రెండు తరగతుల్లో చదువు (మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసు) ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు.

    ‘‘పిల్లలు ప్రీస్కూల్ నుంచి రెండో తరగతి వరకూ ఎలాంటి అవాంతరాలూ లేకుండా నేర్చుకునేలా ఈ విధానం చూస్తుంది. స్కూలులో చేరటానికి ముందు మూడేళ్ల నాణ్యమైన ప్రీస్కూల్ విద్య ఉంటేనే ఇది సాధ్యమవుతుంది’’ అని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

    పిల్లల వయసు, స్కూల్ అడ్మిషన్ విధానాలను సమన్వయం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెప్పామన్నారు. ఈ విధానం ప్రకారం ఒకటో తరగతిలో చేరటానికి పిల్లల కనీస వయసు ఆరేళ్లుగా ఉండాలన్నారు.