You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముదురుతున్న ‘గూఢచారి బెలూన్’ వివాదం, అమెరికా విదేశాంగ మంత్రి చైనా పర్యటన వాయిదా
చైనా 'గూఢచారి బెలూన్' అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎగురుతున్నట్టు కనిపించడంతో, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది. ఇది చైనా నిఘా బెలూనేనని అమెరికా అనుమానిస్తోంది.
లైవ్ కవరేజీ
తెలంగాణ: నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తోన్న తెలంగాణ సచివాలయంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పాయి.
దాదాపు మూడేళ్ల నుంచి ఈ భవనం నిర్మాణం కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో అంటే, ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవ ముహూర్తం ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రస్తుతానికి ఎవరికీ హాని జరిగినట్టుగా సమాచారం లేదు. అయితే సచివాలయం పైన నిర్మించిన గుమ్మటంలో నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి.
దట్టమైన నల్లటి పొగలు ఆ చుట్టపక్కల చాలా దూరం వరకూ కనిపించాయి. దీంతో చుట్టుపక్కల స్టేషన్ల నుంచి పలు ఫైర్ ఇంజిన్లు హుటా హుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పాయి.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.