ప్రముఖ నటుడు చలపతి రావు మృతి
ప్రముఖ తెలుగు నటుడు చలపతి రావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 78 ఏళ్లు.
1944 మే 8న కృష్ణా జిల్లాపామర్రు మండలం బల్లిపర్రులో చలపతి రావు జన్మించారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
దర్శకుడు, రచయిత, నటుడు రవిబాబు ఆయన కుమారుడు.
1200లకు పైగా సినిమాల్లో చలపతి రావు నటించారు.
నారా చంద్రబాబు నాయుడు సంతాపం
చలపతి రావు మృతికి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
‘‘ ప్రముఖ నటుడు చలపతి రావు మృతి దిగ్భ్రాంతి కలిగించిందది. రెండు రోజుల వ్యవధిలో టాలీవుడ్ ఇద్దరు గొప్ప నటులను కోల్పోయింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.