ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
చైనాతో సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితిపై గురువారం మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

ఫొటో సోర్స్, ANI
కరోనా విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
చైనాతో సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితిపై గురువారం మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశం అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘కరోనా విషయంలో రాష్ట్రాలన్నీ పూర్తి అప్రమత్తతలో వ్యవహరించాలి. కోవిడ్ ఇంకా ముగియలేదు. కోవిడ్ పరీక్షలను పెంచాలి. అధికారులు ముఖ్యంగా విమానాశ్రయాల్లో నిఘా పెంచాలి.
ఆసుపత్రులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్‌ఏప్లాంట్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి.
జీనోమ్ సీక్వెన్సింగ్, కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలి. ప్రజలంతా కోవిడ్‌ను నివారించేలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ సమావేశంలో చెప్పినట్లు పీఎంవో ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇద్దరు తెలుగు కవులు వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రలకు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
వారాల ఆనంద్ అనువాద రచన “ఆకుపచ్చని కవిత’, మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మ పరాగం’ అనే నవల ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.
ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ. 50 వేల నగదు బహుమానం అందజేస్తారు.

ప్రముఖ ఉర్దూ, పంజాబీ కవి ‘గుల్జార్’ రాసిన ‘గ్రీన్ పోయమ్స్’ను కరీంనగర్‌కు చెందిన కవి, సినీ విమర్శకులు వారాల ఆనంద్ ‘ఆకుపచ్చని కవిత’ పేరుతో అనువదించారు. ప్రకృతి, చెట్లతో మానవాళి అనుబంధం ప్రధాన అంశంగా ఈ పుస్తకంలో కవితలు ఉంటాయి.
‘గుల్జార్ వంటి గొప్ప భావ కవి రచన అనువాదానికి నాకు సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఇతర భాషల రచనల నుంచి తెలుగులో అనువాద ప్రక్రియ మరింతగా జరగాల్సి ఉంది. ఇరుగు, పొరుగును చూడకుండా ప్రాపంచిక ధోరణులను అర్థం చేసుకోలేం. ఇతర భాషల సాహిత్యం, రచనలు కవుల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి’’ అని బీబీసీతో వారాల ఆనంద్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
దేశంలో కరోనా పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ, హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముందు, ఆరోగ్య మంత్రి మాన్‌సుఖ్ మాండవియా కరోనా గురించి లోక్‌సభలో మాట్లాడారు. ‘‘రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యారాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం గురించి అవగాహన ప్రచారాలను నిర్వహించాలి.
ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలను ప్రారంభించాం. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం.
పండుగలు, నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, సామాజిక దూరాన్ని పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, golden_rain_productions/Instagram
స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను గురువారం పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
‘ఖుదీరామ్ బోస్’ పేరుతో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ చిత్ర ప్రదర్శన గురువారం సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీ మహదేవ్ రోడ్‌లోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో పార్లమెంట్ సభ్యుల కోసం ప్రదర్శించనున్నారు.
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పైడి.వి.ఎస్.రాజు దర్శకత్వంలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగర్లమూడి టైటిల్ పాత్రలో నటించారు.

ఫొటో సోర్స్, golden_rain_productions/Instagram
ఈ చిత్రానికిసంగీత దర్శకుడిగా మణిశర్మ,ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గారసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ బాధ్యతలను నిర్వహించగా బాలాదిత్య రైటర్‌గా వర్క్ చేశారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది.
దీంతో పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేక షోను ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా సమాచార, మంత్రిత్వ శాఖ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్ ఇందు, ఫిల్మ్స్ డివిజన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, ANI
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఈరోజు ఆయన పిటిషన్‌పై దిల్లీ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
అఫ్తాబ్ పూనావాలా డిసెంబర్ 15న బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే, అఫ్తాబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై బెయిల్ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించారలని కోర్టును కోరారు.
అవగాహన లోపం కారణంగానే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అఫ్తాబ్ తరపు న్యాయవాది ఎంఎస్‌ఖాన్ కోర్టుకు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అదనపు సెషన్స్ జడ్జి బృందా కుమారి మాట్లాడుతూ, బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకున్నారు కాబట్టి, దాన్ని కొట్టివేస్తున్నట్లు తెలిపారు.
"అఫ్తాబ్‌పై ఇంకా ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు కానీ, బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అతడి న్యాయవాది ముందు మానవత్వంతో ఆలోచించాలి. ఆ తరువాత నేరస్థుడితో నిలబడాలి. ఏదిఏమైనా బెయిల్ పిటిషన్ వాపస్ తీసుకున్నారు" అని శ్రద్ధ తండ్రి తరపు న్యాయవాది అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టస్టు మ్యాచ్ గురువారం మీర్‌పుర్‌లోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో ప్రారంభమైంది.
ఆతిథ్య బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత బౌలర్ ఉనద్కత్ టెస్టు జట్టులోకి వచ్చాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
మొమినుల్ హక్ (30), ముష్పికర్ రహీం (22) క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, ఉనద్కత్, ఉమేష్ యాదవ్‌లు ఒక్కో వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్స్ నజ్ముల్ హాసన్ శాంటో 24, జకీర్ హాసన్ 15, షకీబుల్ హాసన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అమెరికా పర్యటనలో భాగంగా తన ట్రేడ్‌మార్క్ డ్రెస్ అయిన కంబాట్ గ్రీన్ స్వెట్‌షర్ట్, బూట్లను ధరించారు.
"మా విలువలు, స్వాతంత్ర్యం కాపాడుకోవడానికి మద్దతుగా" అమెరికా కాంగ్రెస్ అదనపు రూ. 3.73 లక్షల కోట్ల ప్యాకేజీ అందిస్తుందని ఆశిస్తున్నట్టు జెలియెన్‌స్కీ చెప్పారు.
అయితే, వచ్చే జనవరిలో ప్రతినిధుల సభను హస్తగతం చేసుకోనున్న రిపబ్లికన్లు యుక్రెయిన్ కోసం "బ్లాంక్ చెక్కు" రాయబోమని హెచ్చరించారు.
"అమెరికా కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు వచ్చినా" తమ దేశానికి ద్వైపాక్షిక మద్దతు ఉంటుందని విశ్వసిస్తున్నట్టు జెలియెన్‌స్కీ పేర్కొన్నారు.
వైట్‌హౌస్ సమావేశం తరువాత యుక్రెయిన్ అధ్యక్షుడు కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో ప్రసంగించారు.
తమ దేశం "అన్ని కష్టాలను ఎదురొడ్డి పోరాడుతుందని", వచ్చే ఏడాది "ఈ యుద్ధంలో మలుపు వస్తుందని" ఆశిస్తున్నట్టు చెప్పారు. తమ దేశానికి మరిన్ని ఆయుధాలు అవసరమని తెలిపారు.
బుధవారం వాషింగ్టన్ ప్రకటించిన భద్రతా సాయం ప్యాకేజీలో కొత్త పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ ఉంది. రష్యా ప్రయోగించే క్షిపణులు, డ్రోన్‌ల నుంచి యుక్రెయిన్ నగరాలను రక్షించడంలో ఇది సాయపడనుంది.
జెలియెన్‌స్కీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "పేట్రియాట్స్ ఇన్‌స్టాల్ చేశాక ఏం చేస్తాం? మాకు మరిన్ని పేట్రియాట్ సిస్టంలు కావాలని అధ్యక్షుడు బైడెన్‌కు మరో సంకేతం పంపుతాం. మేం యుద్ధంలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి" అన్నారు.
దానికి బైడెన్ నవ్వుతూ, "మేం దానిపై పనిచేస్తున్నాం" అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
బైడెన్‌తో జెలియెన్‌స్కీ భేటీపై రష్యా స్పందన
ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అత్యాధునిక క్షిపణి వ్యవస్థను యుక్రెయిన్‌కు అందించడం రెచ్చగొట్టే చర్య అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.
అంతకుముందు బుధవారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, యుక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తమను తప్పు పట్టకూడదని, రెండు దేశాలూ విషాదాన్ని భరిస్తున్నాయని అన్నారు.
ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ఇరువైపులా కనీసం లక్ష మంది సైనికులు మరణించారు లేదా గాయపడ్డారని, సుమారు 40,000 మంది పౌరులు మరణించారని అమెరికా మిలటరీ అంచనా వేసింది.
సుమారు 78 లక్షల మంది యుక్రెయిన్ నుంచి ఐరోపాకు శరణార్థులుగా వెళ్లారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

ఫొటో సోర్స్, twitter/RRRMovie
ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటకు స్థానం దక్కింది. ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో పోటీపడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ ప్రకటించింది.
అందులో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు చోటు దొరికింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అవార్డులకు పోటీపడబోయే చిత్రాలు, కేటగిరీల వారీగా జాబితాను అకాడమీ బుధవారం విడుదల చేసింది.
ఇందులో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడబోయే 15 పాటల్లో ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు చోటు దక్కింది.
ఈ విషయాన్ని అకాడమీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇద్దరు పోటీ పడి మరి డ్యాన్స్ చేశారు.
ఈ పాటకు కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ అందించారు. ఈ పాట దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.
మరోవైపు ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడబోయే చిత్రాలలో భారతదేశానికి చెందిన గుజరాతీ సినిమా ఛెల్లే షో (లాస్ట్ ఫిల్మ్ షో) కి కూడా స్థానం దక్కింది. ఈ సినిమాకి పాన్ నళిన్ దర్శకత్వం వహించారు.
మరో రెండు భారత చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచాయి. వీటిలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ''ఆల్ ది బ్రీత్స్'', బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ''ది ఎలిఫెంట్ విష్పరర్స్'' చోటు దక్కించుకున్నాయి.
అకాడమీ మొత్తం 10 విభాగాల్లో షార్ట్‌లిస్ట్ విడుదల చేసింది. వీటిలో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్), డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, లైవ్-యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. జనవరి 12-17 వరకు ఈ నామినేషన్లకు ఓటింగ్ జరగనుంది.
జనవరి 24న తుది ఐదు నామినేషన్లను ప్రకటిస్తారు.
మార్చి 12న అకాడమీ ఆస్కార్ అవార్డు విజేతలను ప్రకటిస్తుంది.

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
ప్రధాని నరేంద్ర మోదీ దుస్తులపై టీఎంసీ నేత కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది.
ఆయన ట్వీట్ మోదీని అవమానిస్తున్నట్టుగా ఉందని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో పర్యటించారు. ఆ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన మేఘాలయ స్థానిక దుస్తులను ధరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అటువంటివే దుస్తులు ధరించిన మహిళ ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ స్క్రీన్ షాట్‌ను, మోదీ ఫొటోను పక్కపక్కనే పెట్టి కీర్తి ఆజాద్ ట్వీట్ చేశారు. మోదీ దుస్తులపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
"ఆయన మగ కాదు, ఆడ కాదు, కేవలం ఒక ఫ్యాషన్ పూజారి" అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విరుచుకుపడ్డారు. మేఘాలయ సంస్కృతిని అవమానిస్తున్నారని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ట్వీట్ అన్ని అన్ని విధాలా అవమానకరమని బీజేపీ ఆదివాసీ మోర్చా ట్వీట్ చేసింది. మేఘాలయ గిరిజన దుస్తులను ధరించి ప్రధాని మోదీ అక్కడి సంస్కృతిని గౌరవించారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కీర్తి ఆజాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దీనిపై కీర్తి ఆజాద్ స్పందిస్తూ "ఆయన (మోదీ) దుస్తులను నేను అవమానించలేదు. నాకు చాలా నచ్చాయి. ప్రధానికి ఫ్యాషన్‌పై ఉన్న ఆసక్తి గురించి చెప్పడమే నా ఉద్దేశం" అని అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ బుధవారం వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు.
రష్యాతో యుద్ధం జరుగుతున్నంత కాలం యుక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని జో బైడెన్, జెలియెన్‌స్కీకి హామీ ఇచ్చారు.
"మీరు ఎప్పటికీ ఒంటరివారు కారు" అని బైడెన్ అన్నారు.
రష్యా యుద్దం మొదలైనప్పటి నుంచి యుక్రెయిన్ అధ్యక్షుడికి ఇదే మొదటి విదేశీ పర్యటన. ఈ సందర్భంగా, బుధవారం జెలియెన్‌స్కీ అమెరికాలోని వైట్ హౌస్‌ని సందర్శించారు.
యుక్రెయిన్‌కు సాయంగా బైడెన్ సుమారు రూ. 16,575 కోట్ల ప్యాకేజీ (2 బిలియన్ యూఎస్ డాలర్లు) ప్రకటించారు. వచ్చే ఏడాది కోసం మరో రూ. 3.73 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
అమెరికా అందిస్తున్న మద్దతుకు జెలియెన్‌స్కీ బైడెన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
బుధవారం బైడెన్, జెలియెన్‌స్కీ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో బైడెన్ మాట్లాడుతూ, యుక్రెయిన్‌కు సహకారం అందించడంపై ఎటువంటి ఆందోళన లేదని అన్నారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని మిత్రదేశాలు ఆహారం, ఇంధనాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాప్పటికీ, ఆ దేశాలు యుక్రెయిన్‌కు అందిస్తున్న మద్దతును బైడెన్ ప్రశంసించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ క్రూరమైన యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని బైడెన్ అన్నారు.
యుక్రెయిన్‌ను ముఖ్యమైన మిత్రదేశంగా భావిస్తూ అమెరికా సుమారు రూ.4.1 లక్షల కోట్ల ప్యాకేజీతో మానవత, ఆర్థిక, భద్రత సాయం ప్రకటించింది. మిగతా దేశాలు అందించిన సహాయం కన్నా ఇది చాలా ఎక్కువ.