రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌లో విజయసాయి రెడ్డి, పీటీ ఉషలకు చోటు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌లో చోటుదక్కింది.
ఈ మేరకు సోమవారం రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో విజయసాయి రెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేర్చారు.
ఆయనతో పాటు పీటీ ఉషను కూడా ఈ ప్యానల్‌లో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందు విజయసాయి రెడ్డి పేరుని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో ఉన్నట్లు చెప్పినా.. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్కర్ సభలో ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు.
తాజాగా జాబితాలో ఆయన పేరును చేర్చడంతో విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.